Shaitaan OTT: అజయ్ దేవ్‍గణ్, జ్యోతిక హారర్ మూవీ ‘సైతాన్’ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఫిక్స్.. స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రావొచ్చంటే..
Shaitaan OTT Platform: సైతాన్ సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఖరారైంది. అజయ్ దేవ్‍గణ్, జ్యోతిక నటించిన ఈ చిత్రం ఎప్పుడు స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశం ఉందంటే..
Shaitaan OTT: బాలీవుడ్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ ‘సైతాన్’ మోస్తరు ఓపెనింగ్ దక్కించుకుంది. అజయ్ దేవ్‍గణ్, జ్యోతిక, మాధవన్, జానకి బోదివాలా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం మార్చి 8న థియేటర్లలో రిలీజ్ అయింది. ఉత్కంఠ భరితంగా ఉన్న ట్రైలర్ తర్వాత ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రానికి ఎక్కువగా పాజిటివ్ టాక్ వస్తోంది. కాగా, ఈ సైతాన్ సినిమా ఓటీటీ పార్ట్‌నర్ వివరాలు బయటికి వచ్చాయి.
ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఇదే
సైతాన్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత తమ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు తెచ్చేలా నెట్‍ఫ్లిక్స్ డీల్ చేసుకుంది. ఈ మూవీ డిజిటల్ హక్కులకు మంచి ధరే దక్కినట్టు సమాచారం.
థియేటర్లలో రిలీజైన ఎనిమిది వారాల తర్వాత నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో సైతాన్ చిత్రం రానుంది. మే నెల మూడో వారంలో ఈ చిత్రం ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు వస్తుందని అంచనాలు ఉన్నాయి.
సైతాన్ చిత్రానికి వికాస్ బాహ్ల్ దర్శకత్వం వహించారు. గుజరాతీ మూవీ వర్ష్‌కు రీమేక్‍గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హారర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సస్పెన్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అజయ్ దేవ్‍గణ్, జ్యోతిక, మాధవన్, జానకి, అంగద్ రాజ్ పర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి హైలైట్‍గా నిలిచింది. ఈ మూవీకి అమిత్ త్రివేది సంగీతం అందించారు.
సైతాన్ మూవీని అజయ్ దేవ్‍గణ్, జ్యోతీ దేశ్‍పాండే, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్ సంయుక్తంగా నిర్మించారు. జియో స్టూడియోస్, పనోరమ స్టూడియోస్ పతాకాలు కూడా నిర్మాణంలో భాగస్వామ్యమయ్యాయి. సుధాకర్ రెడ్డి యక్కంటి సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి సందీప్ ఫ్రాన్సిస్ ఎడిటింగ్ చేశారు.
సైతాన్ కలెక్షన్లు
సైతాన్ సినిమా తొలి రోజు ఇండియాలో రూ.14.75 కోట్ల నెట్ కలెక్షన్లను దక్కించుకుంది. దీంతో మోస్తరు ఓపెనింగ్ అందుకుంది. రెండో రోజైన శనివారం ఈ మూవీకి వసూళ్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాక్ పాజిటివ్‍గా రావటంతో వసూళ్లు పెరుగుతాయన్న అంచనాలు ఉన్నాయి. బుకింగ్స్ ట్రెండ్స్ చూస్తుంటే తొలి రోజు కంటే.. రెండో రోజు కలెక్షన్లు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. సెకండ్ డే ఇండియాలో సుమారు రూ.16కోట్ల వరకు నెట్ వసూళ్లు దక్కుతాయని అంచనా.
సైతాన్ స్టోరీ బ్యాక్‍డ్రాప్ ఇదే..
కబీర్ (అజయ్ దేవ్‍గణ్), అతడి భార్య జ్యోతి (జ్యోతిక)తో పాటు ఇద్దరు పిల్లలు ఫామ్ హౌస్‍లో వెకేషన్ కోసం వెళ్లేందుకు నిర్ణయించుకుంటారు. వెళ్లే దారిలో వారికి వనరాజ్ (మాధవన్) పరిచయం అవుతారు. వారితో మాటలు కలుపుతాడు. ఆ క్రమంలో కబీర్ కూతురు జాన్వీ (జానకి)కి ఓ విషపూరితమైన పదార్థం ఇస్తాడు. ఆ తర్వాతి నుంచి వనరాజ్ ఏం చెబితే జాన్వీ ఆ మాట వింటుంది. ఆ తర్వాత కబీర్ ఫ్యామిలీని ఫాలో అవుతూ ఫామ్ హౌస్‍కు వెళతాడు వనరాజ్. ఆ తర్వాత జాన్వీని తన ఆధీనంలోకి తీసుకొని.. బీభత్సమైన పనులు చేయిస్తుంటాడు. అల్లకల్లోలం చేస్తాడు. వనరాజ్‍ను కబీర్ కట్టడి చేసి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడా? ఆ సైకో వనరాజ్ ఎవరు? ఈ ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేశాడు? అనేవే ఈ చిత్రంలో ముఖ్యమైన అంశాలుగా ఉన్నాయి.