Tollywood Movie: బాక్సాఫీస్ వద్ద అల్ట్రా డిజాస్టర్.. 21 నెలలైనా ఇంకా ఓటీటీలోకి రాని తెలుగు చిత్రం-akhil akkineni box office disaster movie agent not yet released on any ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tollywood Movie: బాక్సాఫీస్ వద్ద అల్ట్రా డిజాస్టర్.. 21 నెలలైనా ఇంకా ఓటీటీలోకి రాని తెలుగు చిత్రం

Tollywood Movie: బాక్సాఫీస్ వద్ద అల్ట్రా డిజాస్టర్.. 21 నెలలైనా ఇంకా ఓటీటీలోకి రాని తెలుగు చిత్రం

Chatakonda Krishna Prakash HT Telugu
Published Feb 08, 2025 03:38 PM IST

Tollywood Movie: బడ్జెట్‍లో 10 శాతం కూడా రికవరీ చేయలేదు ఓ భారీ తెలుగు చిత్రం. విపరీతమైన అంచనాలతో వచ్చి భారీగా బోల్తా కొట్టింది. సుమారు 21 నెలలు దాటినా ఆ చిత్రం ఇంకా ఓటీటీలోకి కూడా స్ట్రీమింగ్‍కు రాలేదు. ఆ వివరాలు ఇవే..

Tollywood Movie: బాక్సాఫీస్ వద్ద అల్ట్రా డిజాస్టర్.. 21 నెలలైనా ఇంకా ఓటీటీలోకి రాని తెలుగు చిత్రం
Tollywood Movie: బాక్సాఫీస్ వద్ద అల్ట్రా డిజాస్టర్.. 21 నెలలైనా ఇంకా ఓటీటీలోకి రాని తెలుగు చిత్రం

యంగ్ హీరో అక్కినేని అఖిల్‍కు ‘ఏజెంట్’ చిత్రం పీడకలలా మిగిలిపోయింది. తన కెరీర్లో తొలి హిట్ ఇస్తుందనుకొని కొండంత ఆశ పెట్టుకున్న ఈ మూవీ అల్ట్రా డిజాస్టర్ అయింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 ఏప్రిల్‍ 28న థియేటర్లలో రిలీజైంది. స్పై యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఏజెంట్ నెగెటివ్ టాక్‍తో భారీ ప్లాఫ్‍గా నిలిచింది. అయితే, ఈ మూవీ థియేటర్లలో విడుదలై దాదాపు 21 నెలలు గడుస్తున్నా ఓటీటీ స్ట్రీమింగ్‍కు మాత్రం ఇంకా అడుగుపెట్టలేదు. ఆ వివరాలు ఇవే..

ఇక ఓటీటీ ఆశలు లేనట్టేనా..

ఏజెంట్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ తొలుత సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‍కు తీసుకొస్తామని 2023 సెప్టెంబర్‌లోనే ఓ డేట్ చెప్పింది. కానీ స్ట్రీమింగ్‍కు రాలేదు. ఆర్థిక వివాదం కారణంగా స్ట్రీమింగ్‍కు రాలేదేమోననే రూమర్లు వచ్చాయి. అలాంటిదేమీ లేదని నిర్మాత అనిల్ సుంకర చెప్పారు. అయితే, ఆ తర్వాత కూడా ఏజెంట్ స్ట్రీమింగ్‍కు రానుందంటూ చాలాసార్లు పుకార్లు వచ్చాయి. వేరే ఓటీటీ చేతికి వెళ్లిందంటూ కూడా రూమర్లు చక్కర్లు కొట్టాయి.

ఏజెంట్ సినిమా ఓటీటీ రిలీజ్‍పై చాలా కాలంగా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. గతేడాది స్ట్రీమింగ్‍కు తెచ్చేందుకు సోనీలివ్ మరోసారి ప్రయత్నాలు చేసినట్టు టాక్. కానీ ఎందుకో మళ్లీ ఆగిపోయింది. ఈ చిత్రం థియేటర్లలో రిలీజై 21 నెలలు దాటేసింది. ఇక ఏజెంట్ మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువే. స్ట్రీమింగ్‍పై దాదాపు ఆశలు లేనట్టే చెప్పుకోవచ్చు. ఒకవేళ ఓటీటీలోకి వస్తే అది ఆశ్చర్యపోవాల్సిన విషయమే.

భారీ డిజాస్టర్‌గా..

ఏజెంట్ సినిమా సుమారు రూ.85 కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. అయితే, ఈ చిత్రానికి రూ.8కోట్ల గ్రాస్ కలెక్షను వచ్చాయని అంచనా. బడ్జెట్‍లో కనీసం 10 శాతం కూడా ఈ మూవీ రికవరీ చేయలేకపోయింది. చరిత్రలో ఒకానొక భారీ డిజాస్టర్ మూవీగా ఏజెంట్ నిలిచిపోయింది. ఈ మూవీని ఏకే ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై అనిల్ సుంకర, రాంబ్రహ్మం సుంకర ప్రొడ్యూజ్ చేశారు.

ఏజెంట్ డిజాస్టర్ తర్వాత అక్కినేని అఖిల్ బయట పెద్దగా కనిపించడం లేదు. ప్రస్తుతం ఓ మూవీ చేస్తున్నా.. దానికి సంబంధించిన వివరాలను బయటికి అధికారికంగా వెల్లడించడం లేదు. అనిల్ అనే కొత్త దర్శకుడితో ధీర అనే మూవీని అఖిల్ చేస్తున్నారని రూమర్లు వచ్చాయి.

ఏజెంట్ చిత్రంలో అఖిల్‍తో పాటు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ముఖ్యమైన పాత్ర చేశారు. సాక్షి వైద్య హీరోయిన్‍గా నటించారు. డినో మోరియా, విక్రమ్‍జీత్ విర్క్, డెంజిల్ స్మిత్, సంపత్ రాజ్, మురళీ శర్మ, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్ర చేశారు. ఈ చిత్రానికి హిప్‍హాప్ తమిళ సంగీతం అందించారు.

ఏజెంట్ మూవీలో రా ఏజెంట్ కావాలని కసితో ఉండే రాకీ అలియాజ్ వైల్డ్ సాలా క్యారెక్టర్ చేశారు అఖిల్. యాక్షన్ సీక్వెన్సుల్లో మెప్పించారు. అయితే, డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ మూవీతో తీవ్రంగా నిరాశపరిచారు. ఏ మాత్రం ఆకట్టుకునేలా తెరకెక్కించలేకపోయారు. దీంతో ప్రేక్షకుల నుంచి తిరస్కారం ఎదురైంది.

Whats_app_banner

సంబంధిత కథనం