Allu Aravind on Heroes Remunerations: హీరోల రెమ్యూనరేషన్‍పై అల్లు అరవింద్ కీలక కామెంట్స్.. అంత శాతమే తీసుకుంటున్నారంటూ..-allu aravind comments on heroes remunerations and big films at kota bommali ps teaser launch event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Allu Aravind Comments On Heroes Remunerations And Big Films At Kota Bommali Ps Teaser Launch Event

Allu Aravind on Heroes Remunerations: హీరోల రెమ్యూనరేషన్‍పై అల్లు అరవింద్ కీలక కామెంట్స్.. అంత శాతమే తీసుకుంటున్నారంటూ..

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 06, 2023 09:05 PM IST

Allu Aravind on Heroes Remunerations: పెద్ద హీరోల సినిమాలకు బడ్జెట్ ఎందుకు ఎక్కువ అవుతోందనే విషయాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు. ఈ సందర్భంగా హీరోల రెమ్యూనరేషన్ విషయంపై మాట్లాడారు.

అల్లు అరవింద్
అల్లు అరవింద్

Allu Aravind on Heroes Remunerations: పెద్ద హీరోలు అధికంగా రెమ్యూనరేషన్లు తీసుకుంటుండడం వల్లే సినిమాల బడ్జెట్ అమాంతం పెరిగిపోతోందని కొంతకాలంగా వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై పెద్ద చర్చే సాగుతోంది. హీరోలు రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే బడ్జెట్ గణనీయంగా తగ్గుతుందని కొందరు సినీ జనాలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తాజాగా, హీరోల రెమ్యూనరేషన్ అంశంపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. నేడు జరిగిన ‘కోటబొమ్మాళి పీస్’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‍కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎదురైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

ఈ సందర్భంగా సినిమాల బడ్జెట్ పెరిగేందుకు హీరోల రెమ్యూనరేషన్ కారణమనేలా ఓ ప్రశ్న అల్లు అరవింద్‍కు ఎదురైంది. దీనికి ఆయన స్పందించారు. స్క్రీన్‍పై భారీ తనంతో సినిమాలు చూడాలని ప్రేక్షకులు భావిస్తున్నందునే బడ్జెట్ పెరుగుతోందని అల్లు అరవింద్ అన్నారు. హీరోల రెమ్యూనరేషన్ వల్ల సినిమాల బడ్జెట్ పెరగడం లేదని చెప్పారు. మూవీ బడ్జెట్‍లో హీరో రెమ్యూనరేషన్ గరిష్టంగా 25 శాతం లోపే ఉంటోందని అన్నారు.

“హీరోలు తీసుకునేది గరిష్ఠంగా 20 శాతం.. 25 శాతంలోపే. అందుకే హీరోల వల్ల ఖర్చు పెరిగిపోతుంది అనడం కన్నా.. పెంచిన సినిమాల్లో హీరోలు ఉంటున్నారు అని అనిపిస్తుంది నాకు ఈ మధ్య. కొన్ని సినిమాల పేర్లు చెబితే బాగోదు. ఆ సినిమాల ఖర్చు ఎంత.. అందులో హీరోల రెమ్యూనరేషన్లు ఎంత ఉన్నాయో లెక్కేసుకోండి. తక్కువే ఉన్నాయి. హీరోలతో సంబంధం లేకుండా ఇవాళ పెద్దగా చూపిస్తే తప్ప పెద్ద సినిమాలను ప్రేక్షకులు ఆదరించరు. కేజీఎఫ్ రాకముందు అతను (యశ్) ఎవరండి. ఎంత పెద్ద హీరో అతను. సినిమాను పెద్దగా చూపించారు కాబట్టి అలా హిట్ అయింది. ఒక ఉదాహరణ చెబుతున్నా అంతే” అని అల్లు అరవింద్ అన్నారు.

మలయాళంలో సూపర్ హిట్ అయిన నాయట్టు చిత్రానికి రీమేక్‍గా తెలుగులో ‘కోట బొమ్మాళి పీఎస్’ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో శ్రీకాంత్ హీరోగా నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్, శివానీ రాజశేఖర్, రాహుల్ విజయ్ కీలకపాత్రలు పోషించారు. తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బన్నీ వాసు, విద్య నిర్మించారు. ఈ సినిమా టీజర్ నేడు వచ్చింది. నవంబర్ 24న కోట బొమ్మాళి పీఎస్ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.