Allu Aravind on Ram Charan: రామ్ చరణ్ నా కొడుకులాంటి వాడు.. ఆ మాట అనాల్సింది కాదు: అల్లు అరవింద్ క్లారిటీ-allu aravind says ram charan is like his son clarifies his comments on dil raju mega fans trolling ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Aravind On Ram Charan: రామ్ చరణ్ నా కొడుకులాంటి వాడు.. ఆ మాట అనాల్సింది కాదు: అల్లు అరవింద్ క్లారిటీ

Allu Aravind on Ram Charan: రామ్ చరణ్ నా కొడుకులాంటి వాడు.. ఆ మాట అనాల్సింది కాదు: అల్లు అరవింద్ క్లారిటీ

Hari Prasad S HT Telugu
Published Feb 10, 2025 05:43 PM IST

Allu Aravind on Ram Charan: రామ్ చరణ్ తన కొడుకులాంటి వాడంటూ అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చాడు. ఈ మధ్య దిల్ రాజును ఉద్దేశించి మాట్లాడుతూ రామ్ చరణ్ ను తక్కువ చేశాడంటూ వచ్చిన విమర్శలపై అతడు సోమవారం (ఫిబ్రవరి 10) స్పందించాడు.

రామ్ చరణ్ నా కొడుకులాంటి వాడు.. ఆ మాట అనాల్సింది కాదు: అల్లు అరవింద్ క్లారిటీ
రామ్ చరణ్ నా కొడుకులాంటి వాడు.. ఆ మాట అనాల్సింది కాదు: అల్లు అరవింద్ క్లారిటీ

Allu Aravind on Ram Charan: అల్లు అరవింద్ తనపై మెగా అభిమానులు చేస్తున్న ట్రోలింగ్ పై స్పందించాడు. తండేల్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా నిర్మాత దిల్ రాజును స్టేజ్ పైకి పిలవడానికి అతడు రామ్ చరణ్ ను అవమానించాడంటూ మెగా ఫ్యాన్స్ హర్ట్ అయిన వేళ తన ఉద్దేశం అది కాదంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే తాను ఆ మాట అనాల్సింది కాదని అతడు అనడం గమనార్హం.

రామ్ చరణ్ నా కొడుకులాంటివాడు: అల్లు అరవింద్

అల్లు అరవింద్ సోమవారం (ఫిబ్రవరి 10) మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చాడు. రామ్ చరణ్ ను తాను తక్కువ చేయలేదని, అతని తనకు కొడుకు లాంటి వాడని అన్నాడు. "ఈ మధ్య దిల్ రాజును నా స్టేజ్ పైకి ఆహ్వానించే సమయంలో నేను రామ్ చరణ్ ను తక్కువ చేశానని మెగాభిమానులు నన్ను ట్రోల్ చేశారు.

దీనిపై ఓ సీనియర్ జర్నలిస్ట్ అడిగితే ఆ సందర్భం అది కాదు మళ్లీ చెబుతానని అన్నాను. నేను పబ్లిక్ కు చెప్పాలని అనుకున్నదేంటంటే.. ఆ రోజు దిల్ రాజు గురించి చెబుతూ.. ఆయన వారం రోజుల్లోనే కష్టాలు నష్టాలను, ఇన్‌కమ్ ట్యాక్స్ ఇవన్నీ అనుభవించారు అని పరిచయం చేయడానికి ఉద్దేశపూర్వకంగా కాకుండా అప్పటికప్పుడు మనసులో అనిపించింది చెప్పాను.

దానికి మెగాభిమానులు ఫీలై నన్ను ట్రోల్ చేశారు. ఫీలైన అభిమానులకు నేను చెప్పేది ఒక్కటే అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. చరణ్ నా కొడుకులాంటివాడు. నాకున్న ఏకైన మేనల్లుడు. నేను మేనమామను. అందుకే ఎమోషనల్ గా చెబుతున్నాను. మమ్మల్ని ఇలా వదిలేయండి. చరణ్ కు నాకు చాలా గొప్ప సంబంధం ఉంది. దిల్ రాజు లైఫ్ గురించి చెప్పడానికి అది వాడాను. వాడి ఉండకూడదని తర్వాత అనిపించింది. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్" అని అల్లు అరవింద్ ముగించాడు.

అల్లు అరవింద్ ఏమన్నాడంటే?

తండేల్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా ప్రొడ్యూసర్ దిల్ రాజును స్టేజ్ పైకి ఆహ్వానిస్తూ అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. అప్పటికే అతడు నిర్మించిన గేమ్ ఛేంజర్ మూవీ డిజాస్టర్ కాగా.. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ అయింది. అదే సమయంలో దిల్ రాజు ఇంటిపై ఐటీ దాడులు కూడా జరిగాయి.

వీటిని దృష్టిలో పెట్టుకొని అల్లు అరవింద్ కొన్ని కామెంట్స్ చేశాడు. "ఈ మధ్యే దిల్ రాజు చరిత్ర సృష్టించాడు. ఓ సినిమాను ఇక్కడ పెట్టి.. మరో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లి.. ఇన్‌కమ్ ట్యాక్స్ రైడ్ చేసి.. రకరకాలు చేశాడు ఓ వారంలో.." అని అల్లు అరవింద్ అన్నాడు. ఇది చరణ్ గేమ్ ఛేంజర్ మూవీని తక్కువ చేయడమే అని మెగా ఫ్యాన్స్ ఫీలయ్యారు.

అప్పటి నుంచీ అల్లు అరవింద్ పై ట్రోలింగ్ మొదలుపెట్టారు. మొత్తానికి ఇప్పుడు అతడు తన కామెంట్స్ పై వివరణ ఇచ్చాడు. మరి ఇప్పటికైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా లేదా అన్నది చూడాలి.

Whats_app_banner

సంబంధిత కథనం