All We Imagine As Light OTT release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ అవార్డు విన్నింగ్ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
All We Imagine As Light OTT release: ఓ అవార్డు విన్నింగ్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. పాయల్ కపాడియా డైరెక్ట్ చేసిన, ఫెస్టివల్ డి కేన్స్ గ్రాండ్ ప్రి అవార్డు గెలిచిన ఈ మూవీ పేరు ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్.
All We Imagine As Light OTT release: ఓటీటీలోకి ఈ మధ్యకాలంలో బాగా వార్తల్లో నిలిచిన మూవీ ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ (All We Imagine As Light) వస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ శుక్రవారం (డిసెంబర్ 27) తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వెల్లడించింది. పాయల్ కపాడియా డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫెస్టివల్ డి కేన్స్ గ్రాండ్ ప్రి అవార్డును సొంతం చేసుకుంది.
ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ ఓటీటీ రిలీజ్
ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ మూవీ జనవరి 3 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తెలిపింది. శుక్రవారం (డిసెంబర్ 27) తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. "ఫెస్టివల్ డి కేన్స్ గ్రాండ్ ప్రి 2024తోపాటు 2 గోల్డెన్ గ్లోబల్ నామినేషన్స్.. పాయల్ కపాడియా మాస్టర్ పీస్.. ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో జనవరి 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మీరు అస్సలు మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది" అని ఆ ఓటీటీ తెలిపింది.
తన మూవీ డిజిటల్ ప్రీమియర్ పై డైరెక్టర్ పాయల్ కపాడియా స్పందించింది. "ఆల్ వి ఇమాజిన్ యాజ్ లవ్ మూవీకి మీ నుంచి దక్కిన ప్రేమ చూసి నేను థ్రిల్ గా ఫీలయ్యాను. థియేటర్లలో విజయవంతంగా ఆడిన తర్వాత ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో రాబోతున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఎక్కువ మంది ప్రేక్షకులతో ఈ మూవీని పంచుకుంటున్నందుకు నాకు మరింత ఎక్సైటింగా ఉంది" అని ఆమె చెప్పింది.
అసలేంటి మూవీ?
ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ తోపాటు ది క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులకు కూడా నామినేట్ అయింది. బెస్ట్ మోషన్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్ కేటగిరీల్లో గోల్డెన్ గ్లోబ్ నామినేషన్లను అందుకుంది. ముంబైలో ఉండే ఇద్దరు మలయాళీ నర్సుల చుట్టూ తిరిగే కథ ఇది. ఇందులో కాని కుస్రుతి, దివ్య ప్రభ, చాయా కదమ్, హృదు హరూన్, అజీస్ నేడుమంగడ్ లాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషించారు.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో 30 ఏళ్ల తర్వాత ప్రధాన కాంపిటీషన్ లో పోటీ పడిన తొలి ఇండియన్ మూవీగా నిలిచింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో గ్రాండ్ ప్రి అవార్డు దక్కింది. నిజానికి ఆస్కార్స్ కు కూడా ఈ సినిమాను ఇండియా నుంచి అధికారిక ఎంట్రీ కావాల్సిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ లాపతా లేడీస్ మూవీని పంపించారు. అయితే అది షార్ట్ లిస్ట్ కాలేకపోయింది.