Bade Miyan Chote Miyan OTT: 350 కోట్ల బడ్జెట్ - 90 కోట్ల కలెక్షన్స్ - ఓటీటీలోకి అక్షయ్ కుమార్ డిజాస్టర్ మూవీ
Bade Miyan Chote Miyan OTT: అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన బాలీవుడ్ మల్టీస్టారర్ మూవీ బడే మియా ఛోటే మియా ఓటీటీలోకి వస్తోంది. జూన్ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.

Bade Miyan Chote Miyan OTT: బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ బ్యాడ్ టైమ్ నడుస్తోంది. గత నాలుగేళ్లలో ఏకంగా 12 ఫ్లాపులు అక్షయ్ ఖాతాలో చేరాయి. బడే మియా ఛోటే మియాతో అక్షయ్ హిట్టు బాట పట్టడం ఖాయమని అభిమానులు అనుకున్నారు. కానీ వారి అంచనాల్ని తలక్రిందులు చేస్తూ ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.
350 కోట్ల బడ్జెట్...
దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ బాలీవుడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో అక్షయ్‌కుమార్‌తో పాటు టైగర్ ష్రాఫ్ మరో హీరోగా నటించాడు. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపించాడు. మానుషి చిల్లార్, అల్యా ఎఫ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో సానాక్షి సిన్హా ఓ కీలక పాత్రలో కనిపించింది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన బడే మియా ఛోటే మియా మూవీ ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజైంది. రొటీన్ స్టోరీ కారణంగా బడే మియా ఛోటే మియా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది.
నెట్‌ఫ్లిక్స్‌లో...
తాజాగా అక్షయ్ కుమార్ మల్టీస్టారర్ మూవీ ఓటీటీలోకి వస్తోంది. బడే మియా ఛోటే మియా జూన్ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది.
బడే మియా ఛోటే మియా కథ ఇదే...
ఫ్రెడ్డీ (అక్షయ్ కుమార్), రాఖీ (టైగర్ ష్రాఫ్) ఇండియన్ ఆర్మీలో సైనికులుగా పనిచేస్తుంటారు. శత్రువులు చేస్తోన్న కుట్రలను తమ ప్రాణాలకు తెగించి పలుమార్లు తిప్పికొడతారు. తప్పుడు ఆరోపణల కారణంగా ఫ్రెడ్డీ, రాఖీల ఉద్యోగాలు పోతాయి. ఇండియన్ ఆర్మీకి చెందిన ఓ వెపన్‌ను కబీర్ (పృథ్వీరాజ్ సుకుమారన్) అనే వ్యక్తి దొంగిలించి లండన్‌కు తరలిస్తాడు.
ఆ ఆయుధాన్ని తిరిగి ఇండియాకు తీసుకొచ్చే బాధ్యతను ఫ్రెడ్డీ, రాఖీలకు సైన్యం అప్పగిస్తుంది. ఈ సీక్రెట్ ఆపరేషన్‌ను ఫ్రెడ్డీ, రాఖీ ఎలా సక్సెస్ చేశారు? ఈ ప్రయత్నంలో వారు చేసిన సాహసాలు ఏమిటి? భారత సైన్యానికి వ్యతిరేకంగా కబీర్ ఎందుకు పోరాడుతున్నాడు? అన్నదే ఈ మూవీ కథ.
తొలిరోజు నుంచే నెగెటివ్ టాక్...
బడే మియా ఛోటే మియా సినిమా మొదటి రోజు నుంచే నెగెటివ్ టాక్‌ను మూట గట్టుకుంది. యాక్షన్ తప్ప ఈ సినిమాలో ఏం లేదనే కామెంట్స్ వినిపించాయి. రొటీన్ టెంప్లెట్ స్టోరీతో దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ ఈ మూవీని తెరకెక్కించాడనే విమర్శలొచ్చాయి.
అక్షయ్ పది సినిమాలతో బిజీ...
12 ఫెయిల్యూర్స్ ఎదురైన బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్ క్రేజ్‌కు మాత్రం ఢోకా లేకుండా పోయింది. ప్రస్తుతం పది సినిమాల్లో హీరోగా నటిస్తూ అక్షయ్ కుమార్ బిజీగా ఉన్నాడు. అక్షయ్ హీరోగా నటిస్తోన్న సింగం అగైన్, స్కై ఫోర్స్, వెల్‌కమ్ టూ ది జంగిల్, శంకర, ఖేల్ ఖేల్ మే సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. మరో ఐదు సినిమాలకు ఈ బాలీవుడ్ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీటిలో ఈ ఏడాది సర్ఫారితో పాటు స్కైఫోర్స్, సింగం అగైన్‌తో పాటు మరో రెండు రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.