మలయాళం ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది వచ్చిన మరో బ్లాక్‌బస్టర్ మూవీ ఆలప్పుర జింఖానా (Alappuzha Gymkhana). ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించింది. ఈ స్పోర్ట్స్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర రూ.65 కోట్లకుపైగా వసూలు చేసింది. రెండు నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది.
ప్రేమలు మూవీ ఫేమ్ నస్లేన్ గఫూర్ లీడ్ రోల్లో నటించిన మూవీ ఆలప్పుర జింఖానా. ఇదో కామెడీ స్పోర్ట్స్ డ్రామా. ఖాలిద్ రెహమాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా జూన్ 13 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ శుక్రవారం (జూన్ 6) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది.
“మార్కుల కోసం ట్రైనింగ్ అయిన వాళ్లు.. అంతకంటే చాలా ఎక్కువైన దాని కోసం ఫైట్ చేసిన ఈ గ్రూపును చూడండి. ఆలప్పుర జింఖానా జూన్ 13 నుంచి సోనీలివ్ లో చూడండి” అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ట్వీట్ చేసింది. ఈ మూవీ మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
ఆలప్పుర జింఖానా మూవీ ఏప్రిల్ 10న రిలీజైంది. ఖాలిద్ రెహమాన్ డైరెక్ట్ చేయగా.. నస్లేన్‌తోపాటు లూక్మన్ అవరన్, గణపతి పొడువాల్, సందీప్ ప్రదీప్, అనఘ రవి, ఫ్రాంకో ఫ్రాన్సిస్ లాంటి వాళ్లు నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.65 కోట్లు వసూలు చేసి బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. ఐఎండీబీలోనూ 7.2 రేటింగ్ సాధించింది.
మలయాళం ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. పరీక్షల్లో ఫెయిలైన తర్వాత బాక్సింగ్ ను కెరీర్ గా తీసుకొని స్పోర్ట్స్ కోటాలో కాలేజీలోకి వెళ్లే కొందరు యువకుల చుట్టూ తిరిగే కథ ఇది. డిస్ట్రిక్ట్ లెవెల్లో వాళ్లు ఎలాగోలా గట్టెక్కినా.. తర్వాత వాళ్లకు అసలు సవాలు ఎదురవుతుంది.
స్పోర్ట్స్ డ్రామాతోపాటు కామెడీతోనూ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా అక్కడి యువత ఈ సినిమాకు బాగా ఆకర్షితులయ్యారు. దీంతో బాక్సాఫీస్ సక్సెస్ సాధించింది. మరి ఇప్పుడు జూన్ 13 నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
సంబంధిత కథనం