Agent TV Premiere: ఏజెంట్ సినిమా టీవీ ప్రీమియర్ డేట్ ఫిక్స్.. కానీ!-akkineni akhil agent movie to telecast in hindi before its ott release streaming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Agent Tv Premiere: ఏజెంట్ సినిమా టీవీ ప్రీమియర్ డేట్ ఫిక్స్.. కానీ!

Agent TV Premiere: ఏజెంట్ సినిమా టీవీ ప్రీమియర్ డేట్ ఫిక్స్.. కానీ!

Agent TV Premiere: అఖిల్ సినిమా ఓటీటీలోకి రాక ముందే టీవీలో ప్రసారమయ్యేందుకు రెడీ అయింది. హిందీ వెర్షన్ టెలికాస్ట్ అయ్యేందుకు రెడీ అయింది. ప్రీమియర్ డేట్, టైమ్ వెల్లడయ్యాయి.

Agent TV Premiere: ఏజెంట్ సినిమా టీవీ ప్రీమియర్ డేట్ ఫిక్స్.. కానీ!

ఏజెంట్ సినిమా ఓటీటీ విషయంలో రకరకాల ట్విస్టులు ఎదురవుతూనే ఉన్నాయి. థియేటర్లలో డిజాస్టర్ అయిన ఈ చిత్రం ఓటీటీ విషయంలో చాలా కాలంగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. అయినా.. ఇప్పటి వరకు ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రాలేదు. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 2023 ఏప్రిల్ 28న థియేటర్లలో రిలీజ్ అయింది. ఏడాది దాటిపోయినా ఇప్పటికీ ఓటీటీలోకి రాలేదు. అయితే, ఒరిజినల్ తెలుగు వెర్షన్ కంటే ముందు ఇప్పుడు ఏజెంట్ హిందీ వెర్షన్ టీవీ ఛానెల్‍లో ప్రసారం కానుంది.

హిందీ టెలికాస్ట్ ఎప్పుడంటే..

ఏజెంట్ సినిమా హిందీ వెర్షన్ గోల్డ్‌మైన్స్ టీవీ ఛానెల్‍లో ప్రసారం కానుంది. జూలై 28వ తేదీన రాత్రి 8 గంటలకు ఈ మూవీ హిందీలో ప్రసారం కానుంది. ఈ విషయంపై నేడు (జూలై 15) అధికార ప్రకటన వచ్చింది. తెలుగు కంటే ముందే ఈ చిత్రం హిందీలో టెలికాస్ట్ అవుతోంది. కానీ ఇప్పటి వరకు తెలుగు వెర్షన్‍పై క్లారిటీనే రాలేదు.

ఓటీటీలోకి ఈనెలైనా!

ఏజెంట్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. గతేడాది సెప్టెంబర్‌లో స్ట్రీమింగ్ అంటూ డేట్ కూడా వెల్లడించింది. అయితే, స్ట్రీమింగ్‍కు రాలేదు. సోనీ లివ్ ఆలస్యం చేసింది. ఆ తర్వాత కూడా చాలాసార్లు త్వరలో స్ట్రీమింగ్ అంటూ ఊరిస్తూ వచ్చింది. అయినా ఇప్పటి వరకు ఈ చిత్రం ఓటీటీలోకి రాలేదు. అయితే, ఇటీవలే సడన్‍గా ఏజెంట్ గురించి ఇప్పటి వరకు తమ సోషల్ మీడియా అకౌంట్లలో చేసిన పోస్టులను సోనీ లివ్ డిలీట్ చేసింది.

ఈనెలలో ఏజెంట్ సినిమా స్ట్రీమింగ్‍కు వస్తుందని రూమర్లు రాగా.. సోషల్ మీడియాలో పోస్టులు తొలగించి ట్విస్ట్ ఇచ్చింది సోనీ లివ్. దీంతో ఈ చిత్రం ఈ ఓటీటీలోనే వస్తుందా.. ప్లాట్‍ఫామ్ మారుతుందా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. మరి ఈనెలలో అయినా ఏజెంట్ చిత్రం ఓటీటీలోకి వస్తుందా.. ఇంకా ఆలస్యం కొనసాగుతుందా అనేది చూడాలి.

మొత్తంగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీ థియేటర్లలో అల్ట్రా డిజాస్టర్ అయినా.. ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అనేది మాత్రం చాలా కాలంగా హాట్‍టాపిక్‍గానే ఉంది. ఇప్పుడు తెలుగులో కాకుండా హిందీ వెర్షన్ టీవీ ప్రీమియర్‌కు వస్తుండటం మరో ట్విస్టుగా ఉంది.

ఏజెంట్ చిత్రం రిలీజ్‍కు ముందు మంచి హైప్ తెచ్చుకుంది. ట్రైలర్ కూడా ఆకట్టుకోవటంతో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, థియేటర్లలోకి వచ్చాక పూర్తిగా నెగెటివ్ టాక్ వచ్చింది. ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. రూ.85కోట్ల భారీ బడ్జెట్‍తో ఈ చిత్రం తెరకెక్కింది. అయితే, కనీసం రూ.8కోట్ల కలెక్షన్లను కూడా రాబట్టలేకపోయింది. ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఘోరంగా ప్లాఫ్ అవటంపై నిర్మాతలు కూడా స్పందించారు. సరైన కథ లేకుండానే షూటింగ్‍కు వెళ్లడం పెద్ద తప్పు అయిందనేలా మాట్లాడారు. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, రాంబ్రహ్మం సుంకర నిర్మించారు. ఏజెంట్ చిత్రంలో అఖిల్‍కు జోడీగా సాక్షి వైద్య హీరోయిన్‍గా నటించగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, డినో మోరియా, విక్రమ్ జీత్ విర్క్, డెంజిలన్ స్మిత్, మురళీ శర్మ, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలు చేశారు.