Sarfira trailer: అక్షయ్ కుమార్ సర్ఫిరా ట్రైలర్ వచ్చేసింది.. రూపాయికే ఎయిర్ లైన్ టికెట్ అంటూ..-akshay kumar sarfira trailer released soorarai pottru remake movie giving goosebumps ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sarfira Trailer: అక్షయ్ కుమార్ సర్ఫిరా ట్రైలర్ వచ్చేసింది.. రూపాయికే ఎయిర్ లైన్ టికెట్ అంటూ..

Sarfira trailer: అక్షయ్ కుమార్ సర్ఫిరా ట్రైలర్ వచ్చేసింది.. రూపాయికే ఎయిర్ లైన్ టికెట్ అంటూ..

Hari Prasad S HT Telugu

Sarfira trailer: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన సర్ఫిరా మూవీ ట్రైలర్ మంగళవారం (జూన్ 18) రిలీజైంది. తమిళంలో వచ్చిన సూరారై పొట్రు మూవీకి రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకు కూడా సుధ కొంగరనే దర్శకత్వం వహించింది.

అక్షయ్ కుమార్ సర్ఫిరా ట్రైలర్ వచ్చేసింది.. రూపాయికే ఎయిర్ లైన్ టికెట్ అంటూ..

Sarfira trailer: అక్షయ్ కుమార్ నెక్ట్స్ మూవీ సర్ఫిరా ట్రైలర్ వచ్చేసింది. తమిళంలో సూరారై పొట్రుగా రిలీజై.. తెలుగులో ఆకాశమే హద్దురా అంటూ డబ్ అయిన మూవీకి రీమేక్ గా ఈ సర్పిరా (Sarfira) వస్తోంది. తమిళంలో సూర్య నటించిన ఈ మూవీని డైరెక్ట్ చేసిన సుధ కొంగరే హిందీ రీమేక్ ను కూడా డైరెక్ట్ చేసింది. ఈ మూవీలో అక్షయ్ తోపాటు పరేష్ రావల్, రాధికా మదన్, సీమా బిశ్వాస్ ముఖ్యమైన పాత్రలు పోషించారు.

సర్ఫిరా మూవీ ట్రైలర్

రూపాయికే ఎయిర్ లైన్ టికెట్ అందించాలన్న కలలు కనే ఓ వ్యక్తి చుట్టూ తిరిగే కథతో వచ్చి సంచలన విజయం సాధించిన మూవీ సూరారై పొట్రు. సూర్య ఈ సినిమాలో నటించాడు. ఇప్పుడిదే మూవీ హిందీలో సర్ఫిరాగా రీమేక్ అయింది. మామూలు వ్యక్తులు కూడా విమానం ఎక్కాలని కలలు కనే ఆ వ్యక్తి.. తన జీవితంలో అనుకున్నది సాధించాడా లేదా అన్నది ఈ సినిమా.

హిందీ అక్షయ్ కుమార్ నటించడంతో ట్రైలర్ తోనే గూస్‌బంప్స్ వచ్చేస్తున్నాయి. దేశ అభివృద్ధికి ఎయిర్ లైన్స్ కూడా సామాన్యుడికి అందుబాటులోకి రావడం చాలా ముఖ్యమని చాటి చెబుతూ సాగే సినిమా ఇది. ఇప్పటికే ఈ మూవీని తెలుగు, తమిళంలలో చూసిన వారికి కొత్తగా అనిపించకపోవచ్చు కానీ హిందీ ప్రేక్షకులకు మాత్రం కచ్చితంగా ఇదో కొత్త అనుభూతిని అందించబోయే సినిమానే.

ఈ సర్ఫిరా ట్రైలర్ ను రిలీజ్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ అక్షయ్ ఓ పోస్ట్ చేశాడు. "కల అంటే మీరు నిద్రలో కనేది కాదు. కల అంటే మిమ్మల్ని అసలు నిద్రపోకుండా చేసేది. అలాంటి కలకు సంబంధించిన కథే ఈ సర్ఫిరా" అనే క్యాప్షన్ తో ఈ మూవీ ట్రైలర్ ను అతడు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.

వేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న సర్ఫిరా

అక్షయ్ కుమార్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఈ సర్ఫిరా మూవీని అనౌన్స్ చేశాడు. పెద్ద పెద్ద కలలు కనండి.. మిమ్మల్ని చూసి పిచ్చివాళ్లు అనేంత పెద్ద కలలు అంటూ ఈ సినిమా గురించి అప్పట్లో అక్షయ్ చెప్పుకొచ్చాడు. ఈ మూవీకి కథను సుధ కొంగరతోపాటు షాలిని ఉషాదేవి అందించారు. మూవీ టీమ్ కూడా ట్రైలర్ సందర్భంగా సినిమా గురించి ఓ ప్రకటన విడుదల చేసింది.

"ఓ సాధారణ వ్యక్తి కూడా పెద్ద కలలు కనేలా స్ఫూర్తి నింపే మూవీ సర్ఫిరా. ప్రపంచమంతా తనను పిచ్చోడంటన్నా.. ఆ కలలను ఛేదించడానికి ప్రయత్నించే ఓ సాధారణ వ్యక్తి చేసే ప్రయత్నం ఇది" అని మేకర్స్ చెప్పారు. అక్షయ్ కుమార్ చివరిగా బడే మియా చోటే మియా మూవీలో నటించాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ డిజాస్టర్ గా మిగిలిపోయింది.