రియల్ లైఫ్ ఇన్సిడెంట్లతో ఒరిజినల్ మూవీస్, సిరీస్ తీసి ఆడియన్స్ మనసులు గెలుచుకుంటున్న ఈటీవీ విన్ మరోసారి అలాంటి సిరీస్ తో వస్తోంది. ఈ సారి ఇంటర్ కాలేజీ స్టూడెంట్స్ లైఫ్ ను స్టోరీ లైన్ గా తీసుకుని ఏఐఆర్ (ఆల్ ఇండియా ర్యాంకర్స్) సిరీస్ ను తీసుకొస్తోంది. ప్రతి ఇంటర్ స్టూడెంట్ స్టోరీ ఇది అంటూ డిజిటల్ స్ట్రీమింగ్ కు ముహూర్తం ఖరారు చేసింది. మరి ఈ సిరీస్ ఓటీటీలోకి ఎప్పుడొస్తుందో చూసేయండి.
ఈటీవీ విన్ ఒరిజినల్ వెబ్ సిరీస్ గా రూపుదిద్దుకున్న ఏఐఆర్ స్ట్రీమింగ్ డేట్ ను ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ అనౌన్స్ చేసింది. జులై 3న ఈ సిరీస్ ఓటీటీలోకి రాబోతోంది. ఈ విషయాన్ని ఈటీవీ విన్ ఆదివారం (జూన్ 15) ప్రకటించింది. ‘‘ఇక యుద్ధం మొదలు పెడదామా? ఇది ప్రతి ఇంటర్ స్టూడెంట్ స్టోరీ. ఈటీవీ విన్ యాప్ లో ఏఐఆర్ ను జులై 3న చూడండి’’ అని ఈటీవీ విన్ ఎక్స్ లో పోస్టు చేసింది.
హర్ష్ రోషన్.. ఇటీవల తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ కుర్రాడి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. సినిమాల్లో హీరో చిన్నప్పటి, టీనేజీ క్యారెక్టర్లు చేస్తూ అదరగొడుతున్నాడు. మిషన్ ఇంపాజిబుల్, సలార్, సరిపోదా శనివారం, స్వాగ్, టుక్ టుక్ సినిమాల్లో చేశాడు హర్ష్. రీసెంట్ బ్లాక్ బస్టర్ కోర్టు మూవీలో కీ రోల్ ప్లే చేశాడు. ఇప్పుడు ఏఐఆర్ సిరీస్ లో లీడ్ రోల్ చేస్తున్నాడు.
ఏఐఆర్ సిరీస్ లో హర్ష్ రోషన్ తో పాటు భాను ప్రకాష్, జయతీర్థ కీలక పాత్రలు పోషించారు. వీళ్లతో పాటు హర్ష చెముడు, రమణ భార్గవ్, చైతన్య రావు, జీవన్ కుమార్, సందీప్ రాజ్, సునీల్ కూడా నటించారు. కలర్ ఫొటో సినిమా డైరెక్టర్ సందీప్ రాజ్.. సూర్య వాసుపల్లితో కలిసి ఈ సినిమా ప్రొడ్యూస్ కూడా చేశాడు. ఈ సిరీస్ కు జోసెఫ్ క్లింటన్ డైరెక్టర్.
ఇంటర్ చదువు కోసం కాలేజీ క్యాంపస్ హాస్టల్లో నలిగిపోయే స్టూడెంట్స్ కథాంశంగా ఏఐఆర్ సిరీస్ ను రూపొందించినట్లు కనిపిస్తోంది. ఈ సిరీస్ ట్రైలర్ లో ముగ్గురు కుర్రాళ్ల హంగామా, హాస్టల్ లో అల్లరి, మార్కుల కోసం పోరాటం తదితర అంశాలు చూపించారు. హర్ష, సందీప్ రాజ్, సునీల్ యాక్టింగ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. 90స్ ఏ మిడిల్ క్లాసిక్ వెబ్ సిరీస్, అనగనగా లాంటి సినిమాతో ఈటీవీ విన్ ఇప్పటికే పాపులర్ అయింది.
సంబంధిత కథనం