OTT Review: ఓటీటీ రివ్యూ.. న్యూడ్ సీన్స్ ఉన్నాయి, అవార్డులు వచ్చాయి.. కానీ..! ఓటీటీ మలయాళ మూవీ ఎలా ఉందంటే?-all we imagine as light review in telugu disney plus hotstar ott malayalam movie explained kani kusruti divya prabha ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Review: ఓటీటీ రివ్యూ.. న్యూడ్ సీన్స్ ఉన్నాయి, అవార్డులు వచ్చాయి.. కానీ..! ఓటీటీ మలయాళ మూవీ ఎలా ఉందంటే?

OTT Review: ఓటీటీ రివ్యూ.. న్యూడ్ సీన్స్ ఉన్నాయి, అవార్డులు వచ్చాయి.. కానీ..! ఓటీటీ మలయాళ మూవీ ఎలా ఉందంటే?

Sanjiv Kumar HT Telugu
Jan 15, 2025 05:30 AM IST

OTT Malayalam Movie All We Imagine As Light Review Telugu: ఓటీటీలోకి రీసెంట్‌గా వచ్చిన మలయాళ డ్రామా చిత్రం ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ పలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో అనేక అవార్డులు పొందింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా ఎలా ఉందో నేటి ఓటీ రివ్యూలో తెలుసుకుందాం.

ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ మూవీ రివ్యూ
ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ మూవీ రివ్యూ

All We Imagine As Light Review In Telugu: ఓటీటీలో రీసెంట్‌గా స్ట్రీమింగ్ అవుతోన్న మలయాళ సినిమా ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కని కుశ్రుతి, దివ్య ప్రభ, ఛయా కదమ్ ప్రధాన పాత్రలు పోషించగా.. హ్రిదు హరూన్, అజీస్ నెదుమాంగడ్, టింటుమోల్ జోసెఫ్ ఇతర కీ రోల్స్‌లో నటించారు.

yearly horoscope entry point

100 శాతం ఫ్రెష్ కంటెంట్

ఐఎమ్‌డీబీ నుంచి 7.3 రేటింగ్ సాధించుకోగా రొట్టెన్ టొమాటోస్ 100 శాతం ఫ్రెష్ కంటెంట్ అని తెలిపింది. అలాంటి ఈ సినిమా పలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడి అనేక క్యాటగిరీల్లో అవార్డులు రాబట్టింది. అలాగే, అక్కడి ప్రేక్షకుల ప్రశంసలు పొందడమే కాకుండా మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మెచ్చిన ఇండియన్ సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది.

ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో జనవరి 3 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి యాల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

ప్రభ (కని కుశ్రుతి), అను (దివ్య ప్రభ) ఇద్దరు ముంబైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో నర్సులుగా పని చేస్తున్న మలయాళ మహిళలు. వారితోపాటు అక్కడ వంట మనిషిగా పార్వతి (ఛయా కదమ్) పని చేస్తుంటుంది. ప్రభను పెళ్లి అయిన కొద్దిరోజులకే తన భర్త జెర్మనీకి వెళ్లిపోతాడు. తర్వాత తన నుంచి ఎలాంటి కాల్స్, లెటర్స్ ఉండవు.

షియాజ్ (హ్రిదు హరూన్) అనే ముస్లిం యువకుడితో అను ప్రేమలో ఉంటుంది. వారిద్దరు ఏకాంతంగా గడిపేందుకు ఎప్పుడు కొత్త చోటు వెతుక్కుంటూ సిటీ అంతా తిరుగుతుంటారు. మరోవైపు తన ఇల్లును లాక్కునేందుకు ప్రయత్నిస్తున్న ఓ బిల్డర్‌తో పోరాటం చేస్తుంటుంది పార్వతి.

ట్విస్టులు

ఇలా ముంబైలో సాగుతున్న వీరి జీవితం ఎలాంటి యూ టర్న్ తీసుకుంది? ఈ ముగ్గురు రత్నగిరి ఎందుకు వెళ్లారు? అక్కడ ఏం చేశారు? ప్రభ తన భర్తను కలుసుకుందా? అను-షియాజ్ లవ్ ఏమైంది? పార్వతి ఏం చేసింది? అనే విషయాలతో సాగే సినిమానే ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ మూవీ.

విశ్లేషణ:

సాధారణంగా సగటు ప్రేక్షకుడికి ఒక సినిమాలో నచ్చే అంశాలు కమర్షియల్ ఎలిమెంట్స్, సాంగ్స్, యాక్షన్ సీన్స్, కాస్తా గ్లామర్ టచ్. మరికొందరికి ఇలాంటివేం లేకున్నా గ్రిప్పింగ్ అండ్ ఎంగేజింగ్ నెరేషన్, ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటే నచ్చుతుంది. ఇక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ వంటి వేడుకల్లో అవార్డ్స్ పొందిన సినిమాలు అంటే వీటన్నింటికి దూరంగా ఒక డాక్యుమెంటరీ లేదా ఆర్ట్ సినిమాలాగే ఉంటాయి.

