Alia Bhatt Baby Shower: అలియాభట్ సీమంతం వేడుక ఎప్పుడంటే...
Alia Bhatt Baby Shower: అలియా భట్ సీమంతం వేడుకను గ్రాండ్ గా జరిపేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీమంతం వేడుక ఎప్పుడు జరుగనుందంటే...
Alia Bhatt Baby Shower: రణ్‌భీర్‌కపూర్, అలియా భట్ లకు 2022 ఏడాది ఎన్నో తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 14న ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి అయిన రెండు నెలల తర్వాత జూన్ లో తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. అలియా ప్రెగ్నెన్సీతో భట్ ఫ్యామిలీతో పాటు రణ్‌భీర్ కుటుంబం ఆనందంలో మునిగితేలుతోంది. తాజాగా అలియా సీమంతం వేడుకను భారీగా జరిపేందుకు ఇరు కుటుంబ సభ్యులు ప్లాన్ చేసినట్లు తెలిసింది.
ట్రెండింగ్ వార్తలు
అక్టోబర్ నెలలో ఈ సీమంతం వేడుక జరుగనున్నట్లు తెలిసింది. అలియా మదర్ సోని రజ్దాన్, అత్తగారు నీతూ కపూర్ ఈ వేడుకను నిర్వహించే బాధ్యతను చేపట్టినట్లు తెలిసింది. పూర్తిగా వెజ్ వంటకాలతో సీమంతం ఈవెంట్ ను స్పెషల్ గా నిర్వహించనున్నట్లు తెలిసింది. నాన్ వెజ్ ఐటమ్స్ ఈ వేడుకలో కనిపించవని సమాచారం.
2020లో అలియా పూర్తిగా వెజిటేరియన్ గా మారిపోయింది. అందుకే అభిప్రాయాలకు గౌరవిస్తూ వెజ్ థీమ్ తో సీమంతం ఫంక్షన్ నిర్వహించనున్నట్లు తెలిసింది. సీమంతం వేడుక జరిగే వేదికను రణ్‌భీర్, అలియా చిన్ననాటి ఫొటోలతో వినూత్నంగా ఆలకరించబోతున్నట్లు తెలిసింది.
ఇప్పటికే సీమంతం వేడుకకు హాజరయ్యే అథితుల లిస్ట్ ను ఫైనలైజ్ చేసినట్లు తెలిసింది. రణ్ భీర్, అలియా ఫ్యామిలీస్ తో పాటు క్లోజ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కొద్ది మంది మాత్రమే హాజరుకానున్నట్లు తెలిసింది. కరీనా కపూర్, కరిష్మాకపూర్, అనుష్క రంజన్, ఆకాంక్షతో పాటు అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ నుంచి నవ్యా నందా, శ్వేత బచ్చన్ లకు ఆహ్వానం అందినట్లు తెలిసింది.
కాగా ఇటీవల విడుదలైన బ్రహ్మాస్త్రతో రణ్‌భీర్, అలియా పెద్ద సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో బేబీ ఆన్ బోర్డ్ అంటూ వినూత్న రీతిలో డిజైన్ చేసిన డ్రెస్ అలియా కనిపించింది. అలియా బేబీ బంప్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రెగ్నెన్సీ సమయంలో బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొని తన అంకితభావాన్ని చాటుకున్నది.