Thandel: తండేల్‍కు దేవీశ్రీ ప్రసాద్‍ను వద్దనుకున్నాం.. కానీ: అల్లు అరవింద్.. మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వాయిదా-allu arjun convinced me to taking devi sri prasad for thandel movie says allu aravind ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thandel: తండేల్‍కు దేవీశ్రీ ప్రసాద్‍ను వద్దనుకున్నాం.. కానీ: అల్లు అరవింద్.. మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వాయిదా

Thandel: తండేల్‍కు దేవీశ్రీ ప్రసాద్‍ను వద్దనుకున్నాం.. కానీ: అల్లు అరవింద్.. మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వాయిదా

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 01, 2025 04:46 PM IST

Thandel: తండేల్ సినిమాకు ముందు దేవీప్రసాద్‍ను మ్యూజిక్ డైరెక్టర్‌గా వద్దనుకున్నామని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. అల్లు అర్జున్ ఒప్పించిన విషయాన్ని చెప్పారు.

Thandel: తండేల్‍కు దేవీశ్రీ ప్రసాద్‍ను వద్దనుకున్నాం.. కానీ: అల్లు అరవింద్.. మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వాయిదా
Thandel: తండేల్‍కు దేవీశ్రీ ప్రసాద్‍ను వద్దనుకున్నాం.. కానీ: అల్లు అరవింద్.. మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వాయిదా

తండేల్ చిత్రం రిలీజ్‍కు రెడీ అవుతోంది. యవసామ్రాట్ నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు పాటలు మంచి బజ్ క్రియేట్ చేశాయి. మూడు సాంగ్స్ పాపులర్ అయ్యాయి. మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ మంచి ట్యూన్స్ ఇచ్చారు. అయితే, తండేల్ చిత్రానికి ముందుగా దేవీ వద్దని తాను అనుకున్నానని అల్లు అరవింద్ వివరించారు.

అందుకే దేవీని వద్దనుకున్నాం

తండేల్ సినిమా కోసం నాగచైతన్య, సాయిపల్లవి, దర్శకుడు చందూ మొండేటి, నిర్మాత అల్లు అరవింద్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. దీంట్లో ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు అరవింద్. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్‍ను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకుందామని చందూ అంటే ముందు తాను వద్దన్నానని తెలిపారు.

పుష్ప 2 చిత్రం కూడా ఉండటంతో దేవీ ప్రసాద్ దానిపైనే ఎక్కువ ఫోకస్ చేస్తాడని, తండేల్‍కు ఎక్కువ టైమ్ కేటాయించడేమోనని అనుకున్నట్టు అరవింద్ తెలిపారు. అందుకే ముందు అతడిని వద్దనుకున్నట్టు తెలిపారు. దేవీ తనకు చాలా క్లోజ్ అని, బయట ఎక్కడ కలిసినా ఇద్దరం ప్రేమికుల్లా కౌగిలించుకుంటామని చెప్పారు. దేవీ అంటే తనకు అంత ఇష్టమని, కానీ ఈ చిత్రానికి దేవీ కరెక్టేనా అని ఆలోచించినట్టు వెల్లడించారు.

అల్లు అర్జున్ చెప్పటంతో..

తండేల్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎవరిని పెట్టుకోవాలని అల్లు అర్జున్‍తో ఓ రోజు డైనింగ్ టేబుల్ వద్ద మాట్లాడానని అల్లు అరవింద్ తెలిపారు. దేవీశ్రీ ప్రసాద్ అనుకుంటే.. మీరు పుష్ప 2కు టైమ్ అంతా లాగేస్తారని, అందుకే వద్దనుకుంటున్నామన్నట్టు చెప్పానని తెలిపారు. లవ్ స్టోరీ కాబట్టి దేవీనే తీసుకోవాలని, ఇంకేం ఆలోచించొద్దని అల్లు అర్జున్ అన్నారని అల్లు అరవింద్ తెలిపారు. మొత్తంగా అల్లు అర్జున్ చెప్పాక దేవీని తండేల్‍కు ఫిక్స్ చేశామని చెప్పారు.

తండేల్ నుంచి ఇప్పటి వరకు మూడు పాటలు వచ్చాయి. బుజ్జితల్లి, శివశక్తి, హైలెసా సాంగ్స్ లిరికల్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. బుజ్జితల్లి పాట మోత మోగుతోంది. ఈ చిత్రానికి పాటలు మంచి బజ్ తీసుకొచ్చాయి. ఇటీవలే వచ్చిన ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. శ్రీకాకుళం మత్స్సకారుడి పాత్రలో ఈ చిత్రంలో నాగచైతన్య నటించారు. యథార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీని తెరెక్కించారు చందూ మొండేటి.

ప్రీ-రిలీజ్ వాయిదా.. ప్లాన్ ఛేంజ్

తండేల్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. నేడు (ఫిబ్రవరి 1) ఈవెంట్ జరగాల్సి ఉండగా.. మూవీ టీమ్ తేదీని మార్చింది. రేపు (ఫిబ్రవరి 2) నిర్వహిస్తామని తెలిపింది. తండేల్ జాతర పేరుతో జరగనున్న ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత అల్లు అర్జున్ హాజరు కానున్న తొలి మూవీ ఈవెంట్ ఇదే. ముందుగా అభిమానులను ఈ ఈవెంట్‍కు అనుమతించకూడదని మూవీ టీమ్ అనుకుంది. అయితే, ఇప్పుడు ప్లాన్ చేంజ్ చేసినట్టు తెలుస్తోంది. ఓ రోజు వాయిదా వేసి.. ఫిబ్రవరి 2న గ్రాండ్‍గా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈవెంట్‍కు అభిమానులను కూడా అనుమతిస్తారేమో చూడాలి.

Whats_app_banner

సంబంధిత కథనం