Aishwarya Rajesh: చెన్నైకి వెళ్లాక వెంకటేష్‌‌ను చాలా మిస్ అయ్యాను, స్వీట్ హార్ట్ శిరీష్.. ఐశ్వర్య రాజేష్ కామెంట్స్-aishwarya rajesh comments on venkatesh and producer shirish in sankranthiki vasthunnam success event at bhimavaram ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aishwarya Rajesh: చెన్నైకి వెళ్లాక వెంకటేష్‌‌ను చాలా మిస్ అయ్యాను, స్వీట్ హార్ట్ శిరీష్.. ఐశ్వర్య రాజేష్ కామెంట్స్

Aishwarya Rajesh: చెన్నైకి వెళ్లాక వెంకటేష్‌‌ను చాలా మిస్ అయ్యాను, స్వీట్ హార్ట్ శిరీష్.. ఐశ్వర్య రాజేష్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Jan 27, 2025 11:09 AM IST

Aishwarya Rajesh Venkatesh Sankranthiki Vasthunnam Bhimavaram: వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ కావడంతో సక్సెస్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా భీమవరంలో నిర్వహించిన సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ సంబరం ఈవెంట్‌లో ఐశ్వర్య రాజేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

చెన్నైకి వెళ్లాక వెంకటేష్‌‌ను చాలా మిస్ అయ్యాను, స్వీట్ హార్ట్ శిరీష్.. ఐశ్వర్య రాజేష్ కామెంట్స్
చెన్నైకి వెళ్లాక వెంకటేష్‌‌ను చాలా మిస్ అయ్యాను, స్వీట్ హార్ట్ శిరీష్.. ఐశ్వర్య రాజేష్ కామెంట్స్

Aishwarya Rajesh Venkatesh Sankranthiki Vasthunnam Bhimavaram: విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్స్‌గా నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 14న విడుదలై ఘన విజయం సాధించింది.

yearly horoscope entry point

260 కోట్ల కలెక్షన్స్

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్‌తో రచ్చ చేస్తున్న సంక్రాంతికి వస్తున్నాం మూవీ రూ. 260 కోట్ల వరకు వసూళ్లు సాధించిందని సమాచారం. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ భీమవరంలో సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ సంబరం ఈవెంట్‌ను తాజాగా నిర్వహించింది. భారీగా హాజరైన అభిమానులు ప్రేక్షకులు సమక్షంలో ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.

ఐశ్వర్య రాజేష్ కామెంట్స్

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎమ్మల్యే కామినేని శ్రీనివాసరావు ఈ సంక్రాంతి బాక్సాఫీస్ సంబరం వేడుకలో అతిధులుగా పాల్గొన్నారు. అలాగే, ఈ ఈవెంట్‌లో హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ప్రజలు మంచి వైబ్ ఇస్తారు

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం భీమవరం ప్రజలందరికీ. ఈ సినిమా సక్సెస్ ఈవెంట్‌ను భీమవరంలో చేసుకోవడం ఆనందంగా ఉంది. ఈ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మా సక్సెస్‌ను భీమవరంలోనే చేయాలనుకున్నాం. ఎందుకంటే ఈ ప్రజలు అంత మంచి వైబ్ ఇస్తారని" అని తెలిపింది.

ఒక్కటి చెప్పండి

"ఇక్కడ ఉండటం చాలా ఆనందంగా ఉంది. నా టీమ్ అందరికీ చాలా థ్యాంక్స్. స్పెషల్‌గా వెంకీ గారు. నిజంగా చాలా మిస్ అయ్యాం సార్ చెన్నైకి వెళ్లాక. మనకు చాలా గొప్ప మెమోరీస్ ఉన్నాయి ఈ సినిమాతో. సెట్‌లో, షూటింగ్ స్పార్ట్స్‌లో జరిగిన విషయాలు గుర్తుకు తెచ్చుకుని" అని ఐశ్వర్య రాజేష్ చెబుతుంటే.. "మాకు ఒక్కటి షేర్ చేయొచ్చు కదండి. ఆ బ్యూటిఫుల్ మెమోరీ ఏదో" అని యాంకర్ రవి అడిగాడు.

భోజనప్రియులం అంతే కదా

"ఆ.." అని ఐశ్వర్య రాజేష్ ఆలోచిస్తుంటే.. పక్కనే ఉన్న మీనాక్షి చౌదరి "ఫుడ్" అని చెప్పింది. "హా ఫుడ్.. ఫుడ్.." అని నవ్వుతూ చెప్పింది ఐశ్వర్య రాజేష్. "మేము భోజనప్రియులం.. అంటే భీమవరం వాళ్లు అంతే కదా. పట్టు పట్టైన తినిపిస్తాం అంతే కదా. మేము షూటింగ్‌లో కలిసి సంతోషంగా భోజనం చేసిన రోజులు గానీ, యాక్ట్ చేసింది గానీ.. నిజానికి యాక్ట్ చేసినట్లే లేదు. అనిల్ అంతా ఈజీగా చేసేశారు" అని ఐశ్వర్య రాజేష్ తెలిపింది.

స్వీట్ హార్ట్ ప్రొడ్యూసర్

"మా నిర్మాత దిల్ రాజు గారికి థ్యాంక్యూ. అండ్ స్పెషల్లీ మా స్వీట్ హార్ట్ శిరీష్ గారికి థాంక్ యూ. మమ్మల్ని శిరీష్ గారు చాలా బాగా చూసుకున్నారు. ఇలాంటి మంచి ప్రొడ్యూసర్‌ని మేము మిస్ అవుతాం. కానీ, మమ్మల్ని గుర్తుపెట్టుకోండి. సరియా (ఓకేనా). అనిల్ గారికి బిగ్ థాంక్స్. ఈ విజయాన్ని మర్చిపోలేను" అని ఐశ్వర్య రాజేష్ చెప్పుకొచ్చింది.

Whats_app_banner

సంబంధిత కథనం