Aishwarya Rai On Bollywood : బాలీవుడ్‌లో మంచి అవకాశాలు రావడం లేదు
Aishwarya Rai : 26 ఏళ్లుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న ఐశ్వర్యరాయ్ తన వయసులో ఉన్న స్టార్ నటీమణుల కంటే తక్కువ సినిమాల్లోనే నటించింది. ఐశ్వర్య ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బాలీవుడ్ నుండి తనకు సరైన పాత్రల ఆఫర్లు రాలేదని అంగీకరించింది.
అందాల భామ ఐశ్వర్యారాయ్(Aishwarya Rai) సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 26 ఏళ్లు దాటింది. అయినా ఇప్పటికీ అదే అందం. మణిరత్నం ఇరువర్(Iruvar) సినిమాతో నటనలోకి అడుగుపెట్టిన ఐశ్వర్యరాయ్ ఇక వెనుదిరిగి చూసుకోలేదు. అద్భుతమైన అందం, అద్భుతమైన నటనతో మంచి మంచి అవకాశాలతో దూసుకెళ్లింది. అయినా ఐశ్వర్య రాయ్ తన కాలంలోని కొంతమంది నటీమణులతో పోలిస్తే తక్కువ చిత్రాలలో నటించింది. అందుకు కారణం ఆమె పాత్రలను ఎంచుకున్న విధానమే. గ్లామర్‌కు స్కోప్ ఉన్న పాత్రల్లోనే కాకుండా నటించే అవకాశం ఉన్న పాత్రల్లో, కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ వచ్చింది ఐశ్వర్య.
ట్రెండింగ్ వార్తలు
ఇటీవల మణిరత్నం(Maniratnam) పొన్నియన్ సెల్వన్ 2లో నటించిన ఐశ్వర్య రాయ్, బాలీవుడ్(Bollywood) నుండి తనకు తక్కువ మంచి పాత్ర అవకాశాలు వస్తున్నాయని ఫిల్మ్ కంపానియన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంగీకరించింది. 'చాలా మంది ఈ ప్రశ్న అడుగుతారు. వ్యక్తులకు, నటీనటులకు, దర్శకులకు సరిపోయే పాత్ర ఉన్నప్పుడు ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. ఇలాంటి ప్రశ్నలు తలెత్తడం నటీనటులకు మెప్పు. పవర్‌ఫుల్ పాత్రలను రూపొందించినందుకు మణిరత్నంను మేం చాలా గౌరవిస్తాం, అభినందిస్తున్నాం' అని ఐశ్వర్య చెప్పుకొచ్చింది.
మణిరత్నం ఇరువర్ చిత్రంతో తన నటనా రంగ ప్రవేశం చేసిన ఐశ్వర్య రాయ్, ఆయన దర్శకత్వం వహించిన రావణన్‌లో నటించింది. ఆ తర్వాత ఇటీవల పొన్నియిన్ సెల్వన్ 1, 2 సినిమాల్లో మెరిసింది. ఐశ్వర్యరాయ్ పొన్నియన్ సెల్వన్‌లో నందిని పాత్రలో ఇప్పటివరకు తాను పోషించిన పాత్రలలో అత్యుత్తమమైనదని పేర్కొంది. బాలీవుడ్‌లో పలు సినిమాల్లో(Bollywood Cinema) నటించిన ఐశ్వర్యరాయ్‌కి తమిళంలో బెస్ట్ రోల్స్ రావడం, మణిరత్నం, శంకర్ సినిమాల్లోని పాత్రలు ఐశ్వర్యరాయ్‌కి పెద్ద పేరు తెచ్చిపెట్టాయి.
ఐశ్వర్యారాయ్ బాలీవుడ్‌లో మొదట్లో కొన్ని పరాజయాలను ఎదుర్కొంది. సల్మాన్‌ఖాన్‌తో బంధం చెడిపోయిన తర్వాత ఐశ్వర్య చాలా సినిమాలకు దూరమైంది. అడ్వాన్స్ ఇచ్చిన సినిమాల నుంచి కూడా తప్పుకుంది. పెద్ద నిర్మాణ సంస్థలు ఆమెను దూరంగా ఉంచాయి. కానీ చాలా గుర్తుండిపోయే సినిమాల్లో నటించింది. తాల్, హమ్ దిల్ దేచుకే సనమ్, మొహబ్బతేన్, దేవదాస్, గురు, ధూమ్ 2, జోధా అక్బర్, సర్కార్ రాజ్, గుజారిష్, సరబ్జిత్, కొన్ని ఇతర గుర్తుండిపోయే సినిమాల్లో నటించింది. పొన్నియిన్ సెల్వన్(Ponniyin Selvan) తర్వాత ఐశ్వర్యరాయ్ ఏ సినిమానూ అంగీకరించలేదు. ప్రస్తుతం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేస్తోంది.