Aha OTT Movies: ఆహా ఓటీటీలోకి రానున్న మూడు సినిమాలు.. రొమాంటిక్, థ్రిల్లర్, హిస్టారికల్ జానర్లలో.. స్ట్రీమింగ్ డేట్స్-aha ott upcoming movies neeli megha shyama hide n seek and razakar streaming dates thriller historical films ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aha Ott Movies: ఆహా ఓటీటీలోకి రానున్న మూడు సినిమాలు.. రొమాంటిక్, థ్రిల్లర్, హిస్టారికల్ జానర్లలో.. స్ట్రీమింగ్ డేట్స్

Aha OTT Movies: ఆహా ఓటీటీలోకి రానున్న మూడు సినిమాలు.. రొమాంటిక్, థ్రిల్లర్, హిస్టారికల్ జానర్లలో.. స్ట్రీమింగ్ డేట్స్

Aha OTT Movies: ఆహా ఓటీటీలో మూడు ఇంట్రెస్టింగ్ చిత్రాలు అడుగుపెట్టబోతున్నాయి. మూడు డిఫరెంట్ జానర్లతో ఉన్నాయి. ఓ మూవీ నేరుగా స్ట్రీమింగ్‍కు వస్తోంది. మరో చిత్రం థియేటర్లలో రిలీజైన పది నెలల తర్వాత స్ట్రీమింగ్‍కు రానుంది.

Aha OTT Movies: ఆహా ఓటీటీలోకి రానున్న మూడు సినిమాలు.. రొమాంటిక్, థ్రిల్లర్, హిస్టారికల్ జానర్లలో.. స్ట్రీమింగ్ డేట్స్

ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ వరుసగా తెలుగు చిత్రాలను తీసుకొస్తోంది. కొన్ని ఇంట్రెస్టింగ్ చిత్రాలను అందుబాటులోకి తెస్తోంది. ఆహా ఓటీటీలో రానున్న తదుపరి మూడు సినిమాలు.. మూడు డిఫరెంట్ జానర్లలో వస్తున్నాయి. ఇందులో ఒకటి రొమాంటిక్ లవ్ స్టోరీ అయితే.. మరొకటి థ్రిల్లర్ మూవీగా ఉంది. ఇంకో హిస్టారియకల్ యాక్షన్ డ్రామా మూవీ రానుంది. ఆ సినిమాలో ఏవో.. ఆహా ఓటీటీలోకి ఏ తేదీల్లో రానున్నాయో ఇక్కడ చూడండి.

నీలి మేఘ శ్యామ

రొమాంటిక్ కామెడీ మూవీ నీలి మేఘ శ్యామ.. ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో రేపు (జనవరి 9) స్ట్రీమింగ్‍కు రానుంది. హిమాలయాల్లో ట్రెక్కింగ్‍కు వెళ్లిన అమ్మాయి, అబ్బాయి లవ్‍స్టోరీ చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ఈ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఆహా ఓటీటీలోకే స్ట్రీమింగ్‍కు వస్తోంది. ఈ మూవీలో విశ్వదేవ్ రాచకొండ, పాయల్ రాధాకృష్ణ లీడ్ రోల్స్ చేశారు. నీలి మేఘ శ్యామ మూవీని డైరెక్టర్ రవి ఎస్ వర్మ తెరకెక్కించారు. ఈ చిత్రానికి శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఇటీవలే వచ్చిన ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గా ఉంది. రేపు ఈ చిత్రం ఆహాలో ఎంట్రీ ఇవ్వనుంది.

హైడ్ న్ సీక్

క్రైమ్ థ్రిల్లర్ మూవీ హైడ్ న్ సీక్ (Hide N Seek) చిత్రం ఆహా ఓటీటీలో ఈ వారం జనవరి 10వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రంలో విశ్వాంత్ దుడ్డంపూడి, రియా సచ్‍దేవ్, శిల్పా మంజునాథ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఓ మర్డర్ మిస్టరీ చుట్టూ ఈ మూవీ ఉంటుంది. ఈ చిత్రానికి బసిరెడ్డి రాణా దర్శకత్వం వహించారు. సహస్ర ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్ నిర్మించింది. థియేటర్లలో గతేడాది రిలీజ్ అయిన హైడ్ న్ సీక్ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇప్పుడు జనవరి 10 నుంచి ఆహా ఓటీటీలో ఈ థ్రిల్లర్ మూవీని చూడొచ్చు.

రజాకార్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా మూవీ ‘రజాకార్’.. జనవరి 24వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది. నిజాం పాలనకు, దురాగతాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీలో రాజ్ అర్జున్, బాబీ సింహా, మార్కండ్ దేశ్‍పాండే, అనసూయ, ఇంద్రజ, వేదిక ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి యాట సత్యనారాయణ దర్శకత్వం వహించగా.. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. రజాకార్ చిత్రం గతేడాది మార్చి 15వ తేదీన థియేటర్లలో రిలీజైంది. మిశ్రమ స్పందన దక్కించుకుంది. ఈ మూవీ దాదాపు పది నెలల తర్వాత ఈ చిత్రం ఆహా ఓటీటీ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది.

సంబంధిత కథనం