ఓటీటీలోకి ఆలస్యంగా 65 కోట్ల సూపర్ హిట్ కామెడీ మూవీ.. 7.2 రేటింగ్.. 5 భాషల్లో స్ట్రీమింగ్.. ఇక్కడ చూసేయండి!-alappuzha gymkhana ott streaming on sonyliv in 5 languages malayalam sports comedy drama alappuzha gymkhana ott release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలోకి ఆలస్యంగా 65 కోట్ల సూపర్ హిట్ కామెడీ మూవీ.. 7.2 రేటింగ్.. 5 భాషల్లో స్ట్రీమింగ్.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి ఆలస్యంగా 65 కోట్ల సూపర్ హిట్ కామెడీ మూవీ.. 7.2 రేటింగ్.. 5 భాషల్లో స్ట్రీమింగ్.. ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలోకి ఆలస్యంగా సూపర్ హిట్ మలయాళ కామెడీ మూవీ అలప్పుళ జింఖానా డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఐఎమ్‌డీబీ నుంచి 7.2 రేటింగ్ సాధించుకున్న అలప్పుళ జింఖానా ఐదు భాషల్లో ఓటీటీ రిలీజ్ కానుంది. ప్రేమలు హీరో నస్లెన్, అనఘా రవి నటించిన అలప్పుళ జింఖానా ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలోకి ఆలస్యంగా 65 కోట్ల సూపర్ హిట్ కామెడీ మూవీ.. 7.2 రేటింగ్.. 5 భాషల్లో స్ట్రీమింగ్.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి మరో సూపర్ హిట్ మలయాళ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల కాలంలో మలయాళ సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో తెలిసిందే. అలా ప్రేమలు మూవీ మాలీవుడ్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఆదరణ పొందింది. ఈ సినిమాతో మలయాళ హీరో నస్లెన్ గఫూర్ పాపురలర్ అయ్యాడు.

ఏప్రిల్ 10న థియేటర్లలో

రీసెంట్‌గా నస్లెన్ గఫూర్ హీరోగా చేసిన మలయాళ స్పోర్ట్స్ కామెడీ డ్రామా సినిమానే అలప్ఫుళ జింఖానా. బాక్సింగ్, కామెడీ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల అయింది. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రూ. 65 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.

ఐఎమ్‌డీబీ రేటింగ్

అలాగే, ఐఎమ్‌డీబీ నుంచి 10కి 7.2 రేటింగ్ సాధించింది అలప్పుళ జింఖానా మూవీ. ఇప్పుడు అలప్పుళ జింఖానా ఓటీటీలోకి వచ్చేయనుంది. జూన్ 6నే అలప్పుళ జింఖానా ఓటీటీ రిలీజ్ అవుతుందని రూమర్స్ వినిపించాయి. కానీ, అలా జరగలేదు. దీంతో తాజాగా అలప్పుళ జింఖానా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించారు.

ఐదు భాషల్లో స్ట్రీమింగ్

సోనీ లివ్‌లో జూన్ 13 నుంచి అలప్పుళ జింఖానా ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అంటే అలప్పుళ జింఖానా ఓటీటీలోకి రూమర్ తేది కంటే ఆలస్యంగా రిలీజ్ కానుంది. "క‌డుపుబ్బా గ‌ట్టిగా న‌వ్వెందుకు రెడీగా ఉండండి. స్పోర్ట్స్‌, కామెడీ, డ్రామా వంటి ఎలిమెంట్స్‌తో థియేట‌ర్స్‌లో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన‌ మ‌ల‌యాళ చిత్రం ‘అల‌ప్పుళ జింఖానా’ ఇప్పుడు ఓటీటీలో ఆడియెన్స్‌ను అల‌రించ‌టానికి తెలుగు , తమిళ్, కన్నడ, హిందీ 5 భాషల్లో సిద్ధ‌మైంది" అంటూ సోనీ లివ్ సోషల్ మీడియాలో ప్రకటించింది.

స్పోర్ట్స్ కోటాలో

‘అల‌ప్పుళ జింఖానా’ కథలోకి వెళితే.. ప్రధాన పాత్రధారి జోజో జాన్సన్ (నస్లెన్) ఓ కాలేజీ విద్యార్థి. ఇతడు ముచ్చట‌ప‌డి త‌న‌కు న‌చ్చిన కాలేజీలోకి స్పోర్ట్స్ కోటా ద్వారా జాయిన్ కావ‌టానికి బాక్సింగ్‌లో చేరతాడు. అయితే కథ అస‌లు మలుపు అక్క‌డే తీసుకుంటుంది.

అసలైన బాక్సింగ్

అతడు తన స్నేహితులతో కలిసి కఠినమైన, అసలు బాక్సింగ్‌ను నేర్పించే కోచ్ ఆంటోనీ జోషువా (లుక్‌మాన్ అవరాన్)ను కలిస్తాడు. పట్టుదల, శ్రమ, బాక్సింగ్‌లో త‌గిలే నిజమైన దెబ్బల గురించి మాట్లాడతాడు. దీని కోసం అత‌ను ఎంచుకున్న షార్ట్ క‌ట్ ప్ర‌యాణంలో త‌న‌ను తాను తెలుసుకుని క‌ష్ట‌ప‌డతాడు. దీంతో ఆ జ‌ర్నీ అత‌నికొక మ‌రుపురానిదిగా మారుతుంది.

నటీనటులు

ఆ తర్వాత ఏమైందనేదే అల‌ప్పుళ జింఖానా కథ. ఈ సినిమాకు ఖలీద్ రెహ్మాన్ దర్శకత్వం వహించటంతో పాటు జాబిన్ జార్జ్, సమీర్ కరాట్, సుబీష్ కన్నంచేరి క‌లిసి నిర్మించారు. ఈ చిత్రంలో నస్లెన్ గఫూర్, లుక్‌మాన్ అవరాన్, గణపతి ఎస్. పొడువాల్, సందీప్ ప్రదీప్, అనఘా రవి, ఫ్రాంకో ఫ్రాన్సిస్, బేబీ జీన్, శివ హరిహరన్ తదితరులు నటించారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం