Aishwarya Rai: విడాకుల రూమర్లకు చెక్ పెట్టినట్లేనా.. అభిషేక్ బచ్చన్‌కు ఐశ్వర్య క్యూట్ బర్త్‌డే విషెస్-aishwarya rai wishes her husband abhishek bachchan on his 49th birthday amid divorce rumours ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aishwarya Rai: విడాకుల రూమర్లకు చెక్ పెట్టినట్లేనా.. అభిషేక్ బచ్చన్‌కు ఐశ్వర్య క్యూట్ బర్త్‌డే విషెస్

Aishwarya Rai: విడాకుల రూమర్లకు చెక్ పెట్టినట్లేనా.. అభిషేక్ బచ్చన్‌కు ఐశ్వర్య క్యూట్ బర్త్‌డే విషెస్

Hari Prasad S HT Telugu
Feb 05, 2025 09:12 PM IST

Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్ కు అతని 49వ పుట్టిన రోజు సందర్భంగా ఓ క్యూట్ బర్త్ డే విషెస్ చెప్పింది. అభిషేక్ చిన్ననాటి ఫొటోను పోస్ట్ చేస్తూ ఆమె విషెస్ చెప్పడం విశేషం. విడాకుల పుకార్ల నేపథ్యంలో ఈ పోస్ట్ వైరల్ అయింది.

విడాకుల రూమర్లకు చెక్ పెట్టినట్లేనా.. అభిషేక్ బచ్చన్‌కు ఐశ్వర్య క్యూట్ బర్త్‌డే విషెస్
విడాకుల రూమర్లకు చెక్ పెట్టినట్లేనా.. అభిషేక్ బచ్చన్‌కు ఐశ్వర్య క్యూట్ బర్త్‌డే విషెస్

Aishwarya Rai: ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ బాలీవుడ్ బ్యూటీ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అందులో ఆమె తన భర్త అభిషేక్ 49వ పుట్టిన రోజు సందర్భంగా విషెస్ చెప్పింది. అది కూడా అతని చిన్ననాటి ఫొటోతో కావడం విశేషం. బుధవారం (ఫిబ్రవరి 5) అభిషేక్ బచ్చన్ తన 49వ పుట్టిన రోజు జరుపుకున్నాడు.

yearly horoscope entry point

ఐశ్వర్య రాయ్ బర్త్ డే విషెస్ పోస్ట్

ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నారని, బచ్చన్ ఫ్యామిలీతో అసలు ఐశ్వర్యకు పడటం లేదని గతేడాది నుంచి ఎన్నో వార్తలు వస్తున్నాయి. గతేడాది నవంబర్ లో ఐశ్వర్య బర్త్ డే సందర్భంగా అభిషేక్ తప్ప బచ్చన్ ఫ్యామిలీలో ఎవరూ ఆమెకు విషెస్ చెప్పలేదు.

అంతేకాదు ఆరాధ్య బర్త్ డేకు కూడా ఆ కుటుంబం నుంచి ఎవరూ రాలేదు. ఈ నేపథ్యంలో వీళ్ల విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో బుధవారం (ఫిబ్రవరి 5) అభిషేక్ బచ్చన్ పుట్టిన రోజు సందర్భంగా ఐశ్వర్య తన ఇన్‌స్టా ద్వారా విషెస్ చెప్పింది.

ఇందులో అభిషేక్ చిన్నతనంలో ఓ చిన్న సైకిల్ పై కూర్చొన్న ఓ క్యూట్ ఫొటోను పోస్ట్ చేసింది. "హ్యాపీ బర్త్ డే. నీకు ఆనందం, ఆరోగ్యం, ప్రేమ లభించాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్" అని ఐశ్వర్య క్యాప్షన్ ఉంచింది.

ఫ్యాన్స్ రియాక్షన్ ఇదీ

అభిషేక్, ఐశ్వర్య విడాకుల వార్తల నేపథ్యంలో ఆమె చేసిన ఈ పోస్ట్ వైరల్ అయింది. దీనిపై ఎంతో మంది ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. విడాకులు అని అనేవాళ్లు ఇప్పుడు ఎక్కడికి వెళ్లారు అంటూ ఓ అభిమాని ప్రశ్నించారు. చాలా మంది ఐశ్వర్యకు మద్దతుగా కామెంట్స్ చేయడం విశేషం. గతేడాది జులైలో అంబానీల పెళ్లి వేడుక సమయం నుంచి ఐశ్వర్య, అభిషేక్ విడాకుల పుకార్లు మొదలయ్యాయి.

ఆ ఈవెంట్ కు బచ్చన్ కుటుంబమంతా కలిసి రాగా.. ఐశ్వర్య మాత్రం తన కూతురు ఆరాధ్యతో కలిసి వేరుగా వచ్చింది. ఆ తర్వాత ఐశ్వర్య పుట్టిన రోజునాడు కూడా బచ్చన్ కుటుంబం ఆమెను విష్ చేయలేదు. 2007లో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. 2011లో వీళ్లకు ఆరాధ్య జన్మించింది.

Whats_app_banner

సంబంధిత కథనం