CCL 2025 Akhil Akkineni: ఐదోసారి సీసీఎల్ టైటిల్ కొడతాం.. తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని కామెంట్స్-akhil akkineni comments on 5th time winning ccl in telugu warriors team jersey launch celebrity cricket league 2025 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ccl 2025 Akhil Akkineni: ఐదోసారి సీసీఎల్ టైటిల్ కొడతాం.. తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని కామెంట్స్

CCL 2025 Akhil Akkineni: ఐదోసారి సీసీఎల్ టైటిల్ కొడతాం.. తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Feb 03, 2025 06:13 AM IST

Akhil Akkineni About CCL Title For 5Th Time: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)లో ఐదోసారి టైటిల్ కొడతామనే నమ్మకం ఉందని తెలుగు వారియర్స్ కెప్టెన్, హీరో అఖిల్ అక్కినేని ఆశాభావం వ్యక్తం చేశాడు. తాజాగా తెలుగు వారియర్స్ జెర్సీ లాంచ్ కార్యక్రమంలో అఖిల్ అక్కినేని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఐదోసారి సీసీఎల్ టైటిల్ కొడతాం.. తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని కామెంట్స్
ఐదోసారి సీసీఎల్ టైటిల్ కొడతాం.. తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని కామెంట్స్

Akhil Akkineni About CCL Title For 5Th Time: సీసీఎల్ 11వ సీజన్, తెలుగు వారియర్స్ థ్రిల్లింగ్ గేమ్ షెడ్యూల్‌ను ప్రకటించింది. సెలబ్రీటీ క్రికెట్ లీగ్ (CCL) ఫిబ్రవరి 8న బెంగళూరులో 11వ సీజన్‌ను ప్రారంభం కానుంది. ఇది మైదానంలో మరపురాని క్షణాలను అందిస్తోంది.

yearly horoscope entry point

తెలుగు వారియర్స్ సీసీఎల్ జెర్సీ లాంచ్

ఈ సీజన్‌లో నాలుగుసార్లు ఛాంపియన్‌లుగా తమ లెగసీని కంటిన్యూ చేయడానికి వారి ప్రతిష్టాత్మకమైన 5వ టైటిల్ గెలుపు కోసం సిద్ధమవుతున్న బలమైన జట్టు తెలుగు వారియర్స్‌పై అందరి దృష్టి ఉంది. ఈ సందర్భంగా తెలుగు వారియర్స్ జెర్సీ లాంచ్ ప్రెస్ మీట్ ఫిబ్రవరి 2న నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరో అక్కినేని అఖిల్, ఎస్ఎస్ తమన్, సచిన్ జోషి, హీరో అశ్విన్ బాబు, సామ్రాట్ తదితరులు పాల్గొన్నారు.

ఐదోసారి కూడా ఛాంపియన్‌గా

తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. సిసిఎల్ 14 ఏళ్ల జర్నీ. గ్లింప్స్‌లో చూస్తే ఓ చోట మరీ చిన్నపిల్లాడిలా కనిపించాను. సీసీఎల్ ఆడుతూ పెరిగాను. విష్ణు, సచిన్ పాషన్‌తో ఇది సాధ్యపడిందని భావిస్తున్నాను. మేము నాలుగు సార్లు టైటిల్ గెలిచాం. ఈసారి కూడా టైటిల్ కొట్టి ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలుస్తామనే నమ్మకం ఉంది" అని అన్నాడు.

ఉప్పల్ స్టేడియంలో ఆడుతున్నాం

"అన్నిటికంటే అందరినీ ఎంటర్‌టైన్ చేయాలనే పాషన్‌తో వస్తున్నాం. ఫిబ్రవరి 14, 15 ఉప్పల్ స్టేడియంలో ఆడుతున్నాం. అందరూ వచ్చి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము" అని హీరో, తెలుగు వారియర్స్ కెప్టెన్ అక్కినేని అఖిల్ చెప్పుకొచ్చాడు.

క్రికెట్ ఆడటం ఓ అదృష్టం

ఎస్ఎస్ తమన్ మాట్లాడుతూ.. "క్రికెట్ అనేది నా చైల్డ్ వుడ్ డ్రీం. సీసీఎల్ ఫార్మెట్ నా డ్రీంని తీర్చింది. దేశంలోని ప్రముఖ మైదానాల్లో క్రికెట్ ఆడటం ఓ అదృష్టం. అఖిల్ అగ్రెసివ్ కెప్టెన్. తన ఎత్తుగడలు అద్భుతంగా ఉంటాయి. తనలో చాలా ఫైర్ ఉంది. క్రికెట్ మాకు చాలా ఎనర్జీ ఇస్తోంది. మాది చాలా క్రేజీ టీం" అని చెప్పాడు.

తప్పకుండా కప్ కొడతాం

"సచిన్ టీంకి ఓనర్‌తో పాటు ఆటగాడిగా బిగ్గెస్ట్ స్ట్రెంత్. మూడు నెలలుగా చాలా ప్రాక్టీస్ చేశాం. ఈసారి తప్పకుండా కప్ కొడతాం. విష్ణు చాలా పాషన్‌తో సీజన్స్‌ని ముందుకు తీసుకుతీసుకెళ్తున్నారు. అందరికీ థాంక్ యూ సో మచ్" అని మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ చెప్పుకొచ్చాడు.

విష్ణుకే క్రెడిట్ ఇస్తాను

సచిన్ జోషి మాట్లాడుతూ.. "ఇండియాలో అందరి డ్రీం క్రికెట్. ఆ డ్రీం మాకు సీసీఎల్ రూపంలో తీరింది. ఈ క్రెడిట్ విష్ణుకి ఇస్తాను. తన ఆలోచన గొప్ప విజయం సాధించింది. వెంకటేష్ గారికి థాంక్ యూ. ఆయన సపోర్ట్‌ని మర్చిపోలేను. మా టీం అంతా నా ఫ్యామిలీ. అన్ని సమయంలో చాలా సపోర్ట్ చేశారు. అఖిల్ పాషనేట్ క్రికెటర్. వండర్ ఫుల్ పర్సన్. తమన్ టీంలో స్పిరిట్‌ని తీసుకొస్తుంటారు. మా స్పాన్సర్స్ అందరికీ థాంక్ యూ" అని చెప్పారు.

Whats_app_banner

సంబంధిత కథనం