బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరిగా ఖిలాడీ అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ పేరు తెచ్చుకున్నారు. 90స్ నుంచి ఎన్నో చిత్రాలు చేస్తూ అభిమానులను, ఆడియెన్స్‌ను అలరిస్తున్నారు. రియల్ స్టంట్స్ చేస్తూ ఆశ్చర్య పరిచే అక్షయ్ కుమార్, యాక్టింగ్‌తో అదరగొట్టే సైఫ్ అలీ ఖాన్ ఇద్దరు కలిసి మరోసారి వెండితెరపై దర్శనం ఇవ్వనున్నారు.
అయితే, సుమారు 17 ఏళ్ల తర్వాత అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ కలిసి నటిస్తున్నారు. వీరిద్దరిని ఒక్కటిగా చేసిన సినిమా హైవాన్. సరికొత్త థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న హైవాన్ మూవీకి ప్రముఖ డైరెక్టర్ ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు.
హైవాన్ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ప్రెస్టీజియస్ మూవీతో ఫస్ట్ టైమ్ నెగెటివ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు అక్షయ్ కుమార్. ఇటీవల "హైవాన్" సినిమా లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్బంగా ఓ స్పెషల్ వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు అక్షయ్ కుమార్.
ఈ వీడియోలో అక్షయ్ కుమార్ స్పందిస్తూ.. "హైవాన్ మూవీతో ఒక గ్రేట్ జర్నీ చేస్తున్నా. ఈ చిత్రంలో నటిస్తున్న క్యారెక్టర్ అనేక అంశాల్లో నన్ను ఆశ్చర్యపరుస్తోంది. ఇలాంటి పాత్రలో నటించే అవకాశం కల్పించిన డైరెక్టర్ ప్రియదర్శన్‌కు థ్యాంక్స్. ఆయన మూవీ సెట్‌లో ఉంటే ఇంట్లో ఉన్న ఫీల్ కలుగుతుంది. సైఫ్‌తో కలిసి నటించడాన్ని ఎంజాయ్ చేస్తున్నా" అని తెలిపారు.
ఇకపోతే హైవాన్ చిత్రాన్ని టాప్ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో నిర్మిస్తున్నారు నిర్మాతలు వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయ్ ఫెన్. అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ కలిసి ఎన్నో హిందీ చిత్రాల్లో నటించారు. వాటిలో మెయిన్ ఖిలాడీ తు అనారీ, యే దిల్లాగీ, తు చోర్ మెయిన్ సిపాయి, తాషన్ వంటి సినిమాలు ఉన్నాయి.
ఇప్పుడు అక్షయ్, సైఫ్ కలిసి 17 ఏళ్ల తర్వాత కలిసి నటించడం వారి అభిమానులను తెగ సంతోషపెడుతుంది. అయితే, ఈ ఇద్దరు స్టార్ హీరోలు తెలుగులోనూ నటించారు. మంచు విష్ణు కన్నప్ప సినిమాలో శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ నటించగా.. జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీలో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా ఆకట్టుకున్నాడు.
దేవర మాత్రమే కాకుండా ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీలో సైఫ్ అలీ ఖాన్ రావణసూరుడిగా నటించిన విషయం తెలిసిందే. ఆదిపురుష్ మూవీతో దేవర కంటే ముందే తెలుగు వారికి సుపరిచితం అయ్యాడు సైఫ్ అలీ ఖాన్.
సంబంధిత కథనం