ఇలాంటి సినిమాలు కామన్ ఆడియెన్స్‌కు నచ్చకపోయే అవకాశాలే ఎక్కువ. ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ మూవీ కూడా అంతే. రెండు గంటలపాటు సాగే ఈ సినిమా 95 శాతం ఆడియెన్స్‌కు బోర్ కొట్టిస్తుంది. అసలు ఇదేం సినిమారా బాబు అనేలా చేస్తుంది. ఎందుకంటే అంతలా స్లో నెరేషన్, స్టోరీ ఉంటాయి కాబట్టి. కానీ, ఇది ఒక ముగ్గురు మహిళల రియలిస్టిక్ కథ.

శృంగారం కోసం

పెళ్లయిన కొద్దిరోజులకే విడిచిపెట్టి ఫారెన్ వెళ్లిపోయిన భర్త గురించి తలుచుకుంటూ జీవించే ఓ మహిళ ఆవేదన కనిపిస్తుంది. పైకి కనిపించకుండా, ఇతరులు ప్రేమ పేరుతో దగ్గరైన తన హద్దులు దాటకుండా, మనసులోనే మదన పడే బాధ చూపిస్తుంది. అలాగే, టైమ్ దొరికితో ప్రేమికుడితో ముద్దు ముచ్చట సాగించాలని, కుదిరితో శృంగారంలో పాల్గొనలాని తహతహలాడే యువతి ఆరాటాన్ని చెబుతుంది.

సరైన డాక్యుమెంట్స్ లేక, బలవంతుడైన బిల్డర్‌ నుంచి తన ఇల్లుని కాపాడుకోలేక, అతనికి సంబంధించిన ఫ్లెక్సీని చింపేసి ఆనందపడే ఓ నిస్సాహాయురాలి కష్టం కనిపిస్తుంది. ఈ ముగ్గురి చుట్టూనే సినిమా సాగుతుంది. కానీ, సినిమా అంతా రియలిస్ట్‌కా ఉంటుంది. చూపించే సీన్స్ చాలా నేచురల్‌గా ఉంటాయి. ఈ సీన్స్‌, సినిమాటోగ్రఫీ మన జీవితంలో నుంచి తెరకెక్కించినట్లుగా చూపిస్తాయి.

భారీగా గుమిగూడిన జనం, వారి మధ్యలో నుంచి వెళ్లే భారీ వాహనాలు అన్నీ నిజ జీవితంలో జరిగినంత నేచురల్‌గా కనిపిస్తుంటాయి. అయితే, అక్కడక్కడ ఊహించని న్యూడ్ సీన్స్ వచ్చి కాస్తా అసంబద్ధంగా అనిపిస్తాయి. మిర్రర్ దగ్గర, తుప్పల్లో యూరినేట్ చేయడం, సెక్స్ సీన్‌లో కాస్తా న్యూడిటీ ఉంటుంది. అక్కడ అవసరం లేని న్యూడిటి చూపించడం మరి రియలిస్టిక్‌గా తెరకెక్కించారు అని చెప్పడానికి చేసిన ప్రయత్నంలా అనిపిస్తుంది.

క్లైమాక్స్ ట్విస్ట్ పర్వాలేదు

దీని గురించి క్లియర్‌గా విశ్లేషిస్తే స్పాయిలర్ అవుతుంది. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ పర్వాలేదు. కానీ, చాలా వరకు అది ఊహించేది లాగానే ఉంటుంది. టైటిల్‌కు అక్కడ కాస్త జస్టిఫికేషన్ ఇచ్చినట్లు అనిపించింది. బీజీఎమ్, సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. సాధారణ సినిమాతో చూస్తే ఈ మూవీ విజువల్స్ చాలా డార్క్‌గా ఉంటాయి.

నటనపరంగా చూస్తే అందరూ అద్భుతంగా చేశారు. ముఖ్యంగా కని కుశ్రుతి సినిమాకు హైలెట్ అని చెప్పుకోవాలి. కళ్లతోనే అన్ని రకాల ఎక్స్‌ప్రెషన్స్ పలికించారు. ఇక లేడి డైరెక్టర్ పాయల్ కపాడియా సినిమాను రియలిస్టిక్ పేరుతో మరి బోర్ కొట్టించేశారు. చాలా వరకు ఆడియెన్స్‌కు అసలు ఏం తీశారు, ఎందుకు తీశారు అనే ఫీలింగ్ వస్తుంది.

ఫైనల్‌గా చెప్పాలంటే..!

ఫైనల్‌గా చెప్పాలంటే కమర్షియల్ ఎలిమెంట్స్ కోరుకునే ఆడియెన్స్ చూడకపోవడమే మంచిది. ఆర్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు చూసేవారికి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. అయితే, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌‌ ఓటీటీలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో మలయాళంలో స్ట్రీమింగ్ అవుతోన్న ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ సినిమాను న్యూడ్ సీన్స్ కారణంగా ఫ్యామిలీతో మాత్రం చూడటం కష్టం. కానీ, నటీనటుల యాక్టింగ్ కోసం ఓ లుక్కేయొచ్చు.

రేటింగ్: 2.25/5

Whats_app_banner

సంబంధిత కథనం