కపుల్ గోల్స్ నెరవేర్చుకోవడంలో సెలబ్రిటీలు చాలా ఉత్సాహంగా ఉంటారు. మ్యారేజ్ యానివర్సరీలను ఎంతో అందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. తాజాగా తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్, ఆయన భార్య, ఒకప్పటి హీరోయిన్ షాలిని తమ 25వ పెళ్లి రోజును జరుపుకున్నారు.
హీరో అజిత్ కుమార్ తన భార్య శాలినితో కలిసి ఏప్రిల్ 24న తమ 25వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. అంటే, ప్రేమించి పెళ్లి చేసుకున్న అజిత్ కుమార్, షాలిని వివాహబంధంలోకి అడుగుపెట్టి 25 ఏళ్లు కావొస్తోంది. ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా అజిత్, షాలిని పెళ్లి వేడుకలు చేసుకున్నారు.
ఈ జంట సన్నిహితంగా మెలిగిన తమ పెళ్లి వేడుకల వీడియోను తాజాగా అభిమానులతో పంచుకుంది. చాలా సింపుల్‌గా కేక్ కట్ చేసి తమ 25వ పెళ్లి వేడుకను జరుపుకున్నారు ఈ హీరో హీరోయిన్. ఈ వీడియోలో ఒకరికొకరు కేక్ తినిపిస్తూ కనిపించారు. శాలిని పొడవైన నీలిరంగు ఏ లైన్ కుర్తా, దానికి సరిపోయే లెగ్గింగ్స్ ధరించింది.
ఇక అజిత్ కుమార్ క్లీన్ షేవ్ చేసుకుని నీలిరంగు షర్ట్, బ్లాక్ ట్రౌజర్ వేసుకుని అట్రాక్టవ్‌గా కనిపించాడు. గురువారం (ఏప్రిల్ 24) శాలిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో వారి 25వ వివాహ వార్షికోత్సవ వేడుకకు సంబంధించిన వీడియోను పంచుకుంది. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
ఈ వీడియోను చూసిన అభిమానులు సంతోషంతో మురిసిపోయారు. అలాగే, ఫ్యాన్స్, నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. “మీరు ఇద్దరి నిజమైన ప్రేమే నేను లవ్ మ్యాజిక్‌ను నమ్మడానికి కారణం” అని ఒక నెటిజన్ రాశారు. మరొకరు, “మీరు ఇద్దరూ ఎంతోమంది జంటలకు ఆదర్శం” అన్నారు.
మరొకరు, “25 సంవత్సరాల బంధం మాకు ఇప్పటికీ ఉత్సాహాన్ని ఇస్తోంది. తల అజిత్, శాలిని అసలైన కథా నాయకుల జంటకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు” అని ఓ అభిమాని రాశారు. “ఈ రోజులోని ఉత్తమమైన, అత్యంత అందమైన వీడియో” అని మరొకరు రాసుకొచ్చారు.
ఇదిలా ఉంటే, 1999లో శరణ్ దర్శకత్వం వహించిన అమర్కలం సినిమా షూటింగ్ సమయంలో షాలినితో అజిత్ డేటింగ్ ప్రారంభించారు. అదే సంవత్సరం జూన్‌లో షాలినికి అజిత్ ప్రపోజ్ చేశాడు. 2000 ఏప్రిల్‌లో చెన్నైలో వీరిద్దరి వివాహం జరిగింది. 2008లో కుమార్తెకు, 2015లో కుమారుడికి జన్మనిచ్చింది ఈ జంట.
ప్రస్తుతం షాలిని ఎలాంటి సినిమాలు చేయకపోగా.. అజిత్ వరుస మూవీస్‌తో అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. రీసెంట్‌గానే అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళంలో ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. అజిత్ ఫ్యాన్స్‌కు ట్రీట్‌లా ఈ సినిమా తెరకెక్కింది.
సంబంధిత కథనం