Agent OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి అఖిల్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఏజెంట్? ఎప్పుడంటే?-akhil akkineni agent ott streaming on sony liv spy action thriller agent digital premiere ott movies agent ott release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Agent Ott: ఎట్టకేలకు ఓటీటీలోకి అఖిల్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఏజెంట్? ఎప్పుడంటే?

Agent OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి అఖిల్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఏజెంట్? ఎప్పుడంటే?

Sanjiv Kumar HT Telugu
Jul 05, 2024 02:47 PM IST

Agent OTT Streaming: ఎట్టకేలకు ఓటీటీలోకి అఖిల్ అక్కినేని స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఏజెంట్ రానుందని తెలుస్తోంది. ఇటీవల ఏజెంట్ టీవీ ప్రీమియర్ వార్త రాగానే ఏజెంట్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ విషయాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. మరి ఏజెంట్ ఓటీటీలోకి ఎప్పుడు రానుందనే వివరాల్లోకి వెళితే..

ఎట్టకేలకు ఓటీటీలోకి అఖిల్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఏజెంట్? ఎప్పుడంటే?
ఎట్టకేలకు ఓటీటీలోకి అఖిల్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఏజెంట్? ఎప్పుడంటే?

Agent OTT Release: టాలీవుడ్ కింగ్ నాగార్జున కొడుకుగా సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్ అక్కినేని. మనం సినిమాలో చిన్న కెమియో చేసి భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఈ క్రేజ్ ఆయన సినిమాలకు మాత్రం పెద్దగా వర్కౌట్ కాలేదు. అఖిల్ మూవీతో హీరోగా టాలీవుడ్‌లోకి డెబ్యూ ఇచ్చిన అఖిల్‌ అనుకున్న స్థాయిలో హిట్ కొట్టలేకపోయాడు.

హీరోగా ఎస్టాబ్లిష్ కాలేదు

ఆ తర్వాత వరుసగా చేసిన హలో, మిస్టర్ మజ్ను సినిమాలు కూడా ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ఇక బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ మూవీ మాత్రం ప్రేక్షకులను మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా విజయం సాధించింది. అయితే, హీరోగా మాత్రం అఖిల్ పూర్తిగా ఎస్టాబ్లిష్ కాలేకపోయాడు.

మాస్ ఇమేజ్ కోసం

దాంతో ఎలాగైనా మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలని తెగ కష్టపడ్టాడు. అలా అఖిల్ చేసిన సినిమా ఏజెంట్. అతనొక్కడే, కిక్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ సినిమా ఊహించిని విధంగా డిజాస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద బొక్క బొర్లా పడింది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించిన ఈ సినిమా అక్కినేని ఫ్యాన్స్‌ను తెగ నిరాశపరిచింది.

గతేడాది ఏప్రిల్‌లో రిలీజ్

ఇదిలా ఉంటే, 2023 ఏప్రిల్ 28న విడుదలైన ఏజెంట్ సినిమా ఇప్పటివరకు ఓటీటీ రిలీజ్‌కు నోచుకోలేదు. థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచిన ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ఎంతోమంది ప్రేక్షకులు, అక్కినేని అభిమానులు ఎంతగానో ఉవ్విలూరుతున్నారు. అయిప్పటికీ పలు కారణాల వల్ల ఏజెంట్ ఓటీటీ రిలీజ్ వాయిదా పడుతూనే వచ్చింది. ఇప్పుడు మరోసారి ఏజెంట్ డిజిటల్ ప్రీమియర్ టాక్ ఊపందుకుంది.

ఏజెంట్ టీవీ ప్రీమియర్

అందుకు కారణం ఏజెంట్ సినిమా బుల్లితెరపైకి రావడమే. స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా వచ్చిన ఏజెంట్ గోల్డ్‌మైన్స్ టీవీ ఛానెల్‌లో త్వరలో ప్రసారం కానుంది. అయితే, ఏజెంట్ టీవీ ప్రీమియర్ డేట్‌పై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఏజెంట్ ఓటీటీ స్ట్రీమింగ్ ఆసక్తిగా మారింది. ఏజెంట్ ఓటీటీ హక్కులను సోని లివ్ సంస్థ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

సోనీ లివ్ ఓటీటీలో

ఇప్పుడు ఇన్నాళ్లకు ఏజెంట్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోందంటూ సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ అయింది. సోనీ లివ్ ఓటీటీలో ఏజెంట్ సినిమాను జూలై మధ్య లేదా చివరి వారంలో స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం. మరి దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన గానీ క్లారిటీ కానీ రాలేదు. ఎప్పటిలాగే ఈసారి కూడా వాయిదా పడుతుందా లేదా రూమర్స్ కాదని నిజంగా ఓటీటీలోకి ఏజెంట్ వచ్చేస్తుందా అనేది మరికొన్ని రోజులు ఆగితే తేలనుంది.

లాజిక్స్ లేకుండా

ఇదిలా ఉంటే, ప్రముఖ రచయిత వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆమె సినిమాలో గ్లామర్ అండ్ సాంగ్స్‌కు తప్పా పెద్దగా ఎలాంటి రోల్ లేదని కామెంట్స్ వినిపించాయి. ఇక చాలాకాలం తర్వాత తెలుగు సినిమాలో నటించిన మమ్ముట్టి పాత్ర పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. రొటీన్ స్టోరీతో లాజిక్స్ లేకుండా సినిమాను తీశారని సినిమాపై తీవ్రమైన నెగెటివిటీ వచ్చింది.

WhatsApp channel