Alia Bhatt Poacher Web Series Review: పోచర్ బెస్ట్ వెబ్ షోలలో ఒకటి: ఆలియా భట్ రివ్యూ
Alia Bhatt Poacher Web Series Review: బాలీవుడ్ నటి ఆలియా భట్ ప్రొడ్యూసర్లలో ఒకరిగా ఉన్న వెబ్ సిరీస్ పోచర్. కేరళ అడవుల్లో జరుగుతున్న ఏనుగుల వేట క్రైమ్ రాకెట్ చుట్టూ తిరిగే ఈ సిరీస్ బెస్ట్ వెబ్ షోలలో ఒకటని ఆమె చెప్పింది.
Alia Bhatt Poacher Web Series Review: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఢిల్లీ క్రైమ్ లాంటి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అందించిన రిచీ మెహతా ఇప్పుడు పోచర్ పేరుతో మరో క్రైమ్ డ్రామా సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సిరీస్ కు బాలీవుడ్ నటి ఆలియా భట్ సహ నిర్మాతగా వ్యవహరించింది. ఈ మధ్యే ఈ సిరీస్ చూసిన ఆలియా.. బెస్ట్ వెబ్ షోలలో ఇదీ ఒకటని స్పష్టం చేసింది.
ఆలియా పోచర్ రివ్యూ
నిమిషా సజయన్, రోషన్ మాథ్యూ, దిబ్యేందు భట్టాచార్య, రంజితా మేనన్ లాంటి వాళ్లు నటించిన పోచర్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ ట్రైలర్ వచ్చేసింది. కేరళ అడవుల్లో సాగే ఏనుగుల వేట చుట్టూ ఈ కథ తిరగనుంది. అయితే ఈ సిరీస్ పై ఆలియా భట్ అప్పుడే తన రివ్యూ చెప్పేసింది.
ఇన్‌స్టాగ్రామ్ లో శుక్రవారం (ఫిబ్రవరి 16) ఆలియా తన రివ్యూ రాసింది. చాలా రోజుల తర్వాత తాను చూసిన బెస్ట్ వెబ్ షోలలో పోచర్ ఒకటని ఆమె చెప్పింది. ఈ పవర్‌ఫుల్ స్టోరీ టెల్లింగ్ లో తాను భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది.
"అత్యద్భుతమైన క్రియేటర్ రిచీ మెహతా.. అంతకంటే అద్భుతమైన నటీనటులు దిబ్యేందు, రోషల్ మాథ్యూ, నా ఆల్ టైమ్ ఫేవరెట్ నిమిషాలతో షో చాలా బాగుంది. ట్రైలర్ రిలీజ్ లో నిమిషాను మిస్సయ్యాను. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అని ఆలియా రాసింది.
పోచర్ వెబ్ సిరీస్ పై ఆలియా రాసిన రివ్యూ అభిమానులకు బాగా నచ్చింది. లక్షల మంది ఈ రివ్యూని లైక్ చేశారు. ఈ పోచర్ వెబ్ సిరీస్ కు ఆలియా భట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూర్ గా ఉంది. గతంలో డార్లింగ్స్ మూవీ ద్వారా ఓటీటీలో అడుగుపెట్టిన ఆలియా.. ఇప్పుడు ప్రొడ్యూసర్ గా ఈ సిరీస్ తీసింది.
పోచర్ సిరీస్ ట్రైలర్
పోచర్ వెబ్ సిరీస్ ట్రైలర్ గురువారం (ఫిబ్రవరి 15) రిలీజైంది. అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు గెలుచుకున్న రిచీ మెహతా డైరెక్షన్ లో వస్తున్న సిరీస్ కావడంతో ఈ పోచర్ పై ఆసక్తి నెలకొంది. కేరళ అడవుల్లో ఏనుగుల వేట రాకెట్ చుట్టూ ఈ కథ నడుస్తున్నట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.
"ఇండియాలోని అతి పెద్ద క్రైమ్ రాకెట్స్ లో ఇదీ ఒకటి" అనే క్యాప్షన్ తో ఆలియా ఈ ట్రైలర్ షేర్ చేసింది. కేరళ అడవుల్లో ఓ ఏనుగును ఓ ముఠా మట్టుబెట్టే సీన్ తో ట్రైలర్ మొదలువుతుంది. 1990ల నుంచి సైలెంట్ గా ఉన్న ఈ ఏనుగులను వేటాడే ముఠా మళ్లీ యాక్టివ్ అయిందంటూ ఈ రాకెట్ ను ఇన్వెస్టిగేట్ చేసే టీమ్ మాట్లాడుకుంటూ ఉంటుంది.
అసలు దేశ చరిత్రలోనే ఇంత పెద్ద క్రైమ్ రాకెట్ లేదు అన్నట్లుగా మేకర్స్ ఈ ఏనుగుల వేట ఎంత పెద్ద రాకెటో చెప్పే ప్రయత్నం చేసింది. దీని విలువ ఏకంగా రూ.కోటి కోట్లని ట్రైలర్ చివర్లో చెప్పడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. పోచర్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ట్రైలర్ ద్వారా వెల్లడించారు.
టాపిక్