Unstoppable with NBK: అన్‍స్టాపబుల్ తదుపరి ఎపిసోడ్‍పై హింట్ ఇచ్చిన ఆహా.. పాన్ ఇండియా అంటూ.. ఎవరు రానున్నారంటే!
Unstoppable with NBK: అన్‍స్టాపబుల్ టాక్ షో నెక్ట్స్ ఎపిసోడ్‍పై ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ హింట్ ఇచ్చింది. పాన్ ఇండియా ఎపిసోడ్‍కు సిద్ధంగా ఉండండి అంటూ ఊరించింది. వివరాలివే.
Unstoppable with NBK: నట సింహం, సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న పాపులర్ టాక్ షో ‘అన్‍స్టాపబుల్’కు ఫుల్ క్రేజ్ ఉంది. ఇప్పటి వరకు రెండు సీజన్లు ఫినిష్ అయ్యారు. ప్రస్తుతం అన్‍స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ నడుస్తోంది. ఈ అన్‍స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ ఫస్ట్ ఎపిసోడ్‍లో భగవంత్ కేసరి మూవీ టీమ్ సందడి చేసింది. ఇక, అన్‍స్టాపబుల్ తదుపరి ఎపిసోడ్ గురించి ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ నేడు (నవంబర్ 11) ఓ హింట్ ఇచ్చింది. ఆ వివరాలివే..
అన్‍స్టాపబుల్ నెక్ట్స్ ఎపిసోడ్ గురించి ఆహా నేడు ఓ ట్వీట్ చేసింది. “అన్‍స్టాపబుల్ విత్ ఎన్‍బీకే అదిరిపోయే పాన్ ఇండియా ఎపిసోడ్ కోసం సిద్ధంగా ఉండండి” అని ఆహా పోస్ట్ చేసింది. వివరాలను త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. అయితే, అన్‍స్టాపబుల్‍కు యానిమల్ మూవీ టీమ్ రానుందని ఇప్పటికే లీక్‍లు వచ్చాయి. ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న బాలీవుడ్ స్టార్ రణ్‍బీర్ కపూర్, హీరోయిన్ రష్మిక మందన్నా, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. అన్‍స్టాపబుల్ షోలో పాల్గొంటున్నారని తెలిసింది.
యానిమల్ మూవీ ప్రమోషన్లలో భాగంగా రణ్‍బీర్, రష్మిక, సందీప్ రెడ్డి వంగా అన్‍స్టాపబుల్‍కు రానున్నారు. ఈ షోతో తెలుగులో ఆ చిత్రానికి మంచి హైప్ వస్తుందని మూవీ యూనిట్ భావిస్తోంది. అలాగే, అన్‍స్టాపబుల్ షోకు బాలీవుడ్ హీరో రావడం కూడా ఇదే తొలిసారి కానుంది.
అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ యానిమల్ మూవీ డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో వైలెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు హీరో రణ్‍బీర్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌తో యానిమల్‍పై అంచనాలు మరింత పెరిగాయి.
యానిమల్ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి దిమ్రి కూడా కీలకపాత్రలు చేశారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ డిసెంబర్ 1న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. భూషణ్ కుమార్, కృషాన్ కుమార్, మురాక్ ఖేతానీ, ప్రణయ్ రెడ్డి వంగా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.