Kannappa: కన్నప్ప సినిమాను రెండు సార్లు తిరస్కరించాను.. శివుడి పాత్ర చేసిన స్టార్ హీరో అక్షయ్ కుమార్ కామెంట్స్-akshay kumar about rejecting kannappa offer for twice who played lord shiva role in manchu vishnu movie at teaser launch ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kannappa: కన్నప్ప సినిమాను రెండు సార్లు తిరస్కరించాను.. శివుడి పాత్ర చేసిన స్టార్ హీరో అక్షయ్ కుమార్ కామెంట్స్

Kannappa: కన్నప్ప సినిమాను రెండు సార్లు తిరస్కరించాను.. శివుడి పాత్ర చేసిన స్టార్ హీరో అక్షయ్ కుమార్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

Akshay Kumar About Rejecting Kannappa Movie Offer: మంచు విష్ణు కెరీర్‌లో ప్రతిష్టాత్మక చిత్రంగా వస్తున్న పాన్ ఇండియా మూవీ కన్నప్ప. ఈ మూవీలో శివుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించారు. అయితే, కన్నప్ప సినిమా ఆఫర్‌ను తాను రెండు సార్లు తిరస్కరించినట్లు అక్షయ్ కుమార్ కామెంట్స్ చేశాడు.

కన్నప్ప సినిమాను రెండు సార్లు తిరస్కరించాను.. శివుడి పాత్ర చేసిన స్టార్ హీరో అక్షయ్ కుమార్ కామెంట్స్

Akshay Kumar About Rejecting Kannappa Movie Offer: మంచు విష్ణు కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక వస్తున్న పాన్ ఇండియా మూవీ కన్నప్ప. బాలీవుడ్ డైరెక్ట్ ముకేష్ కుమార్ సింగ్ కన్నప్ప మూవీకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా తెలుగులో పరిచయం కానుంది.

కన్నప్పలో అగ్ర నటీనటులు

అలాగే, కన్నప్ప సినిమాలో భారీ తారాగాణం నటిస్తోంది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, మధుబాల, శివరాజ్ కుమార్, ఆర్ శరత్ కుమార్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ వంటి స్టార్ క్యాస్ట్ కన్నప్ప మూవీలో కనిపించి కనువిందు చేయనున్నారు. ప్రమోషనల్ ఈవెంట్స్‌తో కన్నప్ప సినిమాకు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు మేకర్స్.

కన్నప్ప టీజర్ రిలీజ్ లాంచ్

ఈ క్రమంలోనే తాజాగా కన్నప్ప టీజర్‌ను రిలీజ్ చేశారు. ముంబైలో జరిగిన ప్రత్యేక మీడియా ఈవెంట్‌లో ‘కన్నప్ప’ టీజర్‌ను ఆవిష్కరించారు. బాలీవుడ్ సూపర్ స్టార్, యాక్షన్ హీరో అక్షయ్ కుమార్, నటుడు, నిర్మాత విష్ణు మంచు, దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ కార్యక్రమంలో సందడి చేశారు. అక్షయ్ కుమార్, మంచు విష్ణు చేతుల మీదుగా కన్నప్ప టీజర్ రిలీజ్ అయింది.

కన్నప్ప టీజర్‌పై మీడియా ప్రశంసలు

సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీ వినయ్ మహేశ్వరి ఆధ్వర్యంలో కన్నప్ప టీజర్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రత్యేకంగా ప్రదర్శించిన ఈ కన్నప్ప టీజర్ అందరినీ ఆకట్టుకుంది. అక్కడి మీడియా ప్రతినిధులు కన్నప్ప టీజర్ మీద ప్రశంసలు కురిపించారు. డా. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం విజువల్ వండర్‌గా ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్‌గా ఆడియెన్స్ ముందుకు రాబోతోంది.

శివుడిగా నేను బాగుంటాను

ఈ సందర్భంగా శివుడి పాత్రలో నటించిన అక్షయ్ కుమార్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. "మొదటగా కన్నప్ప ఆఫర్ నా వద్దకు వచ్చినప్పుడు రెండు సార్లు తిరస్కరించాను. కానీ, భారతీయ సినిమా ప్రపంచంలో శివుడిగా నేను బాగుంటాను అని విష్ణు పెట్టుకున్న నమ్మకమే నన్ను ఈ సినిమా ఒప్పుకునేలా చేసింది" అని తెలిపాడు.

గౌరవంగా భావిస్తున్నాను

"కన్నప్ప కథ చాలా శక్తివంతమైంది. ఎంతో లోతైన ఎమోషన్స్ ఉంటాయి. విజువల్ వండర్‌గా ఉండబోతోంది. ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైనందుకు నేను గౌరవంగా భావిస్తున్నాను" అని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ చెప్పుకొచ్చారు.

ఎంత చెప్పినా తక్కువే

దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. "అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్ వంటి దిగ్గజాలను డైరెక్ట్ చేయడం అద్భుతమైన అనుభవం. వారందరూ చాలా సహకరించారు. వారి పాత్రలు తెరపై అద్భుతం చేయబోతోన్నాయి. ఈ చిత్రం పట్ల విష్ణుకున్న ప్యాషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ అద్భుతమైన కథ ప్రతిఒక్కరి వద్దకు చేరేలా చూసేందుకు మేము కృషి చేస్తున్నాము" అని అన్నారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం