Ajith Stunts: గాల్లో మూడు పల్టీలు కొట్టిన స్టార్ హీరో కారు.. వైరల్ అవుతున్న వీడియో-ajith stunts video gone viral star hero shooting for vidaamuyarchi movie tamil cinema news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ajith Stunts: గాల్లో మూడు పల్టీలు కొట్టిన స్టార్ హీరో కారు.. వైరల్ అవుతున్న వీడియో

Ajith Stunts: గాల్లో మూడు పల్టీలు కొట్టిన స్టార్ హీరో కారు.. వైరల్ అవుతున్న వీడియో

Hari Prasad S HT Telugu
Jun 26, 2024 08:28 AM IST

Ajith Stunts: తమిళ స్టార్ హీరో కారు గాల్లో మూడు పల్టీలు కొట్టింది. అజిత్ చేసిన ఈ స్టంట్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలోనూ అతడు ఇలాంటి రిస్కీ షాట్లు ఎన్నో చేశాడు.

గాల్లో మూడు పల్టీలు కొట్టిన స్టార్ హీరో కారు.. వైరల్ అవుతున్న వీడియో
గాల్లో మూడు పల్టీలు కొట్టిన స్టార్ హీరో కారు.. వైరల్ అవుతున్న వీడియో

Ajith Stunts: తమిళ స్టార్ హీరో అజిత్ తన నెక్ట్స్ మూవీ కోసం చేసిన స్టంట్స్ వీడియో మరోసారి వైరల్ అవుతోంది. గతంలోనూ విదా ముయర్చి మూవీ కోసం అజిత్ తన ప్రాణాలను పణంగా పెట్టి స్టంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా అతని కారు గాల్లో మూడు పల్టీలు కొట్టింది. అజర్‌బైజాన్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ వీడియో బయటకు వచ్చినప్పటి నుంచీ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

విదా ముయర్చి కోసం అజిత్ రిస్క్

అజిత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ విదా ముయర్చి. ఈ యాక్షన్ థ్రిల్లర్ బిహైండ్ ద సీన్స్ వీడియోను మరోసారి మేకర్స్ రిలీజ్ చేశారు. గతంలో ఏ లొకేషన్ నుంచి ఆ వీడియో వచ్చిందో తాజాగా అదే లొకేషన్ నుంచి మరో కారు స్టంట్ వీడియో వచ్చింది. తాజా వీడియోలో అజిత్ తోపాటు మరో నటుడు ఆరవ్ కూడా కారులోనే ఉన్నారు. ఆ కారును క్రేన్ సాయంతో గాల్లోకి లేపారు.

తర్వాత గాల్లోనే కొన్ని పల్టీలు కొట్టించారు. ఆ సమయంలో ఈ ఇద్దరు నటులు కార్లోనే ఉన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఇలాంటి రిస్కీ షాట్లు చేయడం చాలా ప్రమాదకరం. కానీ అజిత్ మాత్రం ఈ విదా ముయర్చి కోసం స్టంట్స్ చేస్తూనే ఉన్నాడు. మగిళ్ తిరుమణి డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో అజిత్, ఆరవ్ తోపాటు త్రిష, రెజీనా, అర్జున్ సర్జా నటిస్తున్నారు.

లైకా ప్రొడక్షన్స్ ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మిస్తోంది. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ విదా ముయర్చితోపాటు తన కొత్త సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్ కూడా అజిత్ మొదలుపెట్టాడు. ఈ సినిమాను అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు.

అజిత్ డేరింగ్ స్టంట్

నిజానికి విదా ముయర్చి మూవీ కోసం గతంలోనూ అజిత్ డూప్ లేకుండా రిస్కీ స్టంట్ చేశాడు. ఆ వీడియో కూడా బయటకు రాగా.. అది వైరల్ అయింది. కారు చేజింగ్ సీన్లో అతడు డూప్ లేకుండా నటించాడు. ఓ హైవేపై వేగంగా వెళ్తున్న కారు సీన్ అది. అయితే ఆ కారును బోల్తా కొట్టించాల్సిన ఆ సీన్లో అజిత్ చాలా డేరింగా నటించడం గమనార్హం.

ఆ కారు కాసేపటికే రోడ్డు నుంచి దిగి బోల్తా పడింది. అయితే అందులోనే చిక్కుకుపోయిన ఆ ఇద్దరూ తమను తామను నియంత్రించుకున్నారు. కారు బోల్తా పడిన వెంటనే షూటింగ్ సిబ్బంది పరుగెత్తికెళ్లి వాళ్లు ఎలా ఉన్నారో చూశారు. ఈ వీడియోలను లైకా ప్రొడక్షన్స్ షేర్ చేస్తూ.. "ధైర్యానికి హద్దులేమీ ఉండవు. విదా ముయర్చి కోసం అజిత్ కుమార్ చేసిన ఈ సాహసోపేతమైన స్టంట్ సీక్వెన్స్ అతని డెడికేషన్ కు అద్దం పడుతుంది" అని చెప్పింది.

అప్పట్లో ఈ వీడియోలను చూసి అజిత్ ఫ్యాన్స్ ఆందోళన చెందారు. తమ కోసం మరీ ఈ స్థాయి రిస్క్ చేయొద్దంటూ తమ అభిమాన నటుడిని వాళ్లు కోరారు. అయితే తాజాగా అలాంటిదే మరో స్టంట్ వీడియో బయటకు రావడం విశేషం.

WhatsApp channel