ఓటీటీలో కుమ్మేస్తున్న వెబ్ సిరీస్‌.. ఇంట‌ర్ కాలేజ్ డేస్‌లోకి తిరిగి వెళ్ల‌డం ఖాయం.. నెట్టింట్లో ప్రశంసలు.. మీరు చూశారా?-air all india rankers web series trending on ott etv win latest release must watch series on ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలో కుమ్మేస్తున్న వెబ్ సిరీస్‌.. ఇంట‌ర్ కాలేజ్ డేస్‌లోకి తిరిగి వెళ్ల‌డం ఖాయం.. నెట్టింట్లో ప్రశంసలు.. మీరు చూశారా?

ఓటీటీలో కుమ్మేస్తున్న వెబ్ సిరీస్‌.. ఇంట‌ర్ కాలేజ్ డేస్‌లోకి తిరిగి వెళ్ల‌డం ఖాయం.. నెట్టింట్లో ప్రశంసలు.. మీరు చూశారా?

ఇంటర్ కాలేజీ రోజుల్లో చేసే అల్లరే వేరు. ఆ క్యాంపస్ హాస్టళ్లు.. బస్సుల్లో ప్రయాణాలు.. కొత్తగా రెక్కలొచ్చినట్టు ఫీలింగ్.. అబ్బో అదో కొత్త అనుభూతి. ఇప్పుడు మళ్లీ అలాంటి ఫీలింగ్ ను గుర్తు తెస్తోంది ఓ వెబ్ సిరీస్. ఓటీటీలో అదరగొడుతోంది.

ఓటీటీలో అదరగొడుతున్న వెబ్ సిరీస్ (x/etvwin)

మంచి కంటెంట్ తో డిఫరెంట్ సినిమాలు, సిరీస్ లను అందిస్తోంది ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్. ఇంటిల్లిపాది కలిసి చూసేలా మన కథలనే తీసుకుని తెరకెక్కిస్తోంది. ఇప్పుడు అలాంటి వెబ్ సిరీస్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. కామెడీ అందిస్తూనే ఏడిపిస్తోంది. అందరినీ తమ ఇంటర్ కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్తోంది. ఆ వెబ్ సిరీస్ పేరే ‘ఏఐఆర్ (ఆల్ ఇండియా ర్యాంకర్స్)’. ఓటీటీలో ఈ సిరీస్ సత్తాచాటుతోంది.

ఏడు ఎపిసోడ్లు

ఏఐఆర్ (ఆల్ ఇండియా ర్యాంకర్స్) వెబ్ సిరీస్ ను ఏడు ఎపిసోడ్లుగా తీసుకొచ్చారు. గురువారం (జూలై 3) నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంటర్ చదివే ముగ్గురు కుర్రాళ్ల కథగా ఈ సిరీస్ తీసుకొచ్చారు. ఇంటర్లో కుర్రాళ్లు చేసే కామెడీ, హాస్టల్ లైఫ్, ర్యాంకుల కోసం పేరేంట్స్, మేనేజ్ మెంట్ ప్రెషర్ తదితర అంశాలతో ఈ సిరీస్ ను రూపొందించారు.

కంటెంట్ ఉన్న స్టోరీ

ఈటీవీ విన్ తీసుకొచ్చిన ఏఐఆర్ వెబ్ సిరీస్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కంటెంట్ ఉన్న స్టోరీని తీసుకొస్తున్నారంటూ పోస్టులు చేస్తున్నారు. ఇంటర్ రోజులు గుర్తుకొచ్చాయని చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ క్యారెక్టర్ లో అదరగొట్టారని అంటున్నారు.

ఫీల్ గుడ్ సిరీస్

ఏఐఆర్ వెబ్ సిరీస్ సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్నామంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి ఫీల్ గుడ్ వెబ్ సిరీస్ ను తీసుకొచ్చిన ఈటీవీ విన్ కు థ్యాంక్యూ అని ఓ యూజర్ ఎక్స్ లో రాసుకొచ్చాడు. ఇంటర్మీడియట్ కాలేజీ లైఫ్ వైబ్స్ ను అందంగా క్యాప్చర్ చేశారని, స్టోరీ టెల్లింగ్, ఎమోషన్స్ అత్యుత్తమంగా ఉన్నాయని అన్నాడు.

వరుస హిట్లు

ఈటీవీ విన్ ఓటీటీలో వరుసగా హార్ట్ టచింగ్ వెబ్ సిరీస్ లు, సినిమాలు వస్తున్నాయి. 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్, దిల్ సే, కథాసుధ లాంటి వెబ్ సిరీస్ లు, అనగనగా లాంటి సినిమాతో ఈటీవీ విన్ ఆడియన్స్ లోకి మరింత రీచ్ అయింది. ఇప్పుడు ఏఐఆర్ సిరీస్ తో మరోసారి ట్రెండ్ అవుతోంది.

కోర్టు మూవీ కుర్రాడు

ఏఐఆర్ వెబ్ సిరీస్ లో కోర్టు ఫేమ్ కుర్రాడు హర్ష్ రోషన్ తో పాటు భాను ప్రకాష్, జయతీర్థ కీలక పాత్రలు పోషించారు. ఇంటర్ స్టూడెంట్స్ గా వీళ్ల యాక్టింగ్ అదిరిపోయింది. ఇంకా ఈ సిరీస్ లో సునీల్, చైతన్య రావు, హర్ష చెముడు, సందీప్ రాజ్, సమీర్, జీవన్ తదితరులు నటించారు. ఈ సిరీస్ ను జోసెఫ్ క్లింటన్ డైరెక్ట్ చేశాడు. సందీప్ రాజ్, సూర్య వాసుపల్లి నిర్మించారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం