RRKPK OTT: సైలెంట్‍గా ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ ప్రేమ కావ్యం.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Rocky Aur Rani Ki Prem Kahani OTT: ఈ మధ్య ఓటీటీల్లోకి సడెన్‌గా ఎంట్రీ ఇస్తున్న బ్లాక్ బస్టర్ చిత్రాలు. ఎప్పుడు వాటిని రిలీజ్ చేస్తున్నారో తెలియడం లేదు. అలా తాజాగా హిందీలో సూపర్ హిట్‍గా నిలిచిన లవ్ స్టోరీ మూవీ రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ ఓటీటీలోకి వచ్చేసింది.
RRR సినిమాతో తెలుగు వారికి పరిచయమైన అందాల ముద్దుగుమ్మ అలియా భట్ ఇటీవల హిందీలో నటించిన సినిమా రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ. ఇందులో హీరోగా రణ్‍వీర్ సింగ్ నటించాడు. అయితే రణ్‍వీర్ సింగ్ నుంచి భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలైన సినిమానే రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ. ప్రముఖ హిందీ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తెరకెక్కించిన ఈ సినిమాను హిరో జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా కలిసి సంయుక్తంగా నిర్మించారు.
ట్రెండింగ్ వార్తలు
పాతికేళ్లు పూర్తి
రొమాంటిక్ లవ్, కామెడీ ఎంటర్టైనర్‍గా వచ్చిన రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ మూవీ జూలై 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అయితే, ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. రివ్యూలు కూడా మిశ్రమంగా వచ్చాయి. కానీ, టాక్‍తో సంబంధం లేకుండా కలెక్షన్ల పరంగా మాత్రం సూపర్ హిట్ కొట్టింది. మంచి కలెక్షన్లు తెచ్చిపెట్టింది. బాలీవుడ్ చిత్ర సీమలో పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చాలా గ్యాప్ తర్వాత కరణ్ జోహార్ ఈ సినిమాను తెరకెక్కించాడు.
భారీ ధరకు
సుమారు ఏడేళ్ల తర్వాత మెగా ఫోన్ పట్టుకుని కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి సైలెంట్‍గా వచ్చేసింది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‍ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడీయో (Amazon Prime Video) భారీ ధరకు ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిందని టాక్. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ వేదికగా కేవలం హిందీ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది.
పెరిగిన రన్ టైమ్
అంతేకాకుండా రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ మూవీలోని డిలీటెడ్ సన్నివేశాలను జోడించి మరి ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. దీంతో రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ మూవీ రన్ టైమ్ పది నిమిషాలకు పెరిగింది. కాగా ఇందులో అలియా, రణ్‍వీర్‍తోపాటు ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీ, తోట రాయ్ చౌదరి, ఆమీర్ బషీర్, చుర్ని గంగూలీ, అంజలి ఆనంద్ కీలక పాత్రలు పోషించారు. ప్రీతమ్ చక్రవర్తి సంగీతం అందించారు.
టాపిక్