Telugu Web Series OTT: ఓటీటీలో ఆ పండుగకు రానున్న కొత్త తెలుగు వెబ్ సిరీస్.. అప్‍డేట్ ఇచ్చిన మేకర్స్
AIR OTT Web Series: ‘ఎయిర్’ వెబ్ సిరీస్‍పై ఫస్ట్ లుక్‍తోనే క్యూరియాసిటీ నెలకొంది. ఐటీటీ కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు పడే తంటాలపై ఈ కామెడీ డ్రామా సిరీస్ ఉండనుంది. అయితే, ఈ సిరీస్‍పై మేకర్స్ తాజాగా అప్‍డేట్ ఇచ్చారు. షూటింగ్ మొదలైందని ప్రకటించారు.

ఈటీవీ విన్ కొత్తకొత్త కంటెంట్‍ను దూకుడుగా తీసుకొస్తోంది. సినిమాలు, వెబ్ సిరీస్‍లను తీసుకురావడంలో జోరు చూపిస్తోంది. ఈనెల మొదట్లో వచ్చిన శశిమథనం సిరీస్ ఈటీవీ విన్‍లో మంచి సక్సెస్ అయింది. ఈటీవీ విన్ ‘ఎయిర్’ (ఏఐఆర్ - ఆల్‍ఇండియా ర్యాంకర్స్) వెబ్ సిరీస్‍ను గతంలోనే ప్రకటించింది. ఇప్పటికే ఫస్ట్ లుక్ కూడా వచ్చింది. అయితే, ఈ సిరీస్ ఎప్పుడు రానుందో మేకర్స్ తాజాగా వెల్లడించారు.
దీపావళికి స్ట్రీమింగ్
ఎయిర్ వెబ్ సిరీస్ షూటింగ్ మొదలైందని మేకర్స్ వెల్లడించారు. దీపావళికి స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు ప్రకటించారు. అంటే అక్టోబర్ చివరి వారంలో ఈటీవీ విన్ ఓటీటీలో ఈ ఎయిర్ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశం ఉంది.
ఎయిర్ సిరీస్ అందరికీ ఫేవరెట్ అవుతుందని ఈ సిరీస్‍ను సమర్పిస్తున్న సందీప్ రాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "ఈ దీపావళికి టపాసులు మాత్రమే కాదు. నవ్వులు.. కన్నీళ్లు బోనస్‍గా వస్తాయి" అంటూ పోస్ట్ చేశారు సందీప్ రాజ్. కలర్ ఫొటో చిత్రంతో డైరెక్టర్‌గా పాపులర్ అయిన సందీప్ రాజ్ ఈ సిరీస్‍కు ఓ నిర్మాతగా ఉన్నారు. ఈ సిరీస్‍కు జోసెఫ్ క్లింటన్ దర్శకత్వం వహించారు.
షూటింగ్ మొదలైందంటూ ఓ పోస్టర్ వెల్లడించింది టీమ్. హాస్టల్‍లో డైనింగ్ టేబుల్ వద్ద ముగ్గురు విద్యార్థులు దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా ఆ పోస్టర్ ఉంది. దాంట్లోనే షూటింగ్ మొదలైదంటూ పేర్కొంది.
స్టోరీ లైన్ ఇదే..
ఐఐటీలో సీటు సాధించేందుకు విద్యార్థులు పడే కష్టాల చుట్టూ ఎయిర్ వెబ్ సిరీస్ సాగుతుంది. కామెడీ ఎంటర్‌టైనింగ్ డ్రామాగానే ఈ సిరీస్ సాగుతుంది. ఈ సిరీస్‍లో హర్షరోషణ్, భాను ప్రతాప్, జయతీర్థ, సింధు రెడ్డి, వైవా హర్ష ప్రధాన పాత్రలు పోషించనున్నారు. జోసెఫ్ డైరెక్టర్ చేస్తున్న ఈ సిరీస్‍ను సందీప్ రాజ్, సూర్యవాసుపల్లి నిర్మిస్తున్నారు. దీపావళి పండుగకు ఈ సిరీస్ ఈటీవీ విన్‍లో అడుగుపెట్టనుంది.
చినిగిపోయిన ఓఎంఆర్ షీట్ నుంచి ముగ్గురు స్టూడెంట్స్ చూస్తున్నట్టుగా ఎయిర్ వెబ్ సిరీస్ నుంచి ఫస్ట్ లుక్ గతంలో వచ్చింది. ఇప్పుడు తినకుండా ఆలోచిస్తున్న పోస్టర్ రిలీజ్ అయింది. ఐఐటీ ప్రిపరేషన్ అంశంపై వస్తున్న ఈ సిరీస్ చాలా మందికి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
శశిమథనం సక్సెస్
శశిమథనం వెబ్ సిరీస్ జూలై 4వ తేదీన ఈటీటీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. రొమాంటిక్ కామెడీ డ్రామా సిరీస్‍గా రూపొందింది. పవన్ సిద్ధు, సోనియా సింగ్ ఈ సిరీస్‍లో ప్రధాన పాత్రలు పోషించారు. వినోద్ గాలి దర్శకత్వం వహించారు. శశిమథనం మంచి సక్సెస్ అయిందంటూ ఇటీవలే టీమ్ ఓ ఈవెంట్ కూడా నిర్వహించింది. మంచి రెస్పాన్స్ వస్తోందని పేర్కొంది.
కుటుంబ సభ్యులు ఊరెళ్లాలని బాయ్‍ఫ్రెండ్‍ను తన ప్రేయసికి ఇంటికి పిలవడం.. వారు సడెన్‍గా తిరిగి వచ్చేయడంతో అతడిని దాచేసేందుకు ఆ అమ్మాయి పడే కష్టాల చుట్టూ శశిమథనం సిరీస్ వచ్చింది. ఈ సిరీస్ కామెడీతో మెప్పించింది. సోనియా, పవన్ సిద్ధు సహా కీర్తి, రూపలక్ష్మి, కృతిక, అశోక్ చంద్ర, కేశవ్ దీపక్, అవంతి దీపక్, శ్రీలలిత ఈ సిరీస్‍లో కీలకపాత్రలు పోషించారు.
ఈ ఏడాది జనవరిలో ఈటీవీ విన్‍లో వచ్చిన 90s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ చాలా సక్సెస్ అయింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఎక్కువ మంది లైక్ చేసిన సిరీస్ ఇదేనంటూ ఆర్మాక్స్ మీడియా రిపోర్ట్ ఇటీవలే వెల్లడించింది.