Akshay Kumar on Richa Chadha's Galwan tweet: బాధగా ఉంది.. రిచా గల్వాన్‌ ట్వీట్‌పై అక్షయ్‌-akshay kumar on richa chadhas galwan tweet says it hurts him see this ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Akshay Kumar On Richa Chadhas Galwan Tweet Says It Hurts Him See This

Akshay Kumar on Richa Chadha's Galwan tweet: బాధగా ఉంది.. రిచా గల్వాన్‌ ట్వీట్‌పై అక్షయ్‌

HT Telugu Desk HT Telugu
Nov 24, 2022 06:35 PM IST

Akshay Kumar on Richa Chadha's Galwan tweet: బాధగా ఉంది అంటూ రిచా చద్దా గల్వాన్‌ ట్వీట్‌పై అక్షయ్‌ కుమార్‌ ట్వీట్‌ చేశాడు. గల్వాన్‌ హాయ్‌ చెబుతోందంటూ రిచా చేసిన ట్వీట్‌ పెను దుమారం రేపిన విషయం తెలిసిందే.

అక్షయ్ కుమార్
అక్షయ్ కుమార్ (AFP)

Akshay Kumar on Richa Chadha's Galwan tweet: గల్వాన్‌ పేరు వినగానే ప్రతి భారతీయుని మనసు చివుక్కుమంటుంది. రెండేళ్ల కిందట ఇక్కడే చైనా సైనికులతో పోరాడి మన సైనికులు ఎంతో మంది ప్రాణాలు విడిచారు. అలాంటి గల్వాన్‌ ఘటనను తక్కువ చేసి చూపుతూ బాలీవుడ్‌ నటి రిచా చద్దా.. గల్వాన్‌ మీకు హాయ్‌ చెబుతోందంటూ లెఫ్ట్‌నెంట్ జనరల్‌ ఉపేంద్ర ద్వివేదిని ఉద్దేశించి ట్వీట్‌ చేసింది.

మన సైనికులు అమరులైన చోట నిల్చొని ఇలాంటి ట్వీట్‌ చేయడమేంటని ఆమెపై ఎంతో మంది మండి పడ్డారు. తాజాగా బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ కూడా దీనిపై స్పందించాడు. ఇది తనను ఎంతగానో బాధించిందని చెప్పాడు. "ఇది చూస్తుంటే బాధగా ఉంది. మన సాయుధ దళాలపై ఎప్పుడూ ఏదీ మనల్ని కృతజ్ఞత లేనివాళ్లుగా మార్చకూడదు. వాళ్లు ఉంటే మనం ఉన్నాం" అని అక్షయ్‌ ట్వీట్ చేశాడు.

రిచా ట్వీట్‌ వెనుక అసలేం జరిగింది?

అసలు రిచా చద్దా ఇలాంటి ట్వీట్‌ ఎందుకు చేసింది? దీని వెనుక ఉన్న స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాం. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకొని కశ్మీర్‌ సమస్య పరిష్కరిస్తామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చేసిన ప్రకటనపై నార్తర్న్‌ ఆర్మీ కమాండర్‌ లెఫ్ట్‌నెంట్ జనరల్‌ ఉపేంద్ర ద్వివేదీ స్పందించారు. దీనిపై ఒక ప్రకటన చేశారు.

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం ఏం చెబితే అది చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఈ కామెంట్స్‌ను ఉద్దేశించి బాలీవుడ్‌ నటి రిచా చద్దా ట్వీట్‌ చేసింది. గల్వాన్‌ ఘటనను గుర్తు చేస్తున్నట్లుగా ఆయన చేసిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ గల్వాన్‌ మీకు హాయ్‌ చెబుతోంది అని కామెంట్‌ చేసింది.

ఈ ట్వీట్‌ ఎంతో దుమారం రేపింది. సోషల్‌ మీడియాలో రిచాను టార్గెట్‌ చేస్తూ ఎంతో మంది ట్వీట్లు చేశారు. ఆమెపై పోలీసులు కేసు నమోదు చేయాలని బీజేపీ నేత మజీందర్‌ సింగ్‌ సిర్సా డిమాండ్‌ చేశారు. దీనిపై గురువారం రిచా క్షమాపణ కూడా చెప్పింది. తన ఉద్దేశం అది కాదంటూ మరో ట్వీట్‌ చేసింది.

IPL_Entry_Point

టాపిక్