Alia Bhatt Saree: ఆలియా భట్ మెట్ గాలా 2024 చీర వెనుక 163 మంది కళాకారులు, 1905 గంటల శ్రమ-alia bhatt saree for met gala 2024 this sabyasachi saree needed 163 craftsmen and 1905 hours of work to make ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Alia Bhatt Saree: ఆలియా భట్ మెట్ గాలా 2024 చీర వెనుక 163 మంది కళాకారులు, 1905 గంటల శ్రమ

Alia Bhatt Saree: ఆలియా భట్ మెట్ గాలా 2024 చీర వెనుక 163 మంది కళాకారులు, 1905 గంటల శ్రమ

Hari Prasad S HT Telugu
May 07, 2024 08:13 AM IST

Alia Bhatt Saree: ఆలియా భట్ మెట్ గాలా 2024 కోసం కట్టుకున్న చీర వెనుక పెద్ద కథే ఉంది. సబ్యసాచి డిజైన్ చేసిన ఈ చీరను తయారు చేయడానికి 163 మంది కళాకారులు 1905 గంటల పాటు శ్రమించారు.

ఆలియా భట్ మెట్ గాలా 2024 చీర వెనుక 163 మంది కళాకారులు, 1905 గంటల శ్రమ
ఆలియా భట్ మెట్ గాలా 2024 చీర వెనుక 163 మంది కళాకారులు, 1905 గంటల శ్రమ

Alia Bhatt Saree: ఆలియా భట్ చీరలో కనిపించడం ఈ మధ్య సాధారణమైపోయింది. పెళ్లయి, పాప పుట్టిన తర్వాత సినిమాల్లోనే కాదు బయట కూడా రకారకాల చీరల్లో ఆలియా మురిపిస్తోంది. తాజాగా ప్రపంచమంతా చూసే మెట్ గాలా 2024 (Met Gala 2024) కోసం కూడా ఆలియా చీరలోనే వెళ్లింది. గతేడాదే తొలిసారి మెట్ గాలా రెడ్ కార్పెట్ పై మెరిసిన ఆలియా.. ఇప్పుడు రెండోసారి ఇలా ప్రత్యేకమైన చీరలో మెరిసింది.

చీరలో ఆలియా అందం

ఆలియా భట్ కట్టుకున్న ఈ షిమ్మరీ శారీని ప్రముఖ డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేశాడు. గార్డెన్ ఆఫ్ టైమ్ అనే థీమ్ కు అతికినట్లు సరిపోయేలా భారతీయ సంస్కృతిని ఆమె మెట్ గాలాలో చాటింది. ఈ సందర్భంగా ప్రముఖ మ్యాగజైన్ వోగ్ (Vogue)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆలియా కాన్ఫిడెంట్ గా మాట్లాడింది. "చీర కంటే కాలాతీతమైనది మరొకటి లేదు" అని చెబుతూ ఆ చీర, భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని ఆలియా చెప్పే ప్రయత్నం చేసింది.

ఈ పాస్టల్ గ్రీన్ శారీ, దానికి సరిపడా నగలతో ఆలియా చాలా అందంగా, మొత్తం షోలో ప్రత్యేకంగా నిలిచింది. ముఖ్యంగా పొడవాటి కొంగు ఈ చీరకు స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఆమె రెడ్ కార్పెట్ పైకి రాగానే కెమెరాల కళ్లన్నీ ఆలియా చుట్టూనే ఉన్నాయి. అప్పటి నుంచీ అసలు ఈ చీర వెనుక స్టోరీ ఏంటో తెలుసుకునే పనిలో అందరూ ఉన్నారు.

ఆలియా చీర వెనుక కథ

ఆలియా భట్ కట్టుకున్న చీర కొంగు మొత్తం రెడ్ కార్పెట్ ను కవర్ చేసిందంటే ఎంత పెద్దగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మెట్ గాలాకు వచ్చిన మిగిలిన వాళ్లంతా మోడర్న్ డ్రెస్ లలో కనిపిస్తే.. ఆలియా మాత్రం ఇలా చీరలో కళ్లు చెదిరే అందంతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆమె ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. మెట్ గాలా 2024 అనే క్యాప్షన్ తో ఆలియానే ఈ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. అద్భుతంగా ఉన్నావంటూ ఈ పోస్టుకు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఆమె కట్టుకున్న ఈ చీర వెనుక పెద్ద కథే ఉంది. ఈ చీరను తయారు చేయడానికి చాలానే శ్రమించాల్సి వచ్చింది. ఏకంగా 163 మంది హస్త కళాకారులు 1905 గంటల పాటు శ్రమించాల్సి వచ్చిందంటే నమ్మగలరా? మెట్ గాలాలో ఆలియా ఇలా ప్రత్యేకంగా కనిపించడం వెనుక ఇంత మంది శ్రమం దాగి ఉంది. ఆలియా స్టైల్ ను అనితా ష్రాఫ్ అడజానియా చూసుకున్నారు.

పునీత్ సైనీ మేకప్ వేయగా.. అమిత్ ఠాకూర్ హెయిర్ స్టైలిస్ట్ గా ఉన్నాడు. ఈ చీరను ఇటలీలో తయారు చేయడం విశేషం. ఈ మాస్టర్ పీస్ తయారు చేసిన కళాకారులను తాను వ్యక్తిగతంగా కలవాలని అనుకుంటున్నట్లు ఈ సందర్భంగా ఆలియా చెప్పింది. ఆరు గజాల చీరతో ఆకట్టుకోవడమే కాదు తన మాటలతోనే ఆలియా అక్కడి వాళ్ల మనసులు గెలుచుకుంది.

IPL_Entry_Point