Mega Family Sankranti: ఒకే ఫొటోలో మెగా గ్రాండ్ ఫ్యామిలీ.. ఆయనను మిస్ అవుతున్నామంటున్న ఫ్యాన్స్-allu arjun chirajeevi ram charan chiranjeevi pose in grand mega family pic on makar sankranti ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Allu Arjun Chirajeevi Ram Charan Chiranjeevi Pose In Grand Mega Family Pic On Makar Sankranti

Mega Family Sankranti: ఒకే ఫొటోలో మెగా గ్రాండ్ ఫ్యామిలీ.. ఆయనను మిస్ అవుతున్నామంటున్న ఫ్యాన్స్

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 15, 2024 07:11 PM IST

Mega Family Sankranti: సంక్రాంతి వేడుకలను మెగా ఫ్యామిలీ ఘనంగా నిర్వహించుకుంది. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ సహా మెగా కుటుంబ సభ్యులందరూ కలిసి ఫొటోకు పోజ్ ఇచ్చారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Mega Family Sankranti: ఒకే ఫొటోలో మెగా గ్రాండ్ ఫ్యామిలీ
Mega Family Sankranti: ఒకే ఫొటోలో మెగా గ్రాండ్ ఫ్యామిలీ

Mega Family Sankranti: పండుగ, వేడుక.. ఏదైనా మెగా కుటుంబం ఒక్క చోట చేరుతుంది. కుటుంబ సభ్యులు కలిసి సంబరాలు జరుపుకుంటారు. సంక్రాంతి వేడుకలను కూడా మెగా ఫ్యామిలీ సభ్యులు ఇలాగే జరుపుకున్నారు. ఈసారి పండుగను బెంగళూరులోని ఫామ్ హౌస్‍లో చేసుకున్నారు. కుటుంబ సభ్యులు ఉన్న ఓ ఫొటోలను మెగాస్టార్ చిరంజీవి నేడు (జనవరి 15) సంక్రాంతి రోజున సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వివరాలివే..

సంక్రాంతి వేడుకల కోసం రెండు రోజుల క్రితమే బెంగళూరులోని ఫామ్ హౌస్‍కు మెగా కుటుంబ సభ్యులు చేరుకున్నారు. తమ సెలెబ్రేషన్లకు సంబంధించిన వీడియోలను ఇన్‍స్టాగ్రామ్ స్టోరీగా పోస్ట్ చేశారు రామ్ చరణ్ భార్య ఉపాసన. రకరకాల వంటలను చేసినట్టు చూపించారు. రామ్‍చరణ్ కూడా దోశ తిరగేశారు. కాగా, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహమైన తర్వాత వచ్చిన తొలి సంక్రాంతి ఇదే. ఈ వేడుకల్లో లడ్డూలను చేశారు లావణ్య. ఆ వీడియో కూడా బయటికి వచ్చింది. కాగా, సంక్రాంతి రోజు మెగా కుటుంబ సభ్యులంతా కలిసి దిగిన ఫొటోను చిరంజీవి పోస్ట్ చేశారు.

చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సహా మెగా హీరోలు, కుటుంబ సభ్యులు ఈ ఫొటోలో ఉన్నారు. చిరంజీవి పైవరుసలో మధ్యలో ఉన్నారు. అల్లు అర్జున్ పైనుంచి రెండో వరుసలో తన భార్య స్నేహారెడ్డి పక్కన కూర్చున్నారు. రామ్‍చరణ్, ఉపాసన, వరుణ్, లావణ్య కూడా వారిపక్కనే ఉన్నారు. నాగబాబు, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, శ్రీజ సహా మెగా కుటుంబ సభ్యులు ఈ ఫొటోలో ఉన్నారు.

అలాగే, రామ్‍చరణ్ కుమార్తె క్లీంకార కొణిదెల జన్మించిన తర్వాత వచ్చిన తొలి సంక్రాంతి కావడం కూడా ఈ పండుగ మెగా కుటుంబానికి మరో ప్రత్యేకతగా ఉంది. ఈ ఫొటోలో క్లీంకారను రామ్‍చరణ్ ఎత్తుకున్నారు. అయితే, ఆమె ముఖం కనిపించకుండా లవ్ ఎమోజీని ఈ ఫొటోలో ఉంచారు.

మెగా కుటుంబ సభ్యులు ఒకే చోట, ఒకే పిక్‍లో కనిపించటంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పిక్ ఆఫ్ ది సంక్రాంతి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పవన్‍ మిస్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ సంక్రాంతి మెగా వేడుకల్లో పాల్గొనలేదని తెలుస్తోంది. ఆయన ఈ ఫొటోలో లేరు. ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆయన సంక్రాంతి వేడుకలకు వెళ్లలేకపోయారని సమాచారం.

పవన్ కల్యాణ్ ఈ ఫొటోలో లేకపోవడంతో ఆయనను మిస్ అవుతున్నామంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మెగా ఫ్యామిలీని ఒక చోట చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని, పవన్ కూడా ఉంటే మరింత బాగుండేదని కామెంట్లు చేస్తున్నారు.

సినిమాలు ఇలా..

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ సినిమా మెగా156 టైటిల్ సంక్రాంతి సందర్భంగా నేడు వెల్లడైంది. ఈ చిత్రానికి ‘విశ్వంభర’ అనే టైటిల్ ఖరారు చేసింది మూవీ టీమ్.

రాంచరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. పుష్ప 2 చిత్రంలో అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు. ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ఫిబ్రవరి 16న విడుదల కానుంది.

IPL_Entry_Point