Alia Bhatt Hollywood Movie: అలియా భ‌ట్‌ హాలీవుడ్ మూవీ - ర‌ణ్‌భీర్ బాలీవుడ్ మూవీ ఒకే రోజు రిలీజ్‌-alia bhatt hollywood film heart of stone ranbir kapoor animal release on same date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Alia Bhatt Hollywood Film Heart Of Stone Ranbir Kapoor Animal Release On Same Date

Alia Bhatt Hollywood Movie: అలియా భ‌ట్‌ హాలీవుడ్ మూవీ - ర‌ణ్‌భీర్ బాలీవుడ్ మూవీ ఒకే రోజు రిలీజ్‌

Nelki Naresh Kumar HT Telugu
Jan 19, 2023 01:15 PM IST

Alia Bhatt Hollywood Movie: అలియాభ‌ట్ హాలీవుడ్ డెబ్యూ మూవీ హార్ట్ ఆఫ్ స్టోన్ రిలీజ్ డేట్‌ను గురువారం రివీల్ చేశారు. అదే రోజు ర‌ణ్‌భీర్ క‌పూర్ యానిమ‌ల్ సినిమా కూడా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఒకేరోజు భార్యాభ‌ర్త‌లు న‌టించిన సినిమాలు రిలీజ్ కావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

అలియాభ‌ట్‌, ర‌ణ్‌భీర్ క‌పూర్‌
అలియాభ‌ట్‌, ర‌ణ్‌భీర్ క‌పూర్‌

Alia Bhatt Hollywood Movie: బాలీవుడ్ క‌పుల్ ర‌ణ్‌భీర్‌క‌పూర్‌, అలియాభ‌ట్ ఒకేరోజు వేర్వేరు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు.హార్ట్ ఆఫ్ స్టోన్ సినిమాతో అలియాభ‌ట్ హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను గురువారం అనౌన్స్‌చేశారు. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా ఆగ‌స్ట్ 11న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

హార్ట్ ఆఫ్ స్టోన్ సినిమాలో హాలీవుడ్ స్టార్స్‌ గ‌లా గ‌డోట్‌, జైమీ డోర్న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కేయా ధావ‌న్ అనే పాత్ర‌లో అలియా భ‌ట్ క‌నిపించ‌బోతున్న‌ది. ఇందులో యాక్ష‌న్ రోల్‌లో అలియా న‌టిస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా అగ‌స్ట్ 11న ర‌ణ్‌భీర్‌ క‌పూర్ న‌టిస్తోన్న యానిమ‌ల్ సినిమా కూడా రిలీజ్ కానుంది.

ఒకేరోజు భార్యాభ‌ర్త‌ల సినిమాలు రిలీజ్ కావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఒక‌రు ఓటీటీ ద్వారా మ‌రోక‌రు థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌బోతున్నారు. యానిమ‌ల్ సినిమాకు అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తండ్రీకొడుకుల అనుబంధం నేప‌థ్యంలో క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా యానిమ‌ల్ రూపొందుతోంది. యానిమ‌ల్ సినిమాలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది. అనిల్ క‌పూర్‌, బాబీడియోల్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

ఆగ‌స్ట్ 11న యానిమ‌ల్ సినిమాను రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ఇటీవ‌లే చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. కాగా నాలుగైదేళ్ల పాటు ప్రేమ‌లో ఉన్న అలియాభ‌ట్‌, ర‌ణ్‌భీర్‌క‌పూర్ గత ఏడాది ఏప్రిల్ 14న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ముంబాయిలో నిరాడంబ‌రంగా వీరి పెళ్లి జ‌రిగింది. న‌వంబ‌ర్‌లో పండంటి చిన్నారికి అలియాభ‌ట్ జ‌న్మ‌నిచ్చింది. త‌మ ముద్దుల కూతురుకు ర‌హ అనే పేరు పెట్టారు.

IPL_Entry_Point