Golden Globes 2025: భారతీయ మూవీకి మిస్ అయిన గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు.. ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రాన్ని చూశారా!-all we imagine as light movie snubbed in golden globes 2025 know where to watch this movie on ott streaming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Golden Globes 2025: భారతీయ మూవీకి మిస్ అయిన గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు.. ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రాన్ని చూశారా!

Golden Globes 2025: భారతీయ మూవీకి మిస్ అయిన గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు.. ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రాన్ని చూశారా!

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 06, 2025 01:31 PM IST

Golden Globes 2025 - All We Imagine As Light: 82వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల్లో భారత్‍కు నిరాశ ఎదురైంది. ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్ మూవీకి అవార్డు దక్కలేదు. రెండు విభాగాల్లోనూ పురస్కారం లభించలేదు.

Golden Globes 2025: భారతీయ మూవీకి మిస్ అయిన గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు.. ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రాన్ని చూశారా!
Golden Globes 2025: భారతీయ మూవీకి మిస్ అయిన గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు.. ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రాన్ని చూశారా!

భారతీయ చిత్రం ‘ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్’ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకుంది. గతేడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‍లో గ్రాండ్ ప్రిక్స్ అవార్డు కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. 82వ గోల్డెన్ గ్లోబ్స్ 2025 అవార్డులకు కూడా పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం నామినేట్ అయింది. బెస్ట్ నాన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్ విభాగాల్లో రేసులో నిలిచింది. అయితే, నేడు (జనవరి 6) కాలిఫోర్నియా వేదికగా గోల్డెన్ గ్లోబ్స్ 2025 అవార్డుల వేడుక సాగగా.. ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్ మూవీకి నిరాశ ఎదురైంది. అవార్డు దక్కలేదు. ఆ వివరాలు ఇవే..

yearly horoscope entry point

రెండు విభాగాల్లోనూ..

బెస్ట్ మోషన్ పిక్చర్ - నాన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ విభాగం నామినేషన్లలో ఉన్నా.. ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్ అవార్డు దక్కించుకోలేకపోయింది. ఈ కేటగిరీలో మ్యూజికల్ క్రైమ్ కామెడీ మూవీ ‘ఎమిలియో ప్రెజ్' అవార్డు సొంతం చేసుకుంది. బెస్ట్ డైరెక్టర్ విభాగంలోనూ పాయల్ కపాడియాకు అవార్డు కైవసం కాలేదు. బ్రూటలిస్ట్ చిత్రానికి గాను బ్రాడీ కోర్బెట్‍కు పురస్కారం దక్కింది. దీంతో రెండు విభాగాల్లో ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్ నామినేట్ అయినా గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం కాలేదు. దీంతో ఈ ఏడాది భారత్‍కు ఈ ఈవెంట్లో ఒక్క పురస్కారం దక్కనట్టయింది.

ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్ గురించి..

ముంబైలో నివసించే ఇద్దరు మలయాళీ నర్సుల జీవితాల చుట్టూ ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రం సాగుతుంది. వారి పరిస్థితులు, ఎదుర్కొనే సవాళ్లతో ఈ మూవీ ఉంటుంది. ఎమోషనల్‍గా హృదయాలను తాకేలా ఈ చిత్రాన్ని డింపుల్ కపాడియా తెరకెక్కించారు. ఆలోచింపజేసేలా లోతైన విషయాలను ఈ మూవీని చూపించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒమాబా కూడా తనకు ఈ చిత్రం నచ్చిందని వెల్లడించారు.

ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రంలో కని కశృతి, దివ్య ప్రభ ప్రధాన పాత్రలు పోషించారు. వారి పాత్రల్లో జీవించేశారు. ఛాయా కదమ్, హృదు హరూన్, అజీస్ నెడుమంగద్, ఆనంద్ సమి ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటించారు.

ఆల్ మీ ఇమాజిన్ యాజ్ లైట్ సినిమాను ఇండియాలో రిలీజ్ చేశారు టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి. తన బ్యానర్ స్పిరిట్ మీడియా తరఫున హక్కులను దక్కించుకొని.. డిస్ట్రిబ్యూట్ చేశారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా చాలా ఫిల్మ్ ఫెస్టివళ్లలో ఈ మూవీ ప్రదర్శితమైంది. అవార్డులను దక్కించుకుంది.

స్ట్రీమింగ్ ఎక్కడ..

ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్ సినిమా ఇటీవలే డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. జనవరి 3వ తేదీన ఈ చిత్రం స్ట్రీమింగ్ మొదలైంది.

Whats_app_banner