Nagarjuna - Akhil Multistarrer: నాగార్జున‌, అఖిల్ మ‌ల్టీస్టార‌ర్ డౌటేనా? - తండ్రితో మూవీపై అఖిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్-akhil interesting comments on multi starrer movie with father nagarjuna ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Akhil Interesting Comments On Multi Starrer Movie With Father Nagarjuna

Nagarjuna - Akhil Multistarrer: నాగార్జున‌, అఖిల్ మ‌ల్టీస్టార‌ర్ డౌటేనా? - తండ్రితో మూవీపై అఖిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

నాగార్జున‌, అఖిల్
నాగార్జున‌, అఖిల్

Nagarjuna - Akhil Multistarrer: తండ్రి నాగార్జున‌తో క‌లిసి అఖిల్ ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ చేయ‌బోతున్న‌ట్లు టాలీవుడ్‌లో చాలా రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ మ‌ల్లీస్టార‌ర్ మూవీపై ఏజెంట్ ప్ర‌మోష‌న్స్‌లో అఖిల్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు

Nagarjuna - Akhil Multistarrer: అక్కినేని ఫ్యామిలీ హీరోల మ‌ల్టీస్టార‌ర్స్‌పై అభిమానుల్లో ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. త‌న ఇద్ద‌రి వార‌సుల్లో నాగ‌చైత‌న్య‌తోనే నాగార్జున రెండు సినిమాలు చేశాడు. అఖిల్ హీరోగా మారిన త‌ర్వాత‌ మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు అత‌డితో సినిమా చేయ‌లేదు.

ట్రెండింగ్ వార్తలు

మ‌నం సినిమాలో అఖిల్ గెస్ట్ పాత్ర‌లో న‌టించాడు. కానీ ఫుల్ లెంగ్త్‌లో నాగార్జున, అఖిల్ మూవీ కోసం అక్కినేని ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తోన్నారు. ది ఘోస్ట్ ప్ర‌మోష‌న్స్‌లో త‌న వందో సినిమాను అఖిల్‌తో చేయ‌బోతున్న‌ట్లు నాగార్జున అనౌన్స్‌చేశాడు. ఈ మ‌ల్టీస్టార‌ర్ సినిమాకు గాడ్‌ఫాద‌ర్ ఫేమ్ మోహ‌న్‌రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

ఫాద‌ర్‌తో మ‌ల్టీస్టార‌ర్ మూవీ పై ఏజెంట్ ప్ర‌మోష‌న్స్‌లో అఖిల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఈ సినిమాకు సంబంధించి ఇంకా స్క్రిప్ట్ ఫైన‌లైజ్ కాలేద‌ని తెలిపాడు. స్క్రిప్ట్ ఒకే అయినా త‌ర్వాతే ఈ మ‌ల్టీస్టార‌ర్ సినిమాను అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేస్తామ‌ని అఖిల్ పేర్కొన్నాడు.

"నాన్న‌గారితో సినిమా అంటే ఎప్ప‌టికీ గుర్తుండిపోయేలా ఉండాల‌న్న‌దే నా కోరిక‌. నాన్న కూడా ఆదే ఆలోచ‌న‌లో ఉన్నాడు. అందుకే స్క్రిప్ట్ విష‌యంలో కాంప్ర‌మైజ్ కాకూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నాం" అని అఖిల్ పేర్కొన్నాడు. అఖిల్ చేసిన ఈ కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి.

అఖిల్ హీరోగా న‌టించిన ఏజెంట్ మూవీ ఏప్రిల్ 28న రిలీజ్ కాబోతున్న‌ది. ఏప్రిల్ 23న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వ‌రంగ‌ల్‌లో జ‌రుగ‌నుంది. త‌నయుడి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నాగార్జున ముఖ్య అతిథిగా హాజ‌రుకానున్నాడు.

ఏజెంట్ మూవీలో మ‌ల‌యాళ స్టార్ హీరో మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌ను పోషిస్తోన్నారు. సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టిస్తోంది. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.