విలాసవంతమైన ఫ్లాట్ కొనుగోలు చేసిన అక్షర హాసన్
ముంబైలోని ఖర్ ప్రాంతంలో కమల్‌హాసన్ చిన్న కూతురు అక్షర హాసన్ విలాసవంతమైన అపార్ట్‌మెంట్ కొనుగోలు చేశారు.
ముంబై: కమల్ హాసన్ కుమార్తె, నటి అక్షర హాసన్ ముంబై పశ్చిమ శివారులోని ఖర్ ప్రాంతంలో ఒక లగ్జరీ ప్రాజెక్ట్‌లో 2,354 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను రూ. 15.75 కోట్లకు కొనుగోలు చేసినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
ఖర్‌లోని 16వ నెంబరు రోడ్డులో గల 15-అంతస్తుల లగ్జరీ టవర్ ఏక్తా వెర్వ్‌లోని 13వ అంతస్తులో ఈ అపార్ట్‌మెంట్ ఉంది. 2,245 చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియా, అటాచ్డ్ బాల్కనీ కలిగి ఉంది. రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం ఈ ఫ్లాట్‌కు మూడు కార్ పార్కింగ్ స్థలాలు ఉన్నాయి.
ఆస్తి అమ్మకానికి సంబంధించిన ఒప్పందంపై బాంద్రా దంపతులు, 33 ఏళ్ల నటి మధ్య సంతకాలు పూర్తయ్యాయి. ఈ ఒప్పందానికి సెప్టెంబర్ 27 న రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఆమె రూ. 94.50 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించింది.
అక్షర హాసన్ నటులు కమల్ హాసన్, సారిక ఠాకూర్ యొక్క చిన్న కుమార్తె. శృతి హాసన్ చెల్లెలు. ఆమె కొన్ని హిందీ, తమిళ చిత్రాలలో నటించింది. 2015లో షమితాబ్ అనే కామెడీతో ఆమె రంగప్రవేశం చేసింది.
ఏక్తా వెర్వ్ అనేది 3బీహెచ్‌కే, 4బీహెచ్‌కే, 5 బీహెచ్‌కే ఫ్లాట్లను కలిగి ఉన్న ఏక్తా వరల్డ్ గ్రూప్ బోటిక్ లగ్జరీ ప్రాజెక్ట్. మహారాష్ట్ర రెరా పోర్టల్ ప్రకారం 15 అంతస్తుల ఈ టవర్‌లో 18 ఫ్లాట్లు ఉన్నాయి. ఎక్కువగా 5బీహెచ్‌కే డ్యూప్లెక్స్ ఫ్లాట్లు ఉన్నాయి.