Aishwarya Rai Car Accident: బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ ప్రయాణిస్తున్న కారును ముంబైలో బుధవారం (మార్చి 26) ఓ స్థానిక బస్సు ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై కాసేపు గందరగోళం నెలకొంది. అయితే ఆ సమయంలో ఐశ్వర్య ఆ కారులో లేదని బాలీవుడ్ షాదీస్ అనే ఫొటోగ్రాఫర్ పేజీ ఒకటి వెల్లడించింది.
ముంబైలో ఐశ్వర్య రాయ్ కారు ప్రయాణిస్తుండగా.. వెనుక నుంచి ఓ బస్సు వచ్చి ఢీకొట్టింది. ఆ సమయంలో కారులో ఉన్న ఐశ్వర్య బాడీగార్డులు కిందికి దిగారు. అయితే ఈ ప్రమాదంలో కారుకు పెద్దగా నష్టమేమీ జరగలేదు. ఈ ప్రమాదంపై బస్సు డ్రైవర్ ను బాడీగార్డులు నిలదీశారు. ఆ తర్వాత కారు అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే పోలీసుల వెర్షన్ మాత్రం వేరుగా ఉంది.
అక్కడ ప్రమాదం ఏమీ జరగలేదని చెబుతున్నారు. కారు వెనుక వస్తున్న బస్సు పదే పదే హారన్ మోగిస్తుండటంతో ఎందుకలా హారన్ కొడుతున్నావంటూ ఐశ్వర్య కారు డ్రైవర్ కిందికి దిగి ప్రశ్నించాడని, అంతే తప్ప ప్రమాదం జరగలేదని జుహుకు చెందిన ఓ పోలీస్ ఆఫీసర్ చెప్పాడు.
ఈ ప్రమాదంపై ఐశ్వర్య రాయ్ అభిమానులు సోషల్ మీడియాలో స్పందించారు. ఆమె భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ వాళ్లు పోస్టులు చేశారు. ఐశ్వర్య సేఫ్ గానే ఉంది కదా అంటూ పలువురు కామెంట్స్ చేశారు. ఐశ్వర్య రాయ్ చివరిగా మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ 2 మూవీలో నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా కోసం ఆమెకు సైమా అవార్డుల్లో బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ లీడింగ్ రోల్ కేటగిరీలో అవార్డు దక్కింది. ఈ సినిమా 2023లో రిలీజైంది. ఇక ప్రస్తుతం ఆమె అభిషేక్ బచ్చన్ తో విడాకుల రూమర్లు వస్తున్న విషయం తెలిసిందే. ఐశ్వర్య, అభిషేక్ విడిపోతున్నారని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఈ ఇద్దరూ ఇంకా అధికారికంగా స్పందించలేదు.
సంబంధిత కథనం