అలా చదవడం ఒక రకమైన హింస.. ఈ ఓటీటీ సిరీస్ తల్లిదండ్రులకి గుణపాఠం కావాలి.. బిగ్ బాస్ శివాజీ కామెంట్స్-air all india rankers ott streaming on etv win bigg boss sivaji comments in air all india rankers trailer launch event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  అలా చదవడం ఒక రకమైన హింస.. ఈ ఓటీటీ సిరీస్ తల్లిదండ్రులకి గుణపాఠం కావాలి.. బిగ్ బాస్ శివాజీ కామెంట్స్

అలా చదవడం ఒక రకమైన హింస.. ఈ ఓటీటీ సిరీస్ తల్లిదండ్రులకి గుణపాఠం కావాలి.. బిగ్ బాస్ శివాజీ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలోకి మరో తెలుగు వెబ్ సిరీస్ ఎయిర్ (AIR) డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. జూలై 3 నుంచి ఏఐఆర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఓటీటీ రిలీజ్ కానున్న నేపథ్యంలో తాజాగా జూన్ 28న ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎయిర్ ట్రైలర్ లాంచ్‌లో బిగ్ బాస్ శివాజీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

అలా చదవడం ఒక రకమైన హింస.. ఈ ఓటీటీ సిరీస్ తల్లిదండ్రులకి గుణపాఠం కావాలి.. బిగ్ బాస్ శివాజీ కామెంట్స్

బిగ్ బాస్ తెలుగు 7తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు హీరో శివాజీ. ఆ తర్వాత ఓటీటీ సిరీస్ 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్, కోర్ట్ మూవీలతో సూపర్ హిట్ కమ్ బ్యాక్ ఇచ్చాడు శివాజీ. తాజాగా బిగ్ బాస్ శివాజీ, హీరో సుహాస్ ముఖ్య అతిథులుగా ఓటీటీ తెలుగు వెబ్ సిరీస్ ఏఐఆర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్ ట్రైలర్ లాంచ్‌కు హాజరయ్యారు.

ఏఐఆర్ ఓటీటీ రిలీజ్

సందీప్ రాజ్‌ షో రన్నర్‌గా హర్ష రోషన్, భాను, జయతీర్థ ప్రధాన పాత్రల్లో నటించిన సరికొత్త తెలుగు వెబ్ సిరీస్ ఏఐఆర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్. ఈ ఓటీటీ సిరీస్‌కు జోసెఫ్ క్లింటన్ దర్శకత్వం వహించారు. జూలై 3 నుంచి ఈటీవి విన్‌లో ఏఐఆర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

ఈ సందర్భంగా తాజాగా జూన్ 28న ఏఐఆర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏఐఆర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఏఐఆర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో, బిగ్ బాస్ శివాజీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

టైటిల్ వినగానే

హీరో శివాజీ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. చదువు అనేది చాలా అవసరం. ఆల్ ఇండియా ర్యాంకర్స్.. ఈ టైటిల్ వినగానే ఈటీవీలో #90కి మించి మరో పెద్ద బ్లాక్ బస్టర్ సిరీస్ రాబోతుందని నాకు అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దీనికి కనెక్ట్ అవుతారు" అని అన్నాడు.

"చదువు అనేది నేచురల్‌గా చదవాలి. కేవలం ర్యాంక్స్ కోసం చదవడం అనేది ఒక రకమైన హింస. ఈ ఓటీటీ సిరీస్ అలాంటి తల్లిదండ్రులకి ఒక గుణపాఠం కావాలి. ఈటీవీ సమాజం పట్ల చాలా బాధ్యతగా ఉంటుంది. రామోజీరావు గారు తెలుగు జాతిలో పుట్టిన ఆణిముత్యం. వారి సంస్థ నుంచి వచ్చిన కథల్లో చాలా గొప్ప సందేశం ఉంటుంది" అని శివాజీ తెలిపాడు.

మాతృభాషలో రాసినప్పుడు

"తెలుగులో మాట్లాడితే తెలుగు నటుడుకి ఆ కిక్కు వేరు. అందుకే అందరూ కూడా తెలుగులో స్క్రిప్ట్ రాసుకోవాలని కోరుకుంటున్నాను. తెలుగులో ఉండే మాధుర్యం వేరు. సినిమా అనేది ఎమోషన్. అది మాతృభాషలో రాసినప్పుడు ఇంకా అద్భుతంగా పండుతుంది" అని బిగ్ బాస్ శివాజీ పేర్కొన్నాడు.

"ఈటీవీ విన్ ఓటీటీ కొత్త రకంగా కథల్ని చెప్పాలని ప్రయత్నం చేస్తుంది. ఇది కూడా (ఏఐఆర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్) చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. అందరికీ థాంక్యు"అని హీరో శివాజీ తన స్పీచ్ ముగించాడు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం