అఖిల్ అక్కినేని పెళ్లి ఫొటోలు షేర్ చేసిన నాగార్జున.. అంతులేని ఆనందంలో అమల-akhil akkineni zainab ravdjee wedding photos shared by akkineni nagarjuna amala looks happy ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  అఖిల్ అక్కినేని పెళ్లి ఫొటోలు షేర్ చేసిన నాగార్జున.. అంతులేని ఆనందంలో అమల

అఖిల్ అక్కినేని పెళ్లి ఫొటోలు షేర్ చేసిన నాగార్జున.. అంతులేని ఆనందంలో అమల

Hari Prasad S HT Telugu

అఖిల్ అక్కినేని, జైనాబ్ పెళ్లి ఫొటోలను నాగార్జున షేర్ చేశాడు. శుక్రవారం (జూన్ 6) వీళ్లు పెళ్లి చేసుకోగా.. సాయంత్రం నాగ్ తన ఎక్స్ అకౌంట్లో ఆ ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు. వీటిలో అమల అక్కినేని అంతులేని ఆనందంలో కనిపించింది.

అఖిల్ అక్కినేని పెళ్లి ఫొటోలు షేర్ చేసిన నాగార్జున.. అంతులేని ఆనందంలో అమల

అక్కినేని నాగార్జున తన చిన్న కొడుకు అఖిల్ అక్కినేని, ఆర్టిస్ట్-వ్యాపారవేత్త జైనాబ్ రవ్‌జీల పెళ్లి ఫొటోలను షేర్ చేశాడు. శుక్రవారం (జూన్ 6) హైదరాబాద్‌లో వీళ్ల పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. తన చిన్న కొడుకు జీవిత భాగస్వామిని పొందడం ‘కల నిజమైన క్షణం’గా నాగార్జున అభిర్ణించారు. ఈ ఫొటోల్లో నాగ్ ఫ్యామిలీ చాలా క్యూట్ గా కనిపిస్తోంది.

అఖిల్, జైనాబ్ పెళ్లి ఫొటోలు

అఖిల్, జైనాబ్‌ల పెళ్లి ఫొటోలను నాగార్జున తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) అకౌంట్లో షేర్ చేశాడు. శుక్రవారం తెల్లవారుజామున 3:35 గంటలకు హైదరాబాద్‌లోని తమ నివాసంలో ఈ వివాహం జరిగినట్లు తెలిపాడు. ఈ ఫొటోలను పోస్ట్ చేస్తూ, నాగార్జున ఇలా రాశాడు..

“అపారమైన ఆనందంతో, మా ప్రియమైన కుమారుడు తన ప్రియమైన జైనాబ్‌ను మా ఇంట్లో (తెల్లవారుజామున 3:35 గంటలకు) అందమైన వేడుకలో పెళ్లి చేసుకున్నాడని తెలియజేయడానికి అమల, నేను సంతోషిస్తున్నాము. ప్రేమ, నవ్వులు, మాకు అత్యంత ప్రియమైన వారి మధ్య ఒక కల నిజమవడం చూశాం” అని నాగ్ అన్నాడు.

అమల ఆనందంతో..

నాగార్జున ఇంకా ఇలా అన్నాడు. “ఈ కొత్త ప్రయాణాన్ని కలిసి ప్రారంభించే వారికి మీ ఆశీస్సులు కోరుతున్నాము. ప్రేమతో, కృతజ్ఞతలతో. @AkhilAkkineni8 #InfiniteLove #Blessings #NewBeginnings”. వీటిలో ఒక ఫొటోలో అమల.. జైనాబ్, అఖిల్‌లను గట్టిగా పట్టుకొని ఆనందంగా కనిపించడం చూడొచ్చు. కుటుంబం అంతా ఫోటోలకు పోజులిచ్చారు.

మరొక ఫొటోలో అఖిల్, జైనాబ్ మెడలో మంగళసూత్రం కట్టడం చూడొచ్చు. ఆ వెనుక అతని వదిన శోభిత ధూళిపాళ (నాగ చైతన్య భార్య) ఉంది. అఖిల్, జైనాబ్‌ ఏడు అడుగులు వేస్తున్న ఫొటోలను, అలాగే నాగార్జున, అమల పూజ చేస్తున్నప్పుడు నవ్వుతూ ఉన్న ఫొటోలను కూడా నాగార్జున పోస్ట్ చేశాడు. అఖిల్, జైనాబ్‌ ఇద్దరూ లేత తెలుపు రంగు దుస్తులు ధరించి సంప్రదాయ తెలుగు సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు.

నిరాడంబరంగా పెళ్లి

అఖిల్, జైనాబ్‌ కొంతకాలం ప్రేమించుకున్న తర్వాత గత సంవత్సరం నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్థం తర్వాత, అఖిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా పోస్ట్ చేశాడు.. “నా జీవిత భాగస్వామి దొరికింది. జైనాబ్ తో నా నిశ్చితార్థం జరిగిందని సంతోషంగా తెలియజేస్తున్నాను” అని అఖిల్ అన్నాడు. జైనాబ్ హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త జుల్ఫీ రవ్‌జీ కుమార్తె. జుల్ఫీ రవ్‌జీ నిర్మాణ రంగంలో ఉన్నారు. ఈ వివాహానికి చిరంజీవి, రామ్ చరణ్, ప్రశాంత్ నీల్ వంటి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.