Allu Arha with Klin Kaara: సో క్యూట్.. రామ్ చరణ్ కూతురు క్లిన్ కారాతో అల్లు అర్హ డ్యాన్స్
Allu Arha with Klin Kaara: రామ్ చరణ్ కూతురు క్లిన్ కారాను అల్లు అర్జున్ కూతురు అర్హ ఆడిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వచ్చిన ఈ వీడియోను చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
Allu Arha with Klin Kaara: మెగా ఫ్యామిలీలో స్టార్ హీరోలైన రామ్ చరణ్, అల్లు అర్జున్ కూతుళ్లు క్లిన్ కారా, అల్లు అర్హలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ చరణ్ భార్య ఉపాసన చేతుల్లో ఉన్న క్లిన్ కారాను అల్లు అర్హ ఆడించడం ఆ వీడియోలో చూడొచ్చు. ఇప్పుడీ వీడియోను చూసి మెగా ఫ్యామిలీ అభిమానులు మురిసిపోతున్నారు.
ఈ మధ్యే కొణిదెల, అల్లు కుటుంబాలు కలిసి సంక్రాంతి జరుపుకున్న ఫొటో కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వీడియో బయటకు వచ్చింది. మెగా ప్రిన్సెస్ క్లిన్ కారా కాళ్లు పట్టుకొని అటూఇటూ ఆడిస్తూ అర్హ కూడా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఈ 9 సెకన్ల వీడియోకు అల్లు అర్జున్ పుష్ప మూవీలోని శ్రీవల్లీ సాంగ్ ను బ్యాక్‌గ్రౌండ్ లో ప్లే చేయడం విశేషం.
ఈ వీడియోలో పాప క్లిన్ కారా ముఖం కనిపించడం లేదు. ఆమెను తల్లి ఉపాసన ఎత్తుకొని ఆడిస్తుండగా.. అర్హ కూడా అక్కడికి వచ్చి ఆ పాపను ఆడించింది. ఈ వీడియో చాలా క్యూట్ గా అనిపిస్తోంది. మెగా ఫ్యామిలీ సంక్రాంతి సంబరాల్లోనే ఈ వీడియో కూడా తీసినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు 11 ఏళ్ల తర్వాత గతేడాదే క్లిన్ కారా జన్మించిన విషయం తెలిసిందే.
మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్
ఈ మధ్యే కొణిదెల, అల్లు కుటుంబాలు కలిసి సంక్రాంతి జరుపుకున్నారు. ఒకే ఫ్రేమ్ లో మెగా ఫ్యామిలీ మొత్తం కనిపించడం ఫ్యాన్స్ కు కనులవిందుగా అనిపించింది. చిరంజీవితోపాటు రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ లాంటి వాళ్లు ఫ్యామిలీతో ఫొటోలకు పోజులిచ్చారు. ఇక వీళ్లు ఫ్యామిలీలో బ్యాచిలర్స్ గా ఉన్న సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ కూడా ఈ ఫొటోలో కనిపించారు.
ఇక మెగా ఫ్యామిలీ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం చిరంజీవి డైరెక్టర్ వశిష్టతో కలిసి విశ్వంభర మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ ను సోమవారం (జనవరి 15) సంక్రాంతి సందర్భంగా రివీల్ చేశారు. మరోవైపు రామ్ చరణ్ తన నెక్ట్స్ మూవీ గేమ్ ఛేంజర్ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా సమ్మర్ లో రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి.
అల్లు అర్జున్ తన సూపర్ హిట్ మూవీ పుష్ప సీక్వెల్ అయిన పుష్ప ది రూల్ షూటింగ్ లో ఉన్నాడు. ఈ సినిమా ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది. ఈ ఏడాది గేమ్ ఛేంజర్, పుష్ప 2 మూవీస్ మోస్ట్ అవేటెడ్ సినిమాల జాబితాలో ఉన్నాయి. ఆ లెక్కన ఈ ఏడాది మెగా ఫ్యామిలీ రెండు పెద్ద హిట్స్ కోసం వేచి చూస్తున్నట్లే.