రాముడిగా రామ్ చరణ్ అదుర్స్.. రామాయణం క్యాస్టింగ్ పై ఏఐ ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్.. ఎవరు? ఏ క్యారెక్టరో ఓ లుక్కేయండి-ai revealed casting for ramayana movie ram charan as ram mrunal as seeta ranveer as ravana ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  రాముడిగా రామ్ చరణ్ అదుర్స్.. రామాయణం క్యాస్టింగ్ పై ఏఐ ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్.. ఎవరు? ఏ క్యారెక్టరో ఓ లుక్కేయండి

రాముడిగా రామ్ చరణ్ అదుర్స్.. రామాయణం క్యాస్టింగ్ పై ఏఐ ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్.. ఎవరు? ఏ క్యారెక్టరో ఓ లుక్కేయండి

రామాయణం సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ అదిరిపోయింది. కానీ ఇందులో రాముడిగా రణబీర్ కపూర్ నటించడంపై కాస్త అసహనం వినిపిస్తోంది. ఆ క్యారెక్టర్ కు అతను సరిపోలేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామాయణం క్యాస్టింగ్ గురించి చాట్ జీపీటీ కొన్ని ఇంట్రెస్టింగ్ ఆన్సర్లు ఇచ్చింది.

రామాయణం క్యాస్టింగ్

గురువారం (జూలై 3) నితేష్ తివారీ డైరెక్షన్ లో తెెరకెక్కుతున్న రామాయణం మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ గ్లింప్స్ కు రెస్పాన్స్ అదిరిపోయింది. ఈ మూవీలో రాముడిగా రణబీర్ కపూర్, రావణుడి పాత్రలో యష్ నటిస్తున్నారు. సీతగా సాయి పల్లవి, లక్ష్మణ్ పాత్రలో రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్ యాక్ట్ చేస్తున్నారు. రామాయణం ఆధారంగా రెడీ అవుతున్న ఈ సినిమాలో కొన్ని క్యారెక్టర్లను చేసిన నటులపై కాస్త అసహనం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రాముడిగా రణబీర్ కపూర్ సెట్ కాలేదని అంటున్నారు.

ఏఐ ఏం చెప్పిందంటే?

రామాయణం సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. అయితే ఈ ఇద్దరికీ ఈ క్యారెక్టర్లు సెట్ కాలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐని రామాయణం క్యాస్టింగ్ గురించి అడిగితే ఇంట్రెస్టింగ్ ఆన్సర్లు ఇచ్చింది.

‘‘రామాయణం లాంటి ఇతిహాస సినిమాటిక్ రీటెల్లింగ్ కోసం భారతీయ నటులను ఎంపిక చేయడానికి.. ముఖ్యంగా రాముడు, సీత, రావణుడి వంటి పాత్రల కోసం ఆకర్షించే, స్క్రీన్ ప్రజెన్స్, యాక్టింగ్ డెప్త్ ఉండే యాక్టర్లు అవసరం’’ అని ఛాట్ జీపీటీ వెల్లడించింది.

రామ్ చరణ్ పేరు

రాముడి క్యారెక్టర్ కోసం రామ్ చరణ్, హృతిక్ రోషన్ పేర్లను ఛాట్ బాట్ సూచించింది. ‘‘దయ, నైతిక అధికారం, నిగ్రహించుకునే బలం, దైవిక ప్రశాంతత’’ అనేవి రాముడు క్యారెక్టర్ కు అవసరం అని చాట్‌బాట్ పేర్కొంది ‘‘ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ పేరు కచ్చితంగా సరిపోతుంది’’ అని ఛాట్ జీపీటీ తెలిపింది. హృతిక్ రోషన్ కు రాయల్ ఉనికి, ప్రశాంతమైన బలం, దైవిక ప్రకాశం ఉందని చెప్పింది. విక్కీ కౌశల్, దేవ్ పటేల్ పేర్లను కూడా ఏఐ రికమండ్ చేసింది.

రాముడిగా రామ్ చరణ్ ఏఐ గెటప్
రాముడిగా రామ్ చరణ్ ఏఐ గెటప్ (Created by AI)

సీతగా ఆ నటి

సీతగా మృణాల్ ఠాకూర్ పేరును ఛాట్ జీపీటీ సూచించింది. సాయి పల్లవి కాకుండా ఏఐ బాట్ ప్రకారం.. ఈ పాత్రకు ఫస్ట్ ఎంపిక మృణాల్ ఠాకూర్. సీతా రామంలో మృణాల్ నటనే అందుకు నిదర్శనం అని ఛాట్ జీపీటీ పేర్కొంది. దీపికా పదుకొనే, త్రిప్తి దిమ్రీ, అదితి రావు హైదరి లాంటి ఇతర హీరోయిన్ల పేర్లను కూడా సీత క్యారెక్టర్ కు ఛాట్ జీపీటీ పేర్కొంది.

రావణుడి క్యారెక్టర్ లో

ఛాట్ జీపీటీ ప్రకారం రావణుడి క్యారెక్టర్ కోసం రణవీర్ సింగ్, ఫహద్ ఫాసిల్ రేసులో ఉన్నారు. అలావుద్దీన్ ఖిల్జీ పాత్ర పోషించినందుకు ప్రశంసలు పొందిన రణవీర్.. రావణుడి క్యారెక్టర్ ను బెటర్ గా ప్లే చేయగలడని ఛాట్ జీపీటీ నమ్మింది. మరోవైపు కేవలం విలన్ కాదు.. విషాదకరమైన యాంటీహీరో అయిన సూక్ష్మమైన, జ్ఞానవంతమైన, తీవ్రమైన రావణుడు అవసరమైతే ఫహద్ సరైన ఎంపిక అని సూచించింది. ఆర్ మాధవన్, చియాన్ విక్రమ్ పేర్లను కూడా ప్రస్తావించింది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం