Tegimpu OTT Release Date: అజిత్ తెగింపు ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఫిక్స్
Tegimpu OTT Release Date: అజిత్ తునివు సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయింది. థియేటర్లలో విడుదలై నెల రోజులు గడవకముందే అజిత్ సినిమా ఓటీటీలోకి రాబోతుంది.
Tegimpu OTT Release Date: అజిత్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ తునివు ఓటీటీలోకి రాబోతున్నది. ఈ సినిమా ఫిబ్రవరి 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా రిలీజైంది. థియేటర్లలో విడుదలై నెల రోజులు కాకముందే తునివు ఓటీటీలోకి రాబోతుండటం కోలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
ట్రెండింగ్ వార్తలు
తమిళంతో పాటు తెలుగు వెర్షన్ కూడా ఫిబ్రవరి 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. రిలీజ్‌కు ముందే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను రికార్డ్ ధరకు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం.
యాక్షన్ అంశాలకు సామాజిక సందేశాన్ని మేళవించి దర్శకుడు హెచ్ వినోద్ తునివు సినిమాను తెరకెక్కించాడు. ఇందులో డార్క్ డెవిల్ అనే ఇంటర్నేషనల్ క్రిమినల్‌గా అజిత్ నటించాడు.
అతడి క్యారెక్టరైజేషన్, యాక్టింగ్ అభిమానులను ఆకట్టుకున్నాయి. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా 150 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు భారీగా లాభాలను మిగిల్చింది. ఈ సినిమాలో అజిత్‌తో పాటుగా మంజు వారియర్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు.
తునివు కథేమిటంటే...
క్రెడిట్ కార్డులు, మ్యూచ్‌వల్ ఫండ్స్ పేరుతో ప్రజలను మోసం చేస్తూ కోట్లాది రూపాయల స్కామ్‌కు పాల్పడిన కొందరు బడా వ్యక్తులను ఓ ఇంటర్‌నేషనల్ క్రిమినల్ ఎలా చట్టానికి పట్టించాడన్నదే తునివు కథ. స్టోరీ కంటే యాక్షన్ అంశాలకే అధికంగా ప్రాముఖ్యతనిస్తూ దర్శకుడు వినోద్ ఈ సినిమాను రూపొందించారు.