Aishwarya Rai Lip Kiss: కూతురికి ఐశ్వర్యా రాయ్‌ లిప్‌ కిస్‌.. ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు-aishwarya rai lip kiss to daughter creating huge ruckus in social media
Telugu News  /  Entertainment  /  Aishwarya Rai Lip Kiss To Daughter Creating Huge Ruckus In Social Media
కూతురు ఆరాధ్యకు ఐశ్వర్య లిప్ కిస్
కూతురు ఆరాధ్యకు ఐశ్వర్య లిప్ కిస్

Aishwarya Rai Lip Kiss: కూతురికి ఐశ్వర్యా రాయ్‌ లిప్‌ కిస్‌.. ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు

16 November 2022, 14:07 ISTHT Telugu Desk
16 November 2022, 14:07 IST

Aishwarya Rai Lip Kiss: కూతురికి ఐశ్వర్యా రాయ్‌ లిప్‌ కిస్‌ ఇవ్వడంపై నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. ఎవరైనా కూతురికి నుదురు లేదంటే చెంపపై ముద్దిస్తారు తప్ప ఇలా పెదవులపై కిస్‌ ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు.

Aishwarya Rai Lip Kiss: బాలీవుడ్‌ నటి, నటుడు అభిషేక్ బచ్చన్‌ భార్య ఐశ్వర్య రాయ్‌ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ మధ్యే పొన్నియిన్‌ సెల్వన్ 1 మూవీలో రాణి నందినిగా తన అందంతో కట్టి పడేసిన ఆమె.. ఇప్పుడు తన కూతురు బర్త్‌డే వేడుకల్లో చేసిన పనితో విమర్శలు ఎదుర్కొంటోంది. బుధవారం (నవంబర్ 16) ఐశ్వర్య కూతురు ఆరాధ్య తన 11వ పుట్టిన రోజు జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా ఆమెకు విషెస్‌ చెబుతూ ఆరాధ్యపై పెదవులపై కిస్‌ ఇస్తున్న ఫొటోను ఐశ్వర్య ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అయితే ఈ ఫొటో కాస్తా తీవ్ర విమర్శలకు దారి తీసింది. టీనేజ్‌కు దగ్గర పడిన కూతురుకు ఇలా లిప్‌ కిస్‌ ఇవ్వడమేంటని నెటిజన్లు ప్రశ్నించారు. ఇది భారతీయ సంస్కృతి కాదు.. సిగ్గు చేటు అని ఒకరు, లెస్బియన్‌లలాగా ఏంటీ పని అంటూ మరొకరు దారుణంగా కామెంట్స్‌ చేశారు.

అయితే మరికొందరు మాత్రం ఇందులో తప్పేముందంటూ అలా నెగటివ్ కామెంట్స్ చేసిన వాళ్లపై ఎదురు దాడికి దిగారు. మీ మెదళ్లలో ఉన్న చెత్తను తీసేయండి అంటూ ఓ యూజర్‌ క్లాస్‌ పీకారు. ఓ తల్లి తన కూతురుకు పెదాలపై కిస్‌ ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఇతరుల వ్యక్తిగత విషయాలపై మీ తీర్పులు అవసరం లేదు.. కాస్త ఎదగండి అంటూ మరొకరు కామెంట్‌ చేశారు.

ఇక మరో యూజర్‌ కామెంట్‌ చేస్తూ.. ఇలా కిస్‌ ఇస్తే ఇచ్చింది కానీ.. దానిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయకుండా ఉండాల్సింది. దీనిని అర్థం చేసుకునే స్థాయికి మన దగ్గర చాలా మంది ఎదగలేదు అని అన్నారు. ఆరాధ్యకు బర్త్‌డే విషెస్‌ చెప్పాల్సింది పోయి.. అభిమానులందరూ ఇలా ఒకరిప మరొకరు దుమ్మెత్తి పోసుకోవడానికి ఈ పోస్ట్‌ను ఉపయోగించుకుంటున్నారు.