Music Shop Murthy: 25 ఏళ్లకు చేయంది 50 ఏళ్ల వయసులో సాధిస్తే: మ్యూజిక్ షాప్ మూర్తి డైరెక్టర్-ajay ghosh chandini chowdary movie music shop murthy director shiva paladugu about age and goals tollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Music Shop Murthy: 25 ఏళ్లకు చేయంది 50 ఏళ్ల వయసులో సాధిస్తే: మ్యూజిక్ షాప్ మూర్తి డైరెక్టర్

Music Shop Murthy: 25 ఏళ్లకు చేయంది 50 ఏళ్ల వయసులో సాధిస్తే: మ్యూజిక్ షాప్ మూర్తి డైరెక్టర్

Sanjiv Kumar HT Telugu
Jun 13, 2024 01:49 PM IST

Music Shop Murthy Director Shiva Paladugu About Age: అజయ్ ఘోష్, చాందినీ చౌదరి నటించిన సినిమా మ్యూజిక్ షాప్ మూర్తి. 25 ఏళ్ల వయసులో సాధించలేనిది 50 ఏళ్ల వయసులో సాధిస్తే అనే కథాశంతో తెరకెక్కిందే మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా అని డైరెక్టర్ శివ పాలడుగు తెలిపారు.

25 ఏళ్లకు చేయంది 50 ఏళ్ల వయసులో సాధిస్తే: మ్యూజిక్ షాప్ మూర్తి డైరెక్టర్
25 ఏళ్లకు చేయంది 50 ఏళ్ల వయసులో సాధిస్తే: మ్యూజిక్ షాప్ మూర్తి డైరెక్టర్

Music Shop Murthy Director Shiva Paladugu: అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. ఫ్లై హై సినిమాస్‌ బ్యానర్ పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి ఈ మూవీని నిర్మించారు. శివ పాలడుగు ఈ సినిమాకి కథ, కథనాన్ని అందించి దర్శకత్వం వహించారు. ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ జూన్ 14న విడుదల కానుంది. ఈ క్రమంలో దర్శకుడు శివ పాలడుగు మీడియాతో ముచ్చటించారు.

మీ నేపథ్యం, సినిమా ప్రయాణం గురించి చెప్పండి?

మాది విజయవాడ. అమెరికాలో ఉద్యోగం చేశాను. అక్కడే నాకు ఫ్రెండ్‌గా హర్ష పరిచయమయ్యాడు. అమెరికాలోనే డైరెక్షన్ కోర్సులో డిప్లోమా చేశాను. నాకు మొదటి సినిమా అవకాశం చాలా సులభంగానే వచ్చింది. నా ఫ్రెండ్స్ నిర్మాతలు కావడంతో అంతా చాలా ఈజీగా జరిగిపోయింది.

‘మ్యూజిక్ షాప్ మూర్తి’ కథకు అజయ్ ఘోష్‌నే ఎందుకు అనుకున్నారు?

పాతికేళ్ల కుర్రాడి కథ చెబితే మళ్లీ రొటీన్ అవుతుందని, కాస్త కొత్తగా ఉండాలనే ఈ మ్యూజిక్ షాప్ మూర్తి కథను రాసుకున్నాను. ఈ కథకు అజయ్ ఘోష్ అయితే బాగుంటుందని అనుకున్నాను. కాస్త కొత్తగా ఉంటుందనే ఆయనతో ఈ కారెక్టర్ వేయించాను. ఆయన అద్భుతంగా ఎమోషన్స్ పండిస్తారని నాకు తెలుసు. ఈ సినిమా అనుకుంటున్న టైంలో ఇంకా పుష్ప రాలేదు. కానీ, ఆయన ఈ పాత్రను పోషించగలరని అనుకున్నాను.

ఈ చిత్రంతో ఏమైనా సందేశం ఇవ్వబోతున్నారా?

ఏదో సందేశం ఇవ్వాలని ఈ కథను రాసుకోలేదు. పాతికేళ్ల వయసులో సాధించలేనిది.. యాభై ఏళ్ల వయసు వచ్చాక సాధించాలనుకుంటే.. ఆ సాధన కోసం చేసే ప్రయత్నం ఎలా ఉంటుంది? ఎంత ఎమోషనల్‌గా ఉంటుందని ఆడియెన్స్‌కు చెప్పాలనే ఈ కథను రాసుకున్నాను.

చాందినీ చౌదరి పాత్రకు ఉండే ప్రాముఖ్యత ఏంటి?

చాందినీ చౌదరి పాత్రతోనే సినిమా ప్రారంభం అవుతుంది. ఆమె పాత్ర చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. మూర్తి జీవితంలో అంజన వల్ల వచ్చిన మార్పులు సినిమాని ముందుకు తీసుకెళ్తాయి. అంజన కారెక్టర్‌లో చాందినీ చౌదరి అద్భుతంగా నటించారు. ఆమెకు ఇందులో తగిన ప్రాధాన్యం లభించింది.

ఈ సినిమా కోసం మ్యూజిక్ మీద ఏమైనా రీసెర్చ్ చేశారా?

మ్యూజిక్ మీద చాలానే రీసెర్చ్ చేశాం. అప్పటి తరం సంగీతం, నేటి ట్రెండీ మ్యూజిక్ ఇలా అన్నింటిపై పరిశోధించాం. పవన్ మంచి సంగీతాన్ని ఇచ్చారు. ప్రతీ పాట సందర్భానుసారంగానే వస్తుంది. ఎక్కడా ఇరికించినట్టుగా అనిపించదు.

బడ్జెట్ పరంగా ఏమైనా సమస్యలు వచ్చాయా?

ఈ సినిమా ప్రయాణంలో నాకు బడ్జెట్ పరంగా ఎలాంటి సమస్యలు రాలేదు. నా స్నేహితులే నిర్మాతలు కావడంతో, వారు నా మీద నమ్మకంతో ఖర్చుకి వెనుకాడలేదు. అనుకున్నదానికంటే కాస్త ఎక్కువే ఖర్చు అయినా.. ఎక్కడా వృథాగా ఖర్చు పెట్టలేదు.

మొదటి సినిమా కదా? తెరకెక్కించడంలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి?

నాకు మంచి టీం దొరికింది. ఆ టీం సహాయంతోనే సినిమాను ఇంత వరకు తీసుకు రాగలిగాను. అయితే సినిమా తీయడం కంటే.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, రిలీజ్ చేయడం, ప్రమోషన్స్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. మొత్తానికి మా సినిమా జూన్ 14న రాబోతోంది. చాలా ఆనందంగా ఉంది.

Whats_app_banner