Thunivu OTT Release Date: తునివు ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా - నెల రోజుల్లోనే ఓటీటీలోకి అజిత్ సినిమా
Thunivu OTT Release Date: సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చిన అజిత్ తునివు బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. థియేటర్లలో భారీ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఫిబ్రవరిలోనే ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు సమాచారం.
Thunivu OTT Release Date: అజిత్ హీరోగా నటించిన తునివు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చింది విజయ్ వారిసుకు పోటీగా జనవరి 11న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను రిలీజ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం.
ట్రెండింగ్ వార్తలు
అజిత్‌కు దక్షిణాదిలో ఉన్న క్రేజ్ దృష్ట్యా భారీ ధరకు ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్నట్లు చెబుతున్నారు. కాగా ఈ సినిమా ఫిబ్రవరి 10 ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమిళంతో పాటు తెలుగు భాషల్లో ఒకే రోజు నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం.
బ్యాంకు స్కామ్‌లకు యాక్షన్ అంశాలను జోడించి దర్శకుడు హెచ్ వినోద్ తినువు సినిమాను తెరకెక్కించారు. ఓ యువకుడికి జరిగిన అన్యాయాన్ని డార్క్ డెవిల్ అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎలా పరిష్కరించాడనే పాయింట్‌తో రూపొందించారు. తునివు సినిమాలో అజిత్ క్యారెక్టరైజేషన్, అతడి యాక్టింగ్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
ఇందులో మంజు వారియర్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. తునివు సినిమా తెగింపు పేరుతో తెలుగులోకి అనువాదమైంది. టాలీవుడ్‌లో సోలో రిలీజ్ డేట్ దొరకడంతో ఫస్ట్ డే ఈ సినిమా చక్కటి కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత స్ట్రెయిట్ సినిమా జోరుతో తెగింపు వసూళ్లు తగ్గుముఖం పట్టాయి.
నేర్కొండ పరావై తర్వాత అజిత్ హెచ్ వినోద్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ఇది. తునివు సినిమాను బోనీ కపూర్ నిర్మించాడు.