Allu Arjun Birthday: అల్లు అర్జున్ బర్త్‌డే పార్టీ.. స్టన్నింగ్ లుక్‌లో భార్య స్నేహ రెడ్డి-allu arjun birthday pushpa stars wife allu sneha reddy throws a party stunning looks in her all whites ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Arjun Birthday: అల్లు అర్జున్ బర్త్‌డే పార్టీ.. స్టన్నింగ్ లుక్‌లో భార్య స్నేహ రెడ్డి

Allu Arjun Birthday: అల్లు అర్జున్ బర్త్‌డే పార్టీ.. స్టన్నింగ్ లుక్‌లో భార్య స్నేహ రెడ్డి

Hari Prasad S HT Telugu

Allu Arjun Birthday: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే పార్టీలో అతని భార్య అల్లు స్నేహా రెడ్డి వైట్ డ్రెస్ లో మెరిసింది. ఆమె మిర్రర్ సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అల్లు అర్జున్ బర్త్‌డే పార్టీ.. స్టన్నింగ్ లుక్‌లో భార్య స్నేహ రెడ్డి

Allu Arjun Birthday: టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోమవారం (ఏప్రిల్ 8) తన 42వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి అతని భార్య అల్లు స్నేహా రెడ్డి ఇంట్లోనే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కు ఓ గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ పార్టీలో ఆమె వైట్ డ్రెస్ లో స్టన్నింగ్ లుక్ లో కనిపించింది.

అల్లు అర్జున్ బర్త్ డే పార్టీ

అల్లు అర్జున్ బర్త్ డే పార్టీ ఫొటోలను స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసింది. ఈ పార్టీలో ఓ వైట్ కటౌట్ డ్రెస్ లో స్నేహ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. తాను దిగిన మిర్రర్ సెల్ఫీని కూడా స్నేహ షేర్ చేసింది. ఈ పార్టీలో కేక్ కూడా చాలా స్పెషల్ గా ఉంది. ఈ అల్లువారి హీరో తన కెరీర్లో సాధించిన ఘనతలను డెకొరేషన్, కేక్ లో చూపించారు.

ఈ మధ్యే అతని మైనపు బొమ్మను కూడా టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ ఫొటో కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక తన బర్త్ డే పార్టీలో బన్నీ మాత్రం సింపుల్ లుక్ లో కనిపించాడు. వైట్ ట్రౌజర్స్, టీషర్ట్ వేసుకున్నాడు. ఈ పార్టీకి వచ్చిన నటుడు నవదీప్.. అల్లు అర్జున్ కు ఓ బొన్సాయ్ మొక్కను గిఫ్ట్ గా ఇవ్వడం విశేషం. ఈ ఫొటోను నవదీప్ తన ఇన్‌స్టా స్టోరీస్ లో నవదీప్ షేర్ చేశాడు. "పుట్టినందుకు థ్యాంక్స్ బావా" అంటూ అతడు ఈ ఫొటోను పోస్ట్ చేయడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది.

ఎగబడిన ఫ్యాన్స్

తమ అభిమాన నటుడి బర్త్ డే సందర్భంగా ఆదివారం రాత్రి పెద్ద సంఖ్యలో అభిమానులు అల్లు అర్జున్ ఇంటి ముందు గుమిగూడారు. అతనికి బర్త్ డే విషెస్ చెప్పడానికి ఎగబడ్డారు. అర్ధరాత్రి తర్వాత బన్నీ బయటకు వచ్చి అభిమానులకు థ్యాంక్స్ చెప్పాడు. అల్లు అర్జున్ తన అభిమానులకు ఫ్లయింగ్ కిస్ లు ఇస్తున్న వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ప్రతి ఏటా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అభిమానులు అతని ఇంటికి తరలి రావడం ఆనవాయితీగా మారింది. ఇక ఈ ఏడాది అతడు పుష్ప 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఇది మరింత ప్రత్యేకంగా నిలిచింది. అతని బర్త్ డే సందర్భంగా మేకర్స్ మూవీ టీజర్ రిలీజ్ రిలీజ్ చేయనున్నారు. 2021లో వచ్చిన పుష్ప మూవీ సూపర్ హిట్ కాగా.. మూడేళ్ల తర్వాత సీక్వెల్ రాబోతోంది.

పుష్ప 2 మూవీ ఆగస్ట్ 15న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అయితే ఇంకా రెండు నెలల షూటింగ్ ఇప్పటికే పెండింగ్ లో ఉంది. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సీక్వెల్ పై పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి వాటిని ఈ సినిమా ఎంత వరకు అందుకుంటుందో చూడాలి.

అల్లు అర్జున్ బర్త్ డే పార్టీలో స్పెషల్ అట్రాక్షన్ గా అల్లు స్నేహ, బన్నీకి బొన్సాయ్ గిఫ్ట్ గా ఇస్తున్న నవదీప్
అల్లు అర్జున్ బర్త్ డే పార్టీలో స్పెషల్ అట్రాక్షన్ గా అల్లు స్నేహ, బన్నీకి బొన్సాయ్ గిఫ్ట్ గా ఇస్తున్న నవదీప్