Itlu Maredumilli Prajaneekam Day 1 Collections: ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం ఫ‌స్డ్ డే క‌లెక్ష‌న్స్ ఎంతంటే-allari naresh itlu maredumilli prajaneekam day 1 collections world wide ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Allari Naresh Itlu Maredumilli Prajaneekam Day 1 Collections World Wide

Itlu Maredumilli Prajaneekam Day 1 Collections: ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం ఫ‌స్డ్ డే క‌లెక్ష‌న్స్ ఎంతంటే

Nelki Naresh Kumar HT Telugu
Nov 26, 2022 02:25 PM IST

Itlu Maredumilli Prajaneekam Day 1 Collections: అల్ల‌రి న‌రేష్ హీరోగా న‌టించిన ఇట్లు మారేడుమిల్లి నియోజ‌క‌వ‌ర్గం సినిమాకు ఫస్ట్ డే వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ ఎంతంటే...

అల్ల‌రి న‌రేష్
అల్ల‌రి న‌రేష్

Itlu Maredumilli Prajaneekam Day 1 Collections: అల్ల‌రి న‌రేష్ హీరోగా న‌టించిన ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది సామాజిక సందేశంతో ద‌ర్శ‌కుడు ఏ.ఆర్ మోహ‌న్ ఈ సినిమాను తెర‌కెక్కించాడు. మారేడుమిల్లి గిరిజ‌న ప్రాంతంలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడిగా అల్ల‌రి న‌రేష్ క‌నిపించాడు.

సినిమా పాయింట్ బాగున్నా బాక్సాఫీస్ వద్ద బ‌జ్ పెద్ద‌గా లేక‌పోవ‌డంతో తొలిరోజు ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం యావ‌రేజ్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. శుక్ర‌వారం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కోటి రూపాయ‌ల క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే ద‌క్కించుకున్న‌ట్లు తెలిసింది. ఓవ‌ర్‌సీస్‌తో పాటు క‌ర్ణాట‌క త‌దిత‌ర ప్రాంతాల్లో మ‌రో ఐదు ల‌క్ష‌ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

ఓవ‌రాల్‌గా ఫ‌స్ట్ డే ఈ సినిమా కోటి ఐదు ల‌క్ష‌ల గ్రాస్‌, 50 ల‌క్ష‌ల షేర్ రాబ‌ట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ నాలుగు కోట్ల వ‌ర‌కు జ‌రిగిన‌ట్లు తెలిసింది. నాంది స‌క్సెస్ త‌ర్వాత అల్ల‌రి న‌రేష్ హీరోగా న‌టించిన సినిమా కావడంతో బిజినెస్ బాగా జరిగినట్లు చెబుతున్నారు. కానీ ఆ అంచనాలను సినిమా అందుకోలేకపోయింది.

ఫస్ట్ డే క‌లెక్ష‌న్స్ చూస్తుంటే ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం బ్రేక్ ఈవెన్ కావ‌డం క‌ష్టంగానే క‌నిపిస్తోంది. ఆనంది హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాలో వెన్నెల‌కిషోర్‌, సంప‌త్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

IPL_Entry_Point