Allari Naresh BachhalaMalli: సాయిధరమ్‌తేజ్ డైరెక్టర్‌తో అల్లరి నరేష్ మూవీ - 63వ సినిమాకు డిఫరెంట్ టైటిల్ ఫిక్స్
Allari Naresh BachhalaMalli: అల్లరి నరేష్ 63వ సినిమాక బచ్చలమల్లి అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మూవీ సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు దర్శకత్వం వహిస్తున్నాడు. శుక్రవారం ఈ మూవీ టైటిల్‌ను రివీల్ చేశారు.
Allari Naresh BachhalaMalli: నాంది, ఉగ్రం సినిమాలతో తన రూటు మార్చిన అల్లరి నరేష్ ఈ సారి ఓ పీరియాడికల్ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అతడు హీరోగా నటిస్తోన్న నెక్ట్స్ మూవీ టైటిల్‌ను శుక్రవారం రివీల్ చేశారు. ఈ సినిమాకు బచ్చలమల్లి అనే పేరును ఖరారు చేశారు.
యాక్షన్ డ్రామా కథాంశంతో తెరకెక్కుతోన్నఈ మూవీకి సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు దర్శకత్వం వహిస్తోన్నాడు. శుక్రవారం రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ ఆసక్తిని పంచుతోంది. అటవీ ప్రాంతంలో బస్తాలతో నిండి ఉన్న ఓ ట్రాక్టర్ లోయలోకి జారుతోన్నట్లుగా ఈ పోస్టర్‌లో కనిపిస్తోంది.
1990 బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ డ్రామా పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. బచ్చలమల్లి సినిమాలో అల్లరి నరేష్‌కు జోడీగా అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది. సాయికుమార్, ధన్‌రాజ్, రావురమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గత సినిమాలకు భిన్నంగా అల్లరి నరేష్ రోల్ రియలిస్టిక్‌గా ఉంటుందని సినిమా టీమ్ చెబుతోంది. కొత్త లుక్‌లో అతడు కనిపించబోతున్నట్లు తెలిపారు.
అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న 63వ సినిమా ఇది కావడం గమనార్హం. త్వరలోనే బచ్చలమల్లి రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టబోతున్నారు. ఈ సినిమాకు సీతారామం ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తోన్నాడు.
టాపిక్