బాలీవుడ్ హిస్టారికల్ కోర్ట్ రూమ్ డ్రామా మూవీ ‘కేసరి చాప్టర్ 2’ ప్రశంసలు దక్కించుకుంటోంది. అక్షయ్ కుమార్, ఆర్ మాధవన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా మంచి కలెక్షన్లను కూడా సాధిస్తోంది. ఏప్రిల్ 18న హిందీలో విడుదలైన ఈ చిత్రానికి ఇంకా థియేట్రికల్ రన్ జోరుగా సాగుతోంది. బ్రిటీషర్ల పాలన కాలంలో జరిగిన జలియన్ వాలాబాగ్ మారణహోమం బ్యాక్‍డ్రాప్‍తో ఈ మూవీ తెరకెక్కింది. హిందీలో పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్న కేసరి చాప్టర్ 2ను తెలుగులోనూ వస్తోంది.
కేసరి చాప్టర్ 2 చిత్రం తెలుగు డబ్బింగ్ వెర్షన్ థియేటర్లలో మే 23వ తేదీన విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ వెర్షన్‍ను ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‍మెంట్ రిలీజ్ చేస్తోంది. న్యాయం, పోరాటంతో సాగే పవర్‌ఫుల్ స్టోరీని మే 23వ తేదీన తీసుకొస్తున్నామంటూ నేడు (మే 14) సోషల్ మీడియాలో ఓ ప్రొడక్షన్ హౌస్ పోస్ట్ చేసింది.
కేసరి చాప్టర్ 2 సినిమాకు హిందీలో పాజిటివ్ రెస్పాన్స్, రివ్యూలు వచ్చాయి. ఏప్రిల్ 18న ఈ మూవీ విడుదలైంది. ఓపెనింగ్ మోస్తరుగా వచ్చినా స్ట్రాంగ్ మౌత్ టాక్ ఉండటంతో బాక్సాఫీస్ వద్ద బాగా పర్ఫార్మ్ చేస్తోంది. ఇంకా థియేట్రికల్ రన్ సాగుతోంది. ఈ చిత్రం ఇప్పటి వరకు హిందీలో సుమారు రూ.140కోట్ల కలెక్షన్లను సాధించింది. ఈ మూవీ దాదాపు రూ.150కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. ఫుల్ రన్‍లో ప్రాఫిట్ జోన్‍లోకి అడుగుపెట్టే ఛాన్స్ ఉంది.
కలెక్షన్లు మోస్తరుగానే ఉన్నా కేసరి చాప్టర్ 2 మూవీపై ప్రశంసలు మాత్రం భారీగా వస్తున్నాయి. భారతదేశ చరిత్రలో చాలా మందికి తెలియని ఓ విషయాన్ని హార్డ్ హిట్టింగ్‍గా ఈ చిత్రం చూపించిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. హిస్టారికల్ చిత్రమే అయినా గ్రిప్పింగ్‍గా ఉందనే కామెంట్లు వచ్చాయి. నటీనటుల పర్ఫార్మెన్స్ అద్భుతమనే మాటలు వినిపించాయి. మరి తెలుగు డబ్బింగ్ రిలీజ్‍లో ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఈ సినిమాకు కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించారు.
జలియన్ వాలాబాగ్ మారణ హోమం దురాగతానికి పాల్పడిన బ్రిటీషర్లపై న్యాయపోరాటం చేసిన శంకర్ నాయర్ నిజజీవిత ఘటనలతో ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రంలో నాయర్ పాత్ర పోషించారు అక్షయ్ కుమార్. బ్రిటీషర్ల తరఫు న్యాయవాదిగా ఆర్ మాధవన్ నటించారు. ఈ కోర్ట్ రూమ్ డ్రామా చిత్రం ఆసక్తికరంగా సాగుతుంది.
కేసరి చాప్టర్ 2 సినిమాలో అక్షయ్, మాధవన్‍తో పాటు అన్యన్య పాండే, రెజీనా కసాండ్రా, సైమన్ పైస్లే డే, అమిత్ సియాల్, అలెక్స్ ఓనీల్, మార్క్ బెనింగ్‍టన్, స్టీవెన్ హార్ట్లీ కీరోల్స్ చేశారు. ఈ మూవీని కరణ్ జోహాల్, అపూర్వ మెహతా, అదర్ పూనావాలా, ఆనంద్ తివారి, హిరూ యశ్ జోహార్, అరుణ్ భాటియా, అమృత్ సింగ్ బింద్రా సంయుక్తంగా నిర్మించారు. శశ్వంత్ సచ్‍దేవ్, కవిత సేత్ - కనిష్క సేత్ మ్యూజిక్ ఇచ్చారు. దేవోజిత్ రే సినిమాటోగ్రఫీ చేశారు.
సంబంధిత కథనం