Rush OTT: ఓటీటీలో అదరగొడుతోన్న తెలుగు థ్రిల్లర్ మూవీ - యాక్షన్ సీక్వెన్స్‌లు హైలైట్
Rush OTT: అల్లరి రవిబాబు నిర్మాతగా వ్యవహరిస్తూ కథను అందించిన రష్ మూవీ ఓటీటీలో అదరగొడుతోంది. ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజైన యాక్షన్ థ్రిల్లర్ మూవీ రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో డైసీ బోపన్న కీలక పాత్రలో నటించింది.
Rush OTT: అల్లరి రవిబాబు నిర్మాతగా వ్యవహరిస్తూ, కథ - స్క్రీన్ ప్లే అందించిన చిత్రం రష్ మూవీ ఇటీవల థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజైంది. ఈ మూవీకి సతీశ్ పోలోజు దర్శకత్వం వహించాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో యూనిక్ పాయింట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో డైసీ బోపన్న హీరోయిన్‌గా నటించింది.
రికార్డ్ వ్యూస్....
ఈటీవీ విన్ ఓటీటీలో అద్భుతమైన ప్రేక్షకాదరణతో ఈ సినిమా దూసుకుపోతుంది. వ్యూస్ పరంగా అదరగొడుతోంది. రీసెంట్ టైమ్‌లో ఓటీటీలో రిలీజైన తెలుగు సినిమాల్లో అత్యధిక వ్యూస్‌ను సొంతం చేసుకున్న మూవీల్లో ఒకటిగా నిలిచింది.
సోషల్ ఈష్యూస్‌తో...
ఒక సాధారణ గృహిణికి కొన్ని అసాధారణ పరిస్థితులు ఎదురైతే వాటిని ఆమె ధైర్యంగా ఎలా ఎదుర్కొంది అనే ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో రవిబాబు ఈ మూవీ కథను రాశారు. ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటున్నాయి. రవిబాబు డిస్కస్ చేసిన సోషల్ ఇష్యూ ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి రష్ ఒక మంచి ఛాయిస్ మారిందని మేకర్స్ చెబుతోన్నారు.
గృహిణి పోరాటం...
కార్తీక (డైసీ బోపన్న), ఆదిత్య (కార్తీక్ ఆహుతి) భార్యాభర్తలు. వారికి ఇద్దరు పిల్లలు ఉంటారు. ఓ రోజు ఆదిత్యకు యాక్సిడెంట్ కావడంతో హాస్పిటల్ పాలవుతాడు. అతడి చూసేందుకు హాస్పిటల్‌కు బయలుదేరిన కార్తీకకు దారిలో కొందరు బైకర్స్‌తో గొడవ జరుగుతుంది. ఆ బైకర్స్‌ను నర్సింగ్ (వీరన్న చౌదరి) చంపేసి ఆ నేరాన్ని కార్తీకపై నెట్టేస్తాడు. కార్తీక కొడుకును నర్సింగ్ కిడ్నాప్ చేస్తాడు.
పోలీస్ స్టేషన్‌లో ఉన్న ఓ బ్యాగ్ తమకు కావాలని చెబుతాడు. ఇంతకీ ఆ బ్యాగులో ఏముంది? కొడుకు కోసం కార్తీక ఎలాంటి సాహసం చేసింది. ఈ కేసును ఇన్వేస్టిగేట్ చేస్తోన్న పోలీస్ ఆఫీసర్ శివ (అల్లరి రవిబాబు) కార్తీక గురించి ఎలాంటి నిజాలు తెలుసుకున్నాడు? అన్నదే రష్ మూవీ కథ. ఈ సినిమాలో కంప్లీట్ యాక్షన్ రోల్‌లో డైసీ బోపన్న కనిపించింది.
ప్రయోగాత్మక కథాంశాలతో...
దర్శకుడిగా ప్రయోగాత్మక కథాంశాలతో కూడిన సినిమాలు ఎక్కువగా చేశారు అల్లరి రవిబాబు. లో బడ్జెట్‌తో అతడు తెరకెక్కించిన అల్లరి, నచ్చావులే, మనసారా వంటి ప్రేమకథా చిత్రాలు కమర్షియల్ గా విజయాల్ని అందుకున్నాయి. థ్రిల్లర్ కథాంశాలతో అనసూయ, అమరావతి, అవును, అవును 2 వంటి సినిమాలు చేశాడు. దర్శకుడిగా అల్లరి రవిబాబు సక్సెస్ అందుకొని చాలా కాలమైంది. నటుడిగా ఎక్కువగా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్స్‌లోనే కనిపించాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్‌లో విలన్‌గా కనిపించాడు.
టాపిక